11/04/2012

శుష్క హాసం


నలుగురిలో ఉన్నా ఒంటరిగానే  ఉంటున్నాను,
పదుగురితో ఉన్నా పరధ్యానంగానే  ఉంటున్నాను.

అందరి నవ్వుల్లో సహజత్వం ఉంటే...
నా నవ్వులోని  కృత్రిమత్వం... 
నాకు కూడా  స్పష్టంగా కనిపిస్తోంది.



నా పెదవిపై విరిసే శుష్క హాసాన్ని..
లోకం గుర్తిస్తోంది...
వింతగా చూస్తోంది...
కారణాలు వెతుకుతోంది...
నన్ను ప్రశ్నిస్తోంది...

మనసులోని  బాధని...
చిరునవ్వుల ముసుగులో దాచాలనే 
నా వ్యర్థ ప్రయత్నం ఇంకెంత కాలం చెయ్యాలో?
నా నిర్జీవమైన చిరునవ్వుకి 
ప్రాణమున్నట్లుగా  చూపాలంటే ఇంకెన్ని రంగులు పూయాలో???

6 comments:

  1. inkenni rangulu pooyaalo?
    fine...

    ReplyDelete
  2. పద్మార్పిత గారూ!
    ధన్యవాదములు...
    మీది శుష్క హాసం కాదు కదా???
    @శ్రీ

    ReplyDelete
  3. ధన్యవాదాలు జలతారువెన్నెలగారూ!
    @శ్రీ

    ReplyDelete
  4. :):) బాగుందండీ!

    ReplyDelete
  5. మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
    :-)
    @శ్రీ

    ReplyDelete