31/05/2012

నీకోసం.......


అన్ని కవితలు వ్రాస్తున్తావు...
నా గురించి ఓ మంచి కవిత అల్లగలవా?
అంటూ సవాల్ చేస్తే, 
ద్యూతానికి పిలిస్తే రానని 
చెప్పలేని ధర్మరాజులా....
సవాల్ స్వీకరించి 
కలం కదపడం మొదలు పెట్టాను....

లేనివి ఊహించి 
అతిశయోక్తి  అలంకారాలు జోడించి...
నా 'ఊహా సుందరి' గురించి 
ఏదో వ్రాసేయడం అలవాటయిపోయింది..

ఇప్పుడు ఎదురుగా ఉన్న వాస్తవం గురించి వ్రాయాలంటే 
బెదురుగా ఉంది...కలం వణుకుతోంది...
భయపడుతున్నానని అనుకుంటున్నావా???
నీ రూపం,
నీ ప్రేమ,
నీ స్నేహం,
అన్నిటి గురించి వ్రాయాలంటే...
నాకు ఉన్న భాషా పరిజ్ఞానం
చాలదేమోనని భయం...
పదకోశాన్ని శోధించినా 
నాకు కావాల్సిన పదాలు దొరకవేమోనని చింత...

అయినా ప్రయత్నిస్తాను... 
నీ సౌందర్యాలాపన  చేయలేమని
రాగాలు సైతం మూగబోయాయి. 

నీ రాజీవ నేత్రాలను వర్ణింపలేమని
పదాలన్నీ సిగ్గుతో నేలచూపులు చూస్తున్నాయి.

నీ స్నేహ మాధుర్యానికి  
మకరందాలు సాటి రావని 
మళ్ళీ విరుల లోతుల్లోకి దారి చేసుకున్నాయి...

నీ ప్రేమామృతానికి 
క్షీరసాగర జనిత సుధలు సైతం పోటీకి రాలేమని
మరల శ్వేతసాగరగర్భం లోనికి
తిరిగి వెళ్లిపోయాయి...

నేను... నీకు దొరికిన 'కానుక'
అని నువ్వు అంటుంటావు గానీ 
నీవు... నాకు దొరికిన 'వరం' 
అని నేనంటాను...

ఏమిటో! మంచి పదాలు 
దొరికినట్లే దొరికి మాయమైపోతుంటే,
అందమైన భావాలు తడబడిపోతుంటే... 
ఏమని వ్రాయను?
నీకు తగిన పదాలు నా కలానికి అందినపుడు 
కాస్తంత అందంగా వ్రాసే ప్రయత్నం మళ్ళీ చేస్తాను ప్రియా!!!...                           @శ్రీ 

15 comments:

  1. శ్రీ గారూ , రాసేది కలమే అయినా , రాయించేది హృదయమే , ఎంత అద్భుతమైన పదాల పొందిక . " నీ ప్రేమకు సాటి రాలేమని మకరందాలు విరులలోకి జారుకున్నాయి " వహ్.. ఎంత మదురమైన భావన . ఈ కవిత గూర్చి ఎంత చెప్పినా తక్కువే ఓ అందమైన వెన్నెల సోయగం

    ReplyDelete
    Replies
    1. నా కవితపై మీ ప్రశంసాపూర్వకమైన స్పందనకు ధన్యవాదాలు ఫాతిమా గారూ!
      మీ విశ్లేషణ నాకు నచ్చేసిందండీ!
      @శ్రీ

      Delete
  2. Replies
    1. thank you srujana gaaroo!
      welcome to my blog...
      @sri

      Delete
  3. సో ఇప్పటివరకూ రాసినవన్నీ ఊహా సుందరి కవిత్వాలన్నమాట!
    ఇప్పుడు రాసినది మాత్రం హృదయస్పందన అన్నమాట!
    బాగుందండోయి కవిత..(చిత్రం చాలా బాగుంది..)

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ!
      :-)
      కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
      చిత్రం పేరు చెప్పనా?
      "moon goddess"
      నాకు కూడా చిత్రం బాగా నచ్చిందండీ!
      @శ్రీ

      Delete
  4. Replies
    1. thank you sir..thanks for your compliment on my poetry..
      @sri

      Delete
  5. thank you phaneendra gaaroo!
    @sri

    ReplyDelete
  6. manchi paata, manchi manasu maata rendu baagunnaayi. Entha nijaayeetigaa cheppaaru..kavita! very nice!!

    ReplyDelete
  7. మనసు మాట...
    మంచి పాట...
    మీకు నచ్చినందుకు
    నా మనో భావాలు మీరు మెచ్చినందుకు
    మీకు ధన్యవాదాలు వనజ గారూ!
    @శ్రీ

    ReplyDelete
  8. మిమ్మల్ని అభినందించాలంటే 'అసహాయులం' అంటూ అక్షరాలు సైతం సిగ్గుపడిపోతున్నాయి. ఏమని చాటను మీ కవితా వైభవాన్ని? ఒదిగిస్తారు, పొదిగిస్తారు మీ భావాల మణులను... అందంగా, హృద్యంగా భాషా కనకంలో పెట్టి... అంతే మంచి మంచి ఆభరణాలు కవితారూపం లో తయార్...

    ReplyDelete
  9. భలేవారు ఎంత మాట కరుణ గారూ...మీ అభిమానం ...ఆత్మీయతలతో కూడిన ప్రశంస చాలా సంతోషాన్నిచ్చింది....ధన్యవాదాలు ...@శ్రీ

    ReplyDelete