21/02/2012
20/02/2012
ప్రేమ
ప్రేమంటే.....
చిమ్మ చీకటిలో కనిపించే కాంతికిరణం...
మిరుమిట్లు గొలిపే కాంతిలో కనిపించే ఛాయ...
మాటల్లో కనిపించే నిశ్శబ్దం....
నిశ్శబ్దంలో వినిపించే సవ్వడి...
కంట కన్నీరొలికే సమయంలో చిరునవ్వు చిందింప చేస్తుంది...
నవ్వుతున్న కంట కన్నీరొలికిస్తుంది....
అందుకే ప్రేమంటే కొందరికి వరం ...
మరి కొందరికి శాపం..... @శ్రీ
మరి కొందరికి శాపం..... @శ్రీ
అన్వేషణ
నేను నిన్ను ఎప్పుడు పోగొట్టుకున్నానో నాకే తెలియదు ...
నీకోసం మొదలైంది నా అన్వేషణ.
పూల పరిమళాలలో వెతికాను నీకోసం...
పున్నమి నాటి వెన్నెల్లో వెతికాను.....
ఎగసి పడే సాగర తరంగాలలో వెతికాను...
గల గల పారే సెలయేటిలో వెతికాను
అందమైన జలపాతాలలో వెతికాను ....
ఎంత మూర్ఖుడినో చూసావా?
అన్నింటి కంటే
అందమైన నా మదిలో..
నిన్ను వెతుక్కోలేదు చూడు.
19/02/2012
కానుక
స్టూడెంట్ లైఫ్ దేవుడు ఇచ్చిన వరం
దాన్ని అనుభవించండి హాయిగా.....
అబ్బాయిలూ! అమ్మాయిలతో చాటింగ్ చేయండి
అమ్మాయిలూ! ఆడండి, పాడండి, ఆనందంగా ఉండండి.
కానీ, అన్నీ హద్దుల్లోనే సుమా!
ఒక్కసారి మీ మీద మీ కన్నవాళ్ళు పెట్టుకున్న ఆశలను గుర్తుకి
తెచ్చుకోండి.
మీకు మొబైల్ కొని ఇవ్వాలంటే మీ నాన్న తనకి అవసరమైనదేదో
కొనుక్కోవడం మానేసారేమో?
మీకు మంచి డ్రెస్ కొనడానికి మీ తల్లి పండుగ చీర
కొనుక్కోవడం మానేసిందేమో?
మీ ఆట పాటలతో బాటు మీ మీ లక్ష్యాలను సాధించే దిశగా ,
ఆకాశమే హద్దుగా పరుగులు తీయండి...
ఆ లక్ష్యం సాధించాక విజయ గర్వంతో మీరు చేసే దరహాసమే
మీ తల్లిదండ్రుల కళ్ళల్లో కోటి కాంతులు నింపుతాయి...
ఆ కాంతులే మీరు వారికిచ్చే నిజమైన కానుకలు.....
Subscribe to:
Posts (Atom)