ప్రవాహాలలో చురుకుగా కదిలే
మీనాల పదచిహ్నాలు
లెక్కించడం వచ్చు నాకు...
చిక్కటి నిశీధిలో
కనిపించని నల్లని అంధకారాన్ని
వెదికి పట్టుకోవడం తెలుసు నాకు...
మిరుమిట్లు గొలిపే వెలుతురులో
మిణుగురుల కదలికను గుర్తించడం
వెన్నతో పెట్టిన విద్య నాకు...
కంటికి తెలియకుండా
కనుపాపను సైతం
దొంగిలించగల నేర్పు
ఈ మధ్యే అలవడింది నాకు...
ఇన్ని నేర్చుకున్నా
నీ ప్రావీణ్యం ముందు
నా కౌశలం తల వంచింది...
అందుకే...
నీకు మాత్రమే తెలిసిన...
"మనసుకి తెలియకుండా
మనసుని హరించే విద్య"
నాకు కూడా కాస్తంత నేర్పవూ???
అందుకే...
నీకు మాత్రమే తెలిసిన...
"మనసుకి తెలియకుండా
మనసుని హరించే విద్య"
నాకు కూడా కాస్తంత నేర్పవూ???