ప్రభాత సమీరం,మెత్తటి నా
మునివేళ్ళు...
చెదిరిన నీ
ముంగురులను సరి చేయాలని
పోటీ
పడుతున్నాయి...
సూర్యుని తొలి కిరణం...
నా పెదవి అరుణం ...
నీ నుదిటిపై సిందూరపు ముద్దు
అద్దాలని పోటీ పడుతున్నాయి.
కోకిల
కలరవాలు...నా తీపి మాటల
గుసగుసలు...
నీ చెవిని
చేరాలని
పోటీ
పడుతున్నాయి.
చల్లని పిల్లగాలి ..... వెచ్చని నా కౌగిలి...
నిన్ను చుట్టేయాలని
నిన్ను చుట్టేయాలని
పోటీ
పడుతున్నాయి...
ఎవరిని గెలిపిస్తావు?
నన్ను గెలిపించి, నువ్వు
గెలుస్తావా?
నన్ను ఓడించి, నువ్వోడిపోతావా ???
sree garu premalo okarini inkokaru gelipinchukuntaru taamu istamga odipothu, kavithabagundi
ReplyDeletethank you...faatimaa gaaroo!
ReplyDeleteantee kadandee...ishtamlo odipovadam maree ishtamgaa untundandoy...@sri