నేను బయటపడేదెలా?అలికిడైతే చాలు...
నీ మోహన మురళీగానమేమోనని
ఉలికిపడి నిద్రలోంచి లేచి చూడటం
అలవాటుగా మారిపోయింది నాకు.
గది కిటికీ నుంచి నా నుదుటిని
తాకే ప్రభాత కిరణం...
నీ వెచ్చని కరస్పర్శేమోనని భ్రమించడం
అలవాటుగా మారిపోయింది నాకు.
నిత్యం నీ మనో'సందేశమే'....
మేలుకొలుపుల
శుభ ప్రభాతం అవుతోంది నాకు.
ఇంటి నలుమూలలా నిన్నే చూస్తున్నాను...
రేయింబవళ్ళు నిన్నే చూస్తున్నాను...
ప్రతిక్షణం నీ మాటలే వినిపిస్తున్నాయి...
అంతెందుకు ప్రియతమా!
నన్ను నేను చూసుకొనే అద్దంలో కూడా
నీ రూపమే కనిపిస్తుంటే యెలా?
నీ ఆలోచనల నుంచి నేను బయటపడేదెలా?
నీ వలపుల తలపుల 'వల' నుంచి నేను బయటపడేదెలా?
బావుంది కవిత.
ReplyDeleteబయట పడకండి...ఆ భావాలన్నీ ఆశ్వాదించండి ;)
ధన్యవాదములు.
Delete