ప్రియా!
నీ ప్రేమలేఖ లోని అక్షరాలు
సుగంధాలు విరజిమ్మే నందనవన పారిజాతాలు,
నిశ్చలమైన నా మనోకాసారంలో
వికసించిన ప్రేమారవిందాలు.
అ రంగుల దారాలతో కలనేసిన చీరకట్టులో
నీవున్నట్లే అనిపిస్తుంది ...నా కళ్ళెదుట.
పదాల వెంట పరుగులు తీసే కళ్ళకంటే,
నా మనసే వేగంగా చదువుతుంది...
నీ మనసులోని ప్రతి తలపును.
నీ లేఖలు....
మనసును కమ్ముకున్న చీకటి మేఘాలను
చెల్లాచెదురు చేసే వెన్నెల కిరణాలు....
వలపు తాపాలను చల్లార్చే మంచు తుఫానులు....
మదిలోనికి చొచ్చుకోనిపోయే మదనుని శర పరంపరలు....
అందుకే అడుగుతున్నాను..
నా మనసు మెచ్చే...
నీ మనసుకి నచ్చే...
ప్రేమలేఖలు రాయడం మళ్ళీ మొదలెట్టవూ?
@శ్రీ
Yes....star again!
ReplyDeleteధన్యవాదములు....
ReplyDeleteమీ బ్లాగ్ లో చిత్రాలు చాలా బాగున్నాయండీ!
@శ్రీ