నిను చూడాలని ఉన్నప్పుడు
కనులు మూసి.....నీ రూపాన్ని తలచుకుంటూ..
నీతో గడిపిన వెన్నెల రాత్రులు గుర్తు చేసుకుంటూ...
నీతో ఉన్నప్పటి మధుర క్షణాలను
మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ....
మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటూ....
అలా స్వప్నాల లోనికి మెల్లగా జారుకుంటాను....
నీ ప్రణయ పరిమళాన్ని చూస్తాను...
నీ స్నేహసౌరభాన్నీ చూస్తాను....
ఇంకా ఎన్నో.......కంటికి కనిపించని భావాలు...
అనుభూతుల ద్వారా మాత్రమే తెలుసుకోనేవి..
ఒకదాని వెనుక మరొకటి...
చలనచిత్రం లోని దృశ్యాల్లా కదులుతూ ఉంటాయి మెల్లగా...
చలనచిత్రం లోని దృశ్యాల్లా కదులుతూ ఉంటాయి మెల్లగా...
నీ రూపం మాత్రం అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది...
మంచు తెరల చాటు ముగ్ధ కుసుమంలా...
మేఘ మాలికల చాటు చంద్రబింబంలా...
కనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని
భయపడుతూనే....
నిన్ను చూడాలనే తపనతో
కనులు తెరిచి చూస్తాను.....
నా ఎదురుగా నను వెక్కిరిస్తూ కనిపిస్తుంది
"నా ఏకాంతం......అత్యంత స్పష్టంగా" .....
baavundi
ReplyDeleteమీకు ధన్యవాదాలండీ!
Deleteస్వాగతం నా బ్లాగ్ కి
@శ్రీ...
wow
ReplyDeleteకనులు తెరిస్తే స్వప్నం చెదిరి పోతుందేమోనని
భయపడుతూనే....
నిన్ను చూడాలనే తపనతో
కనులు తెరిచి చూస్తాను.....
super andi
ప్రిన్స్ .... ధన్యవాదాలండీ!
Deleteమీకు నా కవితలోని భావాలు నచ్చినందుకు...
@శ్రీ...
శ్రీ గారూ , మీ కవిత చదువుతుంటే శ్రీనాదుడు వచన కవిత్వం రాసినట్లుంది . అక్షరాలన్నీ తేనె అలల మీద తేలియాడుతున్నాయా? అని సందేహం కలుగుతుంది . చక్కటి పదాల పొందిక , రమణీయమైన వర్ణన . సార్ మీ కవితలు ఈ మద్య కొత్తగా ఉంటున్నాయి . అంటే చాలా బాగున్నాయి అని అర్ధం .
ReplyDeleteఫాతిమా గారూ! నా పదాలు ,అక్షరాలు అలా తేలుతున్నాయో లేదో గాని నేను మాత్రం గాలిలో తేలిపోతున్నానండీ!
Delete:-))))
నేను ఎలాగూ "శ్రీ "నాథుడినేనండీ!...:-))
మీకు నా మనో భావాలు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది...
@శ్రీ
మంచి పరిశీలన...కలలెందుకు ఏకాంతమంత స్పష్టంగా ఉండవు?
ReplyDeleteభావాన్ని చలా చక్కగా కవితలో పొందుపరచారు...
Simply Superb!
కవితలోని లోతును గ్రహించినందుకు
Deleteకవితను మీరు మెచ్చినందుకు
మీకు ధన్యవాదాలు 'చిన్ని ఆశ' గారూ!
@శ్రీ
chala bhagha raasaaru sir,
ReplyDeletenice one.
కవిత మీరు మెచ్చినందుకు
Deleteమీకు నా ధన్యవాదాలు భాస్కర్ గారూ!
@శ్రీ
అనిర్వచనీయమైన ఆ జ్ఞాపకాలను కవితలో అందంగా పొదిగారు.
ReplyDeleteరవిశేఖర్ గారూ!
Deleteనా పదాల అమరిక మీకు నచ్చినందుకు
ధన్యవాదాలండీ!
@శ్రీ
చాలా బాగుంది.. శ్రీగారు...
ReplyDeleteసాయి గారూ!
Deleteధన్యవాదాలండీ మీకు...
@శ్రీ
కనురెప్పలు మూతపడితే..
ReplyDeleteక్షణం క్షణం కలల కలకలం.
కనులు తెరిచి చూస్తేనేమో..
నువ్వొదిలి వెళ్ళిన ఒంటరితనం.
కవిత చాలా బాగుంది శ్రీ గారు.చిత్రం గురించి మళ్ళీ చెప్పను..default value assigned already! all the pictures you choose are simply superb!
కవితలోని సారాన్ని అలా నాలుగు వాక్యాల్లో చక్కగా చెప్పారండీ!
Deleteచిత్రం, కవిత మిమ్మల్ని ఆకట్టుకుందంటే చాలా సంతోషం.
మీకు ధన్యవాదాలు వెన్నెలగారూ!
మీరు మీ బ్లాగ్ లో వ్యాఖ్యలకి ప్రతిస్పందనగా వ్రాసారు
"కవిత కంటే వ్యాఖ్యలే ఎక్కువ సార్లు చదువుతాను"
నేను కూడా డిటో...:-))
నేను చేసిన వ్యాఖ్యకి వారి ప్రతిస్పందన కూడా నేను అంతే ఆశక్తితో
వాళ్ళ బ్లాగ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటాను...!..:-)
@శ్రీ
శ్రీ గారు,
ReplyDeleteఅందమైన భావాలను మరింత అందంగా చెప్పారు. బాగుంది.
జలతారువెన్నెల గారు,
పై మాటలు మీవా? మీ వ్యాఖ్య చూసి కోట్ చేశారు చాలా బాగుంది అనుకుంటూ వచ్చాను. జిస్ట్ మీరిలా చెప్పారన్నమాట. చాలాబాగుందండి.
శ్రీ గారి కవిత చదివాక నాకు కలిగిన స్పందన ఆ నాలుగు లైన్లో అలా..తెలిపాను లక్ష్మి దేవి గారు!మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. అమ్మో శ్రీ గారు, ఇది మీ బ్లాగ్ యే నండి.. నాది కాదు అని ఇప్పుడే గుర్తొచ్చింది!
Deleteలక్ష్మీ దేవి గారూ!
Deleteమీకు నా కవితా భావం నచ్చినందుకు ధన్యవాదాలు...
వెన్నెలగారిని నాకవిత నచ్చక పోయినా...
మంచి వ్యాఖ్య చేయమని చెప్తానండి
:-)))
@శ్రీ
వెన్నెలగారూ!...
Deleteమీరు తస్మదీయులే కదండీ...:-)))
అందుచేత మరేమీ అనుకోనండీ!
@శ్రీ
అత్యంత స్పష్టం గా ,మధురం గా ఉంది మీ ఏకాంతభావం
ReplyDeleteచాలా బాగుంది శ్రీ గారు :) :)
((అయినా మీరు ఏకాంతం గా ఎక్కడున్నారూ...!!??అనుక్షణం ,కలలో కూదా ఎదో ఒక భావన తో కలిసే ఉంటారు కదా..........!!) ;)
మీ ప్రశంసకి చాలా చాలా ధన్యవాదాలు సీత గారూ! :-)
Deleteమీరలా అంటే నేను ఏమి చెప్పనండీ!...:-)))))))
@శ్రీ
బాగుంది ......కృష్ణ
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు కృష్ణ గారూ!
Delete@శ్రీ