ప్రతి ఆదివారం జరుగుతోంది
అదే తంతు...
సరిగ్గా ఉదయం పదకొండయ్యేసరికి...
ఆ ఆసుపత్రి I C U లో జరుగుతోందీ ఘటన...
ఆ మంచం మీద పడుకున్న వారెవ్వరూ
చావునుంచి తప్పించుకోలేక పోతున్నారు.
ఇదేదో 'మానవాతీత శక్తి చేసే పని' అని
అందరు డాక్టర్లు అనుకున్నారు.
బైటనుంచి ప్రఖ్యాత వైద్యులని పిలిచారు...
వాళ్ళని బృందంగా చేసారు...
ఆదివారం వచ్చింది...
మంచానికి దూరంగా చాటుగా నక్కి
కూర్చున్నారంతా...
పరిశోధన మొదలైంది...
తొమ్మిదయింది...టెన్షన్ మొదలైంది...
పదయింది...పదిన్నర అయింది...
సరిగ్గా పదకొండు అవడానికి
ఐదు నిముషాలు మాత్రమే ఉంది...
అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి..
ఇంకో ఐదు నిముషాల్లో
మరో చావు చూడాలేమోనని భయపడుతున్నారు...
ఇంతలో వచ్చింది 'ఆదివారం పార్ట్ టైం స్వీపర్'
రాములమ్మ...
నెమ్మదిగా ఆ మంచం దగ్గరికొచ్చింది...
చేతి సంచిలోని మొబైల్ తీసింది...
చార్జర్ తీసింది...
......
......
.....
ఆ బెడ్ కి ఉన్న life support system ప్లగ్ తీసింది...
అందులో చార్జర్ పెట్టి ...కూనిరాగం తీస్తూ
చీపురందుకుంది........ :-)
hahahahhaa
ReplyDeleteమీ పెదవులపై పెద్ద నవ్వే వచ్చినట్లుంది ప్రిన్స్...
Deleteఓ మూడు వాక్యాల మెసేజ్ చూసి అల్లాను.
:-))))....
@శ్రీ
o..no......
ReplyDeletebut in my poetry yes...it is.....
Delete:-))...:-))
ఓ అలా జరిగిందా!!!!
ReplyDeleteఈ సారికి ఇలా జరిగిపోయింది.
Deleteమళ్ళీసారి రాములమ్మని ఆపేద్దాం ప్లగ్ తీయకుండా...
:-))...:-))
@శ్రీ
ప్రాణాలు పోతాయని తెలిసి ఉండదు పాపం!
ReplyDeleteమనమెవ్వరం ఆమెకి ముందు చెప్పలేదు కదండీ!
Deleteఅందుకే పా....పం తెలియలేదు ఆమెకి...:-)...:-)
@శ్రీ
hahhahahahhaha
ReplyDeletewelcome to my blog nestam...
Deleteam also welcoming with :-))...:-))
@sri
:):)
ReplyDelete:))....:-)
ReplyDelete@sri
ఇది రాములమ్మ పనేనా ??? శ్రీ గారూ .. అలోచించాల్సిందే
ReplyDeleteఅవునండీ!
Deleteనా పని అని అనుకోవద్దుసుమా!
:-)
@శ్రీ
అయ్యో రామా.. అలా అవుతుందని అస్సలు ఊహించనేలేదు అండీ....
ReplyDeleteనాకు నవ్వు ఆగడంలేదు.. సూపర్...
సాయీ!
ReplyDeleteనీ సెంచరీలు కొట్టినందుకు
ఈ కవితే "నవ్వుల నజరానా " అనుకోవాలి మరి.
:-))
కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...
@శ్రీ
మొత్తానికి ఎంతో టెన్షన్ పెట్టి నవ్విన్చేసారు ..:)) సూపర్ శ్రీ గారు...
ReplyDeleteఇది చిన్న మెసేజ్ రూపంలో చదినపుడు నేను అంతే టెన్షన్ పడ్డానండీ!:-)
ReplyDeleteధన్యవాదాలు సీత గారూ!
@శ్రీ
😁😁😁😁😁 బాబోయ్ ఫస్ట్ అర్థం కాలేదు ...
ReplyDeleteఅర్థమయ్యాక నవ్వు ఆగట్లేదు...😁😁