06/07/2012

నా చెవిలో...నా పేరే...



తొలికోడి కూత...
అలారం మోత...
పాలవాడి కేక...
పేపరువాడి అరుపు...
ఏవీ వినిపించటం లేదు.

కాలింగ్ బెల్ సౌండు...
కుక్కర్ విజిల్...
మైక్రోవేవ్ బీప్...
వాషింగ్ మెషిన్ టైమరు శబ్దం...
అసలు తెలియడం లేదు...

అనుక్షణం నా చెవిలో 
నా పేరే..మాటిమాటికీ వినిపిస్తోంది...
ఎందుకో తెలియటం లేదు...
ఈ వింత సమస్యకి పరిష్కారం దొరకడం లేదు...

డాక్టర్ టెస్టులన్నాడు...
స్కేనింగులన్నాడు...
అరకు వేసాడు...
చెవి క్లీన్ చేసాడు...
వైద్యులందరిదీ ఇదే వైద్యం...
బోలెడు ఫీజు అయింది వారికి నైవేద్యం...
అయినా ఫలితం శూన్యం...

నీకు చెప్తే గేలిచేస్తావేమోనని భయం...
నాలో చేసుకున్నాను అంతర్మథనం...
తెలిసింది దీని వెనుక ఉన్న రహస్యం...
చెప్పేస్తా విను సాంతం....


పెళ్లి అయినప్పటి నుండి 
ప్రతిరాత్రి నాకిష్టమైన నీ గుండెలనే
తలదిండుగా చేసుకొని పడుకుంటుంటే,


నీ హృదయస్పందనల నేపథ్య సంగీతంతో,
నీ గుండెలోతుల్లోనుంచి
నిముషానికి 72 సార్లు
నా పేరే నా చెవికి మధురంగా వినిపిస్తుంటే,

నిద్ర లేచాక కూడా అదే పేరు 
చెవిలో పదే పదే  తీయగా ప్రతిధ్వనిస్తుంటే,
......
మరో శబ్దం నా చెవినెలా చేరుతుంది చెప్పు???     
                                   

32 comments:

  1. హహా....అంతే గా మరింకేంవినిపిస్తుంది "ప్రియా" అన్న పిలుపు విన్నాక.
    బాగుంది శ్రీ గారు...!:)

    ReplyDelete
    Replies
    1. సీత గారూ!
      అంతేకదండీ...:-)
      ఆ పిలుపులో దేనికీ లేని శక్తి ఉంది...
      ధన్యవాదాలు....మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete
  2. మీరసలు "ఎటో వెళ్ళిపోయింది మనసు" పాట పెట్టాల్సింది ఈ కవితకి...
    :))
    బాగుంది , శ్రీమతి గారికి కానుకలా ఉంది కవిత...
    అంతా ప్రేమమయం! ఈ జగమంతా ప్రేమమయం...:))

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ!
      పిలుపు పదాల కోసం వెదికితే సరైన పాట దొరకలేదు...
      అందుకే పెట్టలేదు...(రాజి గారి కామెంట్ చూడండి..)
      ప్రియా..పాట పెట్టేసాను వినండి...
      మీరేమో ఆవిడకి కానుక అంటారు...
      ఆవిడ కథ అంతా కవితలా వ్రాసేసి నేనేదో ప్రశంసా పత్రాలు మీ అందరి
      దగ్గర్నుంచీ తీసేసుకుంటుంటే...ఈ కవిత కానుక అని చెప్తే...:-))
      కష్టం కదూ!...:-)))
      ధన్యవాదాలు మీకు..
      అభినవ రామదాసు ...సారీ....రామదాసి గారు చెప్పినట్లు
      అంతా ప్రేమమయం...:-))
      @శ్రీ

      Delete
  3. Replies
    1. ఈ బ్లాగ్ మీకు స్వాగతం చెపుతోంది శర్మ గారూ!
      మీలాంటి వారు wonderful అంటే నిజంగా wonderful గానే అనేసుకుంటున్నాను..
      ధన్యవాదాలు మీకు...
      @శ్రీ

      Delete
  4. శ్రీ గారూ, కవిత చాలా బాగుండటమే కాదు, చెప్పే విషయాన్ని కొత్తగా అందంగా చెప్పారు, ముఖ్యంగా ఇది నిజం కూడా రోజంతా తన పేరు తన కిష్టమైన వారినుండి వింటూ అంతర్లీనంగా అదే పిలుపు వినిపిస్తుంది, అందమైన భావన. భార్య అనురాగాన్ని చక్కగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ!
      చాలా సంతోషం మీ స్పందనకి...
      మీ విశ్లేషణకి..సూచనలకి ధన్యవాదాలు..
      @శ్రీ

      Delete
  5. కవిత బాగుందండీ ప్రేమ మరీ ఎక్కువైనా ఇబ్బందేనన్నమాట :)
    మీ కవిత చదువుతుంటే కలుసుకోవాలని సినిమాలో
    "ప్రియా ప్రియా అంటూ నా మది... సదా నిన్నే స్మరిస్తున్నది"
    అన్న పాట గుర్తుకొచ్చింది.

    ReplyDelete
    Replies
    1. కొన్ని ఎక్కువైనా...ఇబ్బందులు కూడా బాగుంటాయండీ!..:-))
      పాటల సామ్రాజ్ఞి...మీరు చెప్పిన పాట విన్నాను...పదాలు కలిసినట్లనిపించి
      పెట్టేసాను అదే పాట..ధన్యవాదాలు కవితని మెచ్చినందుకు...:-)
      పాట గురించి సలహా ఇచ్చినందుకు..
      @శ్రీ

      Delete
  6. హ హా...శ్రీ గారూ,
    నిజమే....చెలి గుండెల్లో అన్ని సార్లు మధురంగా పేరు విన్న చెవి ఆ శ్రావ్యం ఎలా మరువగలదు.
    సరదాగా మొదలయ్యి ఎందుకో తెలీదంటూ అన్ని చెకప్పులూ అయ్యాక రహస్యం గ్రహించి చాలా గమ్మత్తుగా ముగించారు.
    కూత,మోత...విజిల్, బీప్...వైద్యం,నైవేద్యం వంటి మాటలు చదువుతుంటే...ఏమయ్యింది ఎందుకలా...అని కవిత వెంట పరిగెత్తించాయి.
    చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
      మీ స్పందన...మీ మెచ్చుకోలు నాకు బాగా నచ్చేసిందండీ!
      నీ పిలుపే...అనుకుంటూ పాడేసుకోవడమే...:-))
      @శ్రీ

      Delete
  7. మీ ప్రేమ కవిత చాలా... చాలా బాగుదండీ!

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా నచ్చినందుకు..
      మీకు బోలెడు ధన్యవాదాలు నాగేంద్ర గారూ!..:-)
      @శ్రీ

      Delete
  8. chakkaga raasaarandi, koncham different ga o prayogam chesinatlundi,
    nadi e-lanti kavitha okati undalandi, eppudanna post cheyali, intha andam ga undademo adi,
    keep writing.

    ReplyDelete
    Replies
    1. భాస్కర గారూ!
      సరదాగా హాస్యంతో మొదలై ...ప్రేమతో ముగించాలన్న చిన్న ప్రయత్నం..
      మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
      భలేవారు...మీరు వ్రాసేవి చాలా బాగుంటాయి...
      అది కూడా బాగుంటుంది...
      పోస్ట్ చేసేయండి ఎపుడో...
      చూసి ఆనందిస్తాము
      @శ్రీ

      Delete
  9. wow... Super...భలే రాసారు...
    నిజమే అండీ... సీతగారు చెప్పినట్లు... "ప్రియా" అన్న పిలుపు విన్నాక. ఇంకేం వినపడదు...

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడే నీ బ్లాగ్ లో కామెంట్ పెట్టి...
      సాయి కనపడలేదంటే...
      వెంటనే దర్శనమిచ్చేసావు. .:-)
      అంటే కదా మరి ఇంకేమైనా వినిపిస్తే ఆ సమస్య బాధాకరంగా ఉంటుంది...:-)
      ఏమంటావు?
      ధన్యవాదాలు సూపర్ వ్యాఖ్యకి...
      @శ్రీ

      Delete
  10. Replies
    1. thank you Aniket...
      for your compliment...:-)
      @

      Delete
  11. చాలా రోజులయింది మీ కవిత చదివి.....
    చాలా బాగుంది ....ప్రియ@krishvish

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రియ గారూ!
      నా కవిత మీకు నచ్చినందుకు
      @శ్రీ

      Delete
  12. ఓ ప్రియా ప్రియా....
    పాట గుర్తొస్తొందండీ...
    ఏం చెప్పారు సూపర్..శ్రీ గారు :)

    ReplyDelete
    Replies
    1. ఇలా 123 అంటే అంకెలు చదివినట్లుంది..
      పేరు చెప్తే అలా సంబోధిస్తూ చెప్తానీసారి...
      ...:-)
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      అవును మీరు చెప్పిన పాట సాహిత్యం చాలా బాగుంటుంది...
      @శ్రీ

      Delete
  13. Replies
    1. thank you very much
      prince... for your compliment...
      @sri

      Delete
  14. ప్రియమైన పిలుపు కన్నా ప్రియమైనది వేరొకటి ఉండునా..!!
    వీనుల విందుగా.. హృదయం నిండుగా..
    ఛాలా బావుంది.. శ్రీనివాస్ గారు..
    ఇంతకీ ..ఆ పిలుపు.."శ్రీ " అయివుంటుంది. "శ్రీ".నివాస్ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వనజ గారూ!..
      నిజమే ప్రియా కన్నా విలువైనదీ..ప్రియమైనదీ మరో పిలుపు ఉండదు...
      మీ విశ్లేషణ ..బాగుంది...
      ఆ పిలుపు 'శ్రీ' అంటారా...:-)))...
      @శ్రీ

      Delete
  15. Replies
    1. ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
      ఏదో కొత్తగా వ్రాయాలనిపించి వ్రాసేసానండి...:-)
      @శ్రీ

      Delete
  16. ప్రణయ ఆరాధన కు పరాకాష్ట మీ కవిత...చదివి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆనందంతో... థాంక్స్..

    ReplyDelete
  17. ధన్యవాదాలు మీ హృదయాన్ని తాకింది నా కవితాభావం....ధన్యోస్మి...కరుణ గారు...@శ్రీ

    ReplyDelete