11/08/2012

దూరమౌదామనే... దగ్గరయ్యావని......



                              

మసక చీకటిలో 
మెరిసే విద్యుల్లతలా  కనిపిస్తావు 
దరి చేరే లోగా 
మెరుపు వేగంతో మాయమౌతావు  

మంచుతెరల వెనుక...
స్నిగ్ధ కుసుమంలా కనిపిస్తుంటావు
అనావరణం చేసేలోగా 
శీతలబాష్పంలా కరిగిపోతుంటావు 

దగ్గరకొచ్చినట్లే .వచ్చి
చేతికి చిక్కినట్లే చిక్కి....
ఎక్కడెక్కడికో వెళ్లి పోతుంటావు...

ప్రేమ రాహిత్యంతో 
ఎంత కాలమీ ఎదురు చూపులు?
నను ఏడిపించడానికే 
చేస్తున్నావనుకున్నాను.
సరదాకి ఆడే  
దోబూచులాటలనుకున్నాను 

ఇపుడిపుడే తెలుస్తోంది....
నువ్వు నాకు దూరమౌదామనే...
దగ్గరయ్యావని......                     

19 comments:

  1. awesome feel :-)
    thats magic of LOVE ...

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారూ....
      శతకానికి అతి చేరువలో ఉన్నారు గా...!!
      త్వరగా కొట్టేయండి..
      100 వ పోస్ట్ ఏమిటా అని ఎదురుచూస్తూ...

      Delete
    2. yes...
      that is true...
      awesomwe feel is nothing but love...
      if love is there magic always be there...:-)
      the things visible will be invisible and
      invisible will be visible...
      is'nt it?..:-))
      thanks for a nice compliment...
      @sri

      సీతగారూ!
      శతకానికి చేరువలో ఉన్నానంటూ టెన్షన్ పెట్టేసారు...
      ఇప్పటి దాకా ఏదో ఒకటి వ్రాసేయచ్చులే అనుకుంటున్న వాడిని...
      మీ వ్యాఖ్య చూసాక ప్రత్యేకంగా వ్రాయాలని అనిపిస్తోంది..
      ధన్యవాదాలు మీకు ...మీ ప్రోత్సాహానికి...
      @sri

      Delete
  2. Replies
    1. వనజ గారూ!
      మీ ప్రశంసకి ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  3. Replies
    1. 'శ్రీ'కవితలకి సుమమాలికల స్వాగతం వీణ గారూ!:-)
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete
  4. శ్రీ గారు సూపర్ ఫీలింగ్... చాలా బాగుంది...
    (ఎదురుచూపులలో ఉన్న ప్రేమ ఇంకాస్త ఎక్కువవుతుందేమో కాస్త ఆలోచించండి..)

    ReplyDelete
    Replies
    1. సూపర్ ప్రశంసకి...
      ధన్యవాదాలు సాయీ!
      అంతేగా మరి...
      నిరీక్షణ తర్వాత వీక్షణం అయితే..
      ఆ అనుభూతి చెప్పగలమా?...
      (కొత్త కవిత వ్రాసేయాలేమో...ఈ అంశం మీద..)..:-))
      @శ్రీ

      Delete
  5. "శ్రీ" గారూ..
    జీవితంలో కొన్ని బంధాలు బంధనంగా మారి బాధపెడితే
    మరికొన్ని బంధాలు దూరమవుతూ బాధపెడతాయి..

    పాట,కవిత రెండూ చాలా బాగున్నాయండీ...

    ReplyDelete
    Replies
    1. అంతే రాజి గారూ!
      బాగా చెప్పారు మీరు...
      ఇష్టమైన బంధం వదలకుండా ఉండాలనే కోరుకుంటాము అంతా...
      మీకు పాట, కవిత నచ్చినందుకు ధన్యవాదాలు...
      @శ్రీ

      Delete
  6. శ్రీ గారూ, రాజీ గారు చెప్పింది కుడా నిజమే,
    కొన్ని బంధాలు బాదపెట్టేందుకే ఉంటాయి.
    కొన్ని దూరంగా ఉంటూ దగ్గరకాలేనితనంతో బాదపెడతాయి.
    మీ కవితలో దూరంయ్యేందుకు దగ్గరైన బంధం నిజంగా దయనీయం.
    సర్, కవిత బాగుంది సరళమైన శైలిలో "శీతల బాష్పంలా ".

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ!
      మీ ప్రశంసకి ధన్యవాదాలు.
      ఎపుడూ దూరంగా ఉండే బంధాల కంటే..
      దగ్గరయ్యి దూరమయ్యేవే ఎక్కువ బాధ పెడతాయి...
      @శ్రీ

      Delete
  7. ఎంత ఎంత ఎడమైతే అంత తీపికలయిక:-)
    ఇలా అనుకుంటే ఇంకా మధురంగా ఉంటుందికదండి:-)

    ReplyDelete
    Replies
    1. ఆరుద్ర గారు చెప్పినట్లు...
      పద్మ గారు చెప్పినట్లు...:-)
      ఎంత ఎంత ఎడమైతే అంత తీపికలయిక...
      అనేసుకుందాం...:-)
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  8. దగ్గరయ్యాక దూరంకానీయకండి:)

    ReplyDelete
    Replies
    1. సమస్య లేదు...
      అలా అస్సలు అవనీయను అనికేత్ గారూ!..:-)
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  9. "స్నిగ్ధ కుసుమంలా...
    శీతల బాష్పంలా ..."
    ఇలా మంచి శైలి తో రాసిన మీ ప్రేమ కవిత చాలా బాగుంది శ్రీనివాస్ గారు!

    ReplyDelete
    Replies
    1. స్నిగ్ధకుసుమాన్ని శీతల బాష్పంలో తడిపినట్లుంది
      మీ వ్యాఖ్య...
      ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
      @శ్రీ

      Delete