నాకు చిన్నపుడు అక్షరాభ్యాసం చేసిన
శ్రీ కందుకూరి శ్రీరామచంద్రమూర్తిగారి
పాద పద్మములకు శిరసు వంచి నమస్సుమాంజలి అర్పించుకుంటున్నాను...
పూజ్యులు శ్రీ రాజారావు ,శ్రీ శర్మ ,
శ్రీ శ్యామల రావు,శ్రీ సుధామ
నీవు చదువుకునే రోజుల్లో ఏవేవో వ్రాసేవాడివి కదా...ఇపుడు మళ్ళీ వ్రాయవచ్చుకదా!
అంటూ ఈ బ్లాగ్ మొదలు పెట్టడానికి ప్రోత్సహాన్నిచ్చిన బాల్య మిత్రులకు ప్రత్యేకమైన
కృతజ్ఞతాంజలి.
పూజ్యులు శ్రీ రాజారావు ,శ్రీ శర్మ ,
శ్రీ శ్యామల రావు,శ్రీ సుధామ
శ్రీ /శ్రీమతి/కుమారి ...
( తగిన సంబోధన వారి పేర్ల ముందు తగిలించుకొనవలసినదిగా ప్రార్థన.) :-)
సుబ్రహ్మణ్యం,భాస్కర్,ఫాతిమా,జలతారు వెన్నెల,యోహంత్,రమేష్
పద్మ, రాజి ,మధురవాణి ,సృజన, ప్రేరణ , ప్రిన్స్ ,anrd,అనుపమ
హర్ష,అనికేత్, ఆనంద్ ,భారతి, వీణ ,శ్రీలక్ష్మి,లిఖిత,కృష్ణప్రియ,సాయి,
చిన్ని ఆశ, నాగేంద్ర ,వనజ వనమాలీ,సీత,కే.ఆనంద్ ,మానస కిరణ్ ,
లక్ష్మీ దేవి, రసజ్ఞ , మోహన్ , కే క్యూబ్ వర్మ ,రవి శేఖర్ ,ఫణీంద్ర
మంజు, జ్యోతి ,మాలా కుమార్ ,వాసుదేవ్ , ఫణి, అక్షర కుమార్ , 123
మీరంతా నేను వ్రాసిన టపాలను మీ సమయం వెచ్చించి చదివి
మీ అభిప్రాయాలను తెలియజేస్తూ...
ప్రతి టపాకూ ముందంజ వేయమని ప్రోత్సాహాన్ని అందించి నందుకు...
(స్పందనలు తెలియజేసిన వారి పేరు ఎవరిదైనా మిస్ అయితే మన్నించాలి)
ధన్యవాదాల సుమాంజలి....
అలాగే...స్పందన తెలియ జేయక పోయినా...
నా టపాలను చదివిన అందరు బ్లాగ్ వీక్షకులకూ,
నా బ్లాగ్ ఫాలో అవుతున్న మిత్రులందరికీ నా
హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే నా బ్లాగ్ ని చేర్చుకున్న
కూడలి...మాలిక...హారం...బ్లాగర్స్ వరల్డ్ లకు కూడా
నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నేను ఇతరుల బ్లాగ్ లలో చేసే వ్యాఖ్యల వలన గానీ,
నా ప్రతిస్పందనల వలన గానీ,
ఎవరైనా నొచ్చుకుంటే....క్షంతవ్యుడిని...
అవి కేవలం స్నేహ పూర్వకంగానే తీసుకొమ్మని ప్రార్థన...
నేను చూసే బ్లాగ్ లలో కొన్ని చూసినపుడు నాకు అనిపించే భావాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను...
నాకు నచ్చే విషయం:
ఏ బ్లాగ్ లో నైనా ఆ టాపిక్ పూర్తిగా చదివి
దానికి తగిన వ్యాఖ్యని ఇవ్వటం...
వారిని ప్రోత్సహించేలా..అది ఎవరి స్పందనైనా కావచ్చు...
నాకు నచ్చని విషయం:
1.వ్యాఖ్యకి "టపా వ్రాసిన వారు"కాకుండా "వేరే వారు ఆ వ్యాఖ్యకి సమాధానం ఇవ్వడం."
2.వ్యాఖ్య చేసేటపుడు సభ్యతని మరచి స్పందించడం..
3. టపా వ్రాసిన వారిని ఉద్దేశపూర్వకంగా ఎద్దేవా చేయటం...
అవహేళన చేయటం...అమర్యాదపూర్వకంగా వ్యాఖ్యానించడం...
నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటున్నాను ఇలా...
మీ ఆదరణ, అభిమానం, స్నేహం, ప్రోత్సాహం మున్ముందు కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తూ
మీ మిత్రుడు
మీ ఓపికకి సలాం శ్రీ గారు!
ReplyDeleteఫోటో చాలా బాగా డిజైన్ చేసారు.
అద్బుతమైన కవితలను, వాటికి సరిపడా మంచి పాటలను పోస్ట్ చేస్తూ, మాకు ఆనందాన్ని కలిగిస్తున్నందుకు మీకు ధన్యవాదములు :)
హర్షా !
Deleteమీ అభిమానానినికి సదా కృతజ్ఞుడను..
మీ ప్రశంసకి ధన్యవాదాలు...
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...
@శ్రీ
శ్రీ గారూ, ఇప్పటివరకూ మిత్రులు తమ అభిప్రాయాన్ని చెప్తారేమో అని చూసాను.
ReplyDeleteమీరు మిత్రుల పట్ల చూపిన స్పందన అభినందనీయం.
ఇకపోతే నచ్చని విషయాల్లో మీరు ప్రస్తావించినవి సబబే, సబ్యత మరచి ఇతరులను ఎద్దేవా చేయటం మంచిది కాదు.
మనమందరం మంచి మిత్రుల మాదిరిగా స్నేహపూర్వక వాతావరణాన్ని కలిగి ఉండాలి.
మీరు పెట్టిన పోస్ట్, కృతజ్ఞతలు తెలిపిన విదానం బాగుంది.....మెరాజ్.
నా కృతజ్ఞతాంజలికి మీ స్పందన చాలా బాగుంది...
Deleteమీరు చెప్పినట్లు..
ఆ స్నేహ పూర్వకమైన వాతావరణమే కావాలి బ్లాగర్స్ మధ్య..
ధన్యవాదాలు మీకు.
@శ్రీ
Thank you for writing such lovely poems and infact it was a pleasure reading all of them. I have to catch up reading all of them.
ReplyDeleteవెన్నెల గారూ!
Deleteమీ స్పందనకు ప్రశంసకు ధన్యవాదాలు...
ఏమిటో మీరు తెలుగు దేశం వెళ్లి వచ్చిన దగ్గర్నుంచీ
ఎక్కువగా ఆంగ్లం లోనే వ్యాఖ్యలు చేస్తున్నారు...:-))
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
మీ భావాలు వ్యక్త పరచిన విధానం చాలా బాగుంది.ఇది ఒకరకం గా బ్లాగర్స్ మధ్య మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది.మీ అబిప్రాయాలు అందరు అనుసరిస్తే చాలా బాగుంటుంది.
ReplyDeleteరవిశేఖర్ గారూ!
Deleteమీ స్పందనకు ప్రశంసకు ధన్యవాదాలు...
మీకు నా అభిప్రాయాలు అనుసరణీయం అనిపించినందుకు కృతఙ్ఞతలు.
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
Its an unique way to say thanks and express views. Congrats!
ReplyDeleteపద్మ గారూ!
Deleteమీ స్పందనకు,అభినందనలకు ధన్యవాదాలు...
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
శ్రీ గారూ..ఎంత అందంగా చెప్పారండీ. మొదటిసారిగా చూస్తున్నానిలా. మీ సభ్యతకు, సంస్కారానికి అభివందనాలు.
ReplyDeleteజ్యోతి గారూ!
Deleteమీ ఆత్మీయమైన ప్రతిస్పందనే తెలియజేస్తోంది మీ గురించి...
మీ అభివందనాలకు ప్రత్యభివందనాలు...
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
మీక్కూడా తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు..
Delete"శ్రీ" గారూ..
ReplyDeleteఎందరో మహానుభావులతో పాటూ నాకు కూడా మీరందించిన కృతజ్ఞతాంజలికి ధన్యవాదములండీ..
మీ కవితలు,పాటలతో పాటూ బ్లాగుల్లో ఏదో చెప్పాలన్నట్లు బాగుంది,చాలా బాగుంది
అని కామెంట్ ఇవ్వకుండా ఆ పోస్ట్ ని విశ్లేషిస్తూ మీరిచ్చే కామెంట్ కి కూడా అభిమానులమే మేము..
ThankYou!!
రాజి గారూ!
Deleteనేను స్పందించే తీరు నచ్చినందుకు ధన్యవాదాలు...
మీ స్పందనకు కృతఙ్ఞతలు...
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
శ్రీ గారు!
ReplyDeleteమీ సంస్కారయుతమైన కళాత్మక హృదయావిష్కరణ ఈ "కృతజ్ఞతాంజలి".
చక్కటి సృజనాత్మకత పాటు మీ సందేశం.... చాలా బాగున్నాయి.
ధన్యవాదములండి.
భారతి గారూ!
Deleteచాలా చక్కగా చెప్పారు నా కృతజ్ఞతాంజలి గురించి...
మీ స్పందనకు ధన్యవాదాలు...
తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు....
@శ్రీ
శ్రీ గారు,
ReplyDeleteమీ బ్లాగు నాకు పరీక్ష పెట్టేసింది. రెండురోజులనుంచి నాకు తెరుచుకోవటం లేదు. ఎందుకో తెలియదు. మొత్తానికి పట్టుకున్నా. మీరిలాగే బ్లాగును కొనసాగించాలని మిగిలిన బ్లాగర్లను ఉత్సాహపరచాలని, వారి రచనలకి వ్యాఖలు పెట్టాలని, మీకు భగవంతుడు ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య,సుఖ శాంతులు ప్రసాదించాలని కోరుకుంటూ,
మీ
శర్మ
శర్మగారూ!
Deleteఅలా ఎందుకైందో తెలియటం లేదు..
మీరు ఆశీస్సులకు నమస్సుమాంజలి...
మీకు తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు...
మీ ఆశీస్సులు సదా కోరుకొనే..
@శ్రీ
మీరిచ్చిన ధన్యవాదల హారం కూడా కవితలాగానే వుంది
ReplyDeleteమంచికవితలిచ్చిన మీకు కూడా అభినందనలు
కృష్ణప్రియ
కృష్ణప్రియా!
Deleteమీరిచ్చిన ప్రశంసకి చాలా ధన్యవాదాలు...
మీకు తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు...
@శ్రీ
సర్, మీకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteమీకు కూడా తెలుగు దినోత్సవ శుభాభినందనలు....
Delete@శ్రీ
మీకు కూడా కృతజ్ఞతాంజలి,తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteభాస్కర్ గారూ!
Deleteమీ అభినందనలకు ధన్యవాదాలు...
మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...
@శ్రీ
మీ అమూల్యమైన కాలాన్ని ఇలా అందరికీ ఇంత వర్ణ చిత్ర శోభితంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి వెచ్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండీ...మీ బ్లాగులో కాసింత చోటిచ్చినందుకు ఆనందంగా వుంది...బ్లాగర్స్ మధ్య స్నేహ పూరిత వాతావరణాన్ని మీలాగే ఆశిస్తూ కొంతైనా తెలుగు రాతలలో మిగులుతోందంటే అది బ్లాగుల్లోనే అని అనిపిస్తూ మీకు తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కమారు అభినందనలు...
ReplyDeleteవర్మ గారూ!
Deleteభలే వారు ... బ్లాగ్ ఏమిటి.. మిత్రులకి మనసులోనే చోటు ఉంటుందండి...:-)
మీరు చెప్పింది అక్షర సత్యం...
తెలుగుతనం బ్లాగ్ లలో కనిపించినంత వేరే చోట ఉండటం లేదు...
మీ అభినందనలకు ధన్యవాదాలు...
మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు...
@శ్రీ
Sorry for late coming sir. thanks & congrats to you.
ReplyDeleteమీ స్పందనకు,అభినందనలకు
Deleteధన్యవాదాలు యోహంత్ గారూ!
ఇపుడే మీ ప్రొఫైల్ చూసాను...
'వెన్నెల్లో ఆడపిల్ల'
నాకు కూడా చాలా ఇష్టమైన నవలలో ఒకటి..
చిన్న ప్రశ్న: yohanth అంటే అర్థం ఏమిటండీ?
@శ్రీ
Yohanth is an North Indian name. Exactly I don't know the meaning Sir. But my mom told me that its an name of Lord Krishna.
ReplyDeleteమీ అభిప్రాయాలను బ్లాగు మిత్రులు పాటిస్తే, తప్పకుండా బ్లాగర్ల మధ్య మంచి స్నేహ పూరిత వాతావరం నెలకొంటుంది. ఇంత మంచి పోస్ట్ అందించినందుకు అభినందనలు 'శ్రీ' గారు!
ReplyDeleteకొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా స్పందించాను.
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు !!
ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
ReplyDeleteమీలాగే...నా భావాలు సరైనవేనంటూ
చాలామంది మన బ్లాగ్ మిత్రులు అనడం
చాలా సంతోషాన్నిచ్చింది....
మీ అభినందనలకు ధన్యవాదాలు అర్పిస్తూ...
@శ్రీ
శ్రీ గారూ,
ReplyDeleteఅక్షరాభ్యాసం చేయించిన గురువు నుంచీ నేటి బ్లాగ్ మిత్రుల దకా అందరినీ గుర్తుచేసుకోవటం, ఇలా ప్రత్యేక పోస్ట్ రాసి కృతజ్ఞాంజలి చెప్పుకోవటం ఎంతో బాగుంది.
మరిన్ని మంచి పోస్ట్ లతో మీ "శ్రీ" కవితలతో మమ్మందరినీ అలరించాలని కోరుకుంటూ....
- చిట్టి, పండు
ఎన్నాళ్ళకి... ఎన్నాళ్ళకి..
Deleteఎక్కడా దర్శనం లేకపోతే..
ఎక్కువ బిజీ అయిపోయారనుకున్నాను...
ధన్యవాదాలు( చిట్టి, పండు ) చిన్ని ఆశ గారికి.
మీ లాంటి మిత్రుల ప్రోత్సాహమే కొండంత బలం...
@శ్రీ
అరెరె ! నేను గూడ అందరితో పాటె
ReplyDeleteమిత్రు లందు నొదుగు మిత్రుడ గద !
నన్ను వేరు జేసి నావేమి మిత్రమా !
శ్రీనివాస ! మీకు శ్రియము గలుగు.
----- సుజన-సృజన
రాజారావు గారూ!
మీ స్పందన మెయిల్ లో ఉంది గానీ..
పోస్ట్ లో రాలేదు ఎందుకనో...
అందుకే మెయిల్ లో కాపీ చేసి పైన పోస్టు చేసాను.
మీరు మిత్రులే కాదు మాకు పూజ్యులు కూడా...
మీ ఆత్మీయాశీస్సులకు ధన్యవాదాలు...
@శ్రీ
This comment has been removed by the author.
ReplyDelete