నేస్తం...
నీతో స్నేహమంటే...
ఏమిటో చెప్పనా?..
అందరిలాగే నాలుగు
అందమైన పదాలు జోడించి
అంత...ఇంత...అంటూ
పోగిడేస్తావ్...అంతేగా!
అంటూ పెదవివిరుస్తావు...
ఎలా చెప్పేది?
ఎప్పటినుంచో
వెదుకుతున్న
ఆత్మీయతల నిధి
ఇప్పటికి దొరికిందని.
అనురాగాల సన్నిధి
నేటికి దొరికిందని...
భావ సారూప్యం
ఉన్న నేస్తం దొరకటం
నింగినున్న జాబిలి
ఒక్క సారి దోసిలిలో పడినంత
చల్లని అనుభూతినిస్తుందని
ఇప్పటిదాకా తెలియదు సుమా!...
స్నేహం చేయడం
ఎంతో సులువు.
అది నిలుపుకోవటం
చాలా కష్టమంటూ
వ్రాసిన సూక్తులు ఎందుకో నచ్చావు నాకు.
అమలిన స్నేహాన్ని కష్టపడి
వెతుక్కోగలిగితే
ఆ స్నేహం నిలుపుకోవడం
ఎంత సులభమో అనిపిస్తుంది.
ఎన్ని గనులు
వెదికానో తెలుసా...
నాకు కావలసిన
వరాల వజ్రాన్ని
పట్టేందుకు.
ఎన్ని వనాలుతిరిగానో
నెయ్యాల నేమలీకను
సాధించేందుకు...
శుక్లపక్ష పాడ్యమినాడు
మసక వెలుతురులా
కనిపిస్తూ...
దినదిన ప్రవర్ధమానమౌతూ
నిండు పున్నమి నాటికి
కోటిదివ్వెల కాంతులతో
వేలతారల వెలుగులా
శ్వేతప్రభలతో వెలిగే
వెండివెన్నెలలా
ఎప్పటికీ వన్నె తగ్గనిదై ఉండాలి
మన స్నేహం.
ప్రాతఃకాలపు నీడలా
ఉండకూడదు
మన స్నేహం...
అపరాహ్నపు ఎండలో...
బిందువు నుంచి క్రమక్రమంగా
పెరుగుతూ మనకంటే ఎత్తుగా ఎదిగి పోతూ
అనంతంగా పెరిగిపోతూ...
నిశీధిలో కలిసి కరిగిపోయే
నీడలా ఉండాలి మన స్నేహం.
రెండు స్వార్థపూరితమైన
మనసుల మధ్య స్నేహం
కలకాలం నిలవదు...
నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది...
నా సంతోషంలో నీ కంట పన్నీరొలకాలనే స్వార్థం నీది...
ఇలాంటి స్వార్థాల స్నేహం మాత్రం కలకాలం నిలవాలి సుమా!...@శ్రీ
Last lines are too good.
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారూ!...నా భావం మీకు నచ్చినందుకు @శ్రీ
Deleteశ్ర్రీ గారు.. స్నేహం విలువని గొప్పగా చెప్పారు.చాలా బాగుంది.
ReplyDeleteధన్యవాదాలు వనజ గారూ!...
Deleteచెలిమిని నా పదాలతో చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం @శ్రీ
నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది...
ReplyDeleteనా సంతోషంలో నీ కంట పన్నీరొలకాలనే స్వార్థం నీది...
చాలా బాగుంది కవిత. ఈ రెండు లైన్లూ హైలైట్.
చిన్ని ఆశ గారూ!
Deleteధన్యవాదాలు మీ చక్కని విశ్లేషణతో కూడిన స్పందనకు...@శ్రీ
శ్రీ గారు
ReplyDeleteకవిత బాగుంది. కోటిదివ్వెలు అని ఉండాలేమో కదా.
వెన్నెల వీచికకు ధన్యవాదాలు...కవితను మెచ్చినందుకు
Deleteసరిచేసుకున్నాను ధన్యవాదాలు...@శ్రీ
nice sri gaaru
ReplyDeletethank u prince...for ur nice compliment...@sri
Deleteఅపురూపమైన ఈ చెలిమి చాలా బాగుంది..
ReplyDeleteధన్యవాదాలు రాజి గారూ!
Deleteమీకు నా భావాలు నచ్చినందుకు...@శ్రీ
చాలా చాలా బాగుంది శ్రీ గారు :)...
ReplyDeleteధన్యవాదాలు మీకు
Deleteనా భావాలు నచ్చినందుకు...@శ్రీ
మీకు కూడా సుమా అంటే ఇష్టమా అండీ భాస్కర్ గారి లాగా :) (సరదాకేనండీ) బాగుంది స్నేహం.
ReplyDeleteభలేవారు సుభ గారూ!...
Deleteసుమా! అనేది అక్కడ పూర్తవడానికి వాడానంతే .:-)
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...@శ్రీ
"ఇలాంటి స్వార్థాల స్నేహం మాత్రం కలకాలం నిలవాలి సుమా!" ఈ ట్విస్ట్ బాగుందండి. స్వార్ధం అనే మాటని ఇక్కడ పాజిటివ్‌గా ఉపయోగించడం నచ్చింది.
ReplyDeleteధన్యవాదాలు కిశోర్ గారూ!
Deleteమీరు చక్కగా చెప్పారు...
ఆ కాన్సెప్ట్ తోనే ముగించాను కవితని...
నిస్వార్థమైన స్నేహమే కదా కలకాలం నిలిచేది...@శ్రీ
chaalaa chaalaa baavundandii...srii garu :)
ReplyDeleteస్నేహబంధం పై అస్త్రమన్నమాట...బాగుందండి:-)
ReplyDeleteశాశ్వతమైన స్నేహ బంధాన్ని
Deleteకోరుకోవడం స్వార్థమే కదూ మరి...
ధన్యవాదాలు మీ ప్రశంసాస్త్రానికి @శ్రీ
ధన్యవాదాలు సుందర ప్రియ గారూ!...
ReplyDeleteమీ ప్రశంసకు...@శ్రీ
నీ బాధ నాకన్నీరవ్వాలనే స్వార్థం నాది...
ReplyDeleteబావుందండి ఈ భావం