ప్రవాహాలలో చురుకుగా కదిలే
మీనాల పదచిహ్నాలు
లెక్కించడం వచ్చు నాకు...
చిక్కటి నిశీధిలో
కనిపించని నల్లని అంధకారాన్ని
వెదికి పట్టుకోవడం తెలుసు నాకు...
మిరుమిట్లు గొలిపే వెలుతురులో
మిణుగురుల కదలికను గుర్తించడం
వెన్నతో పెట్టిన విద్య నాకు...
కంటికి తెలియకుండా
కనుపాపను సైతం
దొంగిలించగల నేర్పు
ఈ మధ్యే అలవడింది నాకు...
ఇన్ని నేర్చుకున్నా
నీ ప్రావీణ్యం ముందు
నా కౌశలం తల వంచింది...
అందుకే...
నీకు మాత్రమే తెలిసిన...
"మనసుకి తెలియకుండా
మనసుని హరించే విద్య"
నాకు కూడా కాస్తంత నేర్పవూ???
అందుకే...
నీకు మాత్రమే తెలిసిన...
"మనసుకి తెలియకుండా
మనసుని హరించే విద్య"
నాకు కూడా కాస్తంత నేర్పవూ???
శ్రీ గారు.. చాలా బాగుంది..
ReplyDeleteమనసుకి తెలియకుండా మనసుని హరించే విద్య..... నిజమే నండీ....
ధన్యవాదాలు సాయీ!
Deleteనిజమేనంటే....ఏమిటి సంగతి???...:-))...:-)
@శ్రీ
Marvelous...అయినా 'శ్రీ"గారు ఇన్ని విద్యలు తెలిసిన మిమ్మల్ని ఆ విద్యే అమాంతం వరిస్తే ఇంక నేర్చుకోవడం అవసరమా:-)
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు పద్మ గారూ!
Deleteమీరల అనేస్తే నేనేమి చెప్పను?
వరించిందో లేదో ఇతరులకి తెలుస్తుంది కానీ
నా మనసుకి తెలియదు కదండీ!!!...:-)
@శ్రీ
మీకిన్ని విధ్యలు తెలుసా? ఒక్క విద్యే కదండి తెలియనిది? That's ok! You still win!!
ReplyDeleteNice poem.
మీ ప్రశంసకి ధన్యవాదాలు వెన్నెల గారూ!
Deleteఅన్ని తెలిసినా అన్నిటికంటే ముఖ్యమైనది ఆ విద్యే కదండీ!...:-)
ఆ విద్య తెలిసిన వాళ్ళ మనసుని హరిస్తే అది విజయమేనండి..:-)
@శ్రీ
ఈ విద్యకి మాత్రం శ్రీ కృష్ణుడే సరి అయిన వ్యక్తి అని నా అభిప్రాయం. ఆయన దోచుకొని మనసు ఉందంటారా?
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
Deleteమీరన్నది నిజమే నండి...
మత్శ్యంబుల అడుగులు లెక్కించవచ్చు...ఇంకా ఏవో అసాధ్యమైన పనులు
చేయవచ్చునని చెప్పి మగువ మనసు లోని మర్మాన్ని తెలుసుకోలేమని శ్రీకృష్ణుడే అన్నట్లు
ఒక పద్యం ఉంది...మీకేమైనా గుర్తుంటే చెప్పండి...
మొదటి పదాలు గుర్తొచ్చి ఈ కవిత అల్లాను...
@శ్రీ
శ్రీ గారూ, ఓ అధ్బుతమైన విద్య గూర్చి తెలుసు కోవాలని ప్రయత్నిస్తున్నారు, నేర్పవూ అని దీనంగా అడిగారు కదా, జాలిపడుతుందిలెండి, పోనీ గురుదక్షణ ఇచ్చుకుని చూడండి పలితం ఉంటుందేమో.. సర్, చాలా బాగా రాసారు.
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
Deleteఅది నిజమే లెండి...
నా మనసుని హరించిన వారికి గురుదక్షిణ ఏమి కావాలని అడగడానికి
నేనెంతటి వాడిని చెప్పండి??...:-)
అయినా అడిగి చూస్తాలెండి మరో కవితలో....:-)
@శ్రీ
హ హా....ప్రేమించటమూ ఓ చోర కళే అంటారు అయితే ఇక్కడ హరిస్తే పోయినదానికన్నా ఎత్తుకుపోయిన వాళ్ళహృదయం కోసం వెదుకులాట...పోయినది రాదు, వెదికేది దొరదు...కనుక ఆ విద్య రాదు ;)
ReplyDeleteబాగుందండీ కవిత.
చిన్నిఆశ గారూ
Deleteమనోహరీ! మనోహరా! అనే పదాలు అలాగే పుట్టాయి కదండీ!:-))...
అన్నీ తెలియనట్లు అడుగుతారు...:-))
ఏమిటో ఈ విద్య క్లిష్టమైనది లెండి...
నిజంగా పోదు...అలాగని కానరాదు హృదయం...:-)
మీ మెచ్చుకోలు నాకు ఆనందాన్ని ఇచ్చింది...
@శ్రీ
Nice to hear:-)
ReplyDeletethank you srujana gaaroo!:-)
Delete@sri
శ్రీ గారు...
ReplyDeleteమీకా విద్య రాదంటే నమ్మాలా?? ;)
ఇలా కవితలతో మనసుని హరిస్తూ మరలా నేర్పించమని ఎవరినో అడుగుతున్నారా......;)
బాగుంది మీ కవిత... :)
అమ్మో!
Deleteఅంత పెద్ద సందేహమే??:-)))
అంత పెద్ద ప్రశంసే???:-)))
ధన్యవాదాలు సీత గారూ!
ఇలా మెచ్చేసుకుంటే
ఇంకా మంచి కవితలు వ్రాసే స్ఫూర్తి వచ్చేస్తుందండి..:-)
@శ్రీ
different poetry.
ReplyDeleteనా మనసులో పుట్టిన భావాన్ని పదాలలో వ్రాసేస్తానండి...
Deleteదానికి కవిత అని పేరు పెట్టేస్తాను...
కవితకి ఉండే లక్షణాలు ఉన్నాయో లేదో కూడా తెలియదండి నాకు...
ధన్యవాదాలు మీ స్పందనకి రవి శేఖర్ గారూ!
oh, super sree garu, chakkaga undi.
ReplyDeletekeep writing.
ధన్యవాదాలు భాస్కర్ గారూ!
Deleteప్రతి కవితకి పలకరించి ప్రోత్సాహాన్నిస్తారు...
thanks once again...
@శ్రీ
wow super andi
ReplyDeleteధన్యవాదాలు ప్రిన్స్
Deleteమీ ప్రశంసకి....
@శ్రీ
అతిశయం ఆత్మ ముందు ఓడింది. :))
ReplyDeleteధన్యవాదాలు వనజ గారూ!
ReplyDeleteఅతిశయం ఎప్పటికైనా ఆత్మ ముందు తలవంచాలి కదండీ!
అపుడు మాత్రమే ఆ ఆత్మ సాక్షాత్కారం కలిగేది...
:-)
@శ్రీ