|| వలపుల తలపుల హోలీ ||
ప్రతి రాత్రి నా కళ్ళతో నీ జ్ఞాపకాలు ఆడేది హోలీనే
ఎర్రనిరంగు కళ్ళకి జీరగా మార్చేస్తూ
రవికిరణం తుషారకణాలతో హోలీకి
ఎప్పుడూ సిద్ధమే సప్తవర్ణాలతో
నీవు నామనసుతో ఆడేది హోలీనే
అసంఖ్యాకమైన వర్ణాలను నాలో నింపేస్తూ
సాగరాకాశాలకి నిత్యం హోలీనే
ఒకరికొకరు నీలి వర్ణం పూసుకుంటూ.
మాధవుడు రాధమ్మతో హోలీ
నీలాన్ని కనకపుష్యరాగమయం చేస్తూ.
నా తీపిఊసులు నీతో ఆడేది హోలీనే
గులాబిరంగు సిగ్గులబుగ్గలకి పూస్తూ.
ఆదిత్యుని హోలీసంధ్యా సుందరితో
చెక్కిళ్ళలో కెంజాయరంగుని చిత్రిస్తూ..
రజనీకాంతుని హోలీ నిశాసుందరితో,
తనువంతా రజతవర్ణశోబితం చేస్తూ.
వసంతుని హోలీ
కొమ్మకొమ్మనూ వేల(వేళ్ళ) వర్ణాలతో కొంటెగా స్పృశిస్తూ.
శ్రీ కలం హోలీ...
అక్షరాల్లో సప్తవర్ణాలను నింపేస్తూ,
భావాలకి వేలరంగులు పులిమేస్తూ.
కవితా కన్యకను కోటి రంగులతో అలంకరిస్తూ...@శ్రీ
మనసులన్నీ హోలీ రంగులతో నింపివేసి అద్భుత చిత్రాన్ని రచించారు కదా శ్రీ గారు, మీకు నా అభినందనలు మరియు శుభాకాంక్షలు!!!
ReplyDelete'శ్రీ'కలం కదిలితే హోలీనే కదా...
ReplyDeleteబాగుంది, చాలా బాగుంది. మీకు కుడా శుభాకాంక్షలు :)
Beautiful. Happy holi to you Sri gaaru
ReplyDeletehapy holi
ReplyDeleteరంగుల వసంతోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteసూపర్ రంగుల పండుగా అంతా నీ కవితలోనే కనిపించింది , చాల బాగా రాసావు శ్రీ , అభినందనలు , హోలీ శుభాకాంక్షలు
ReplyDeleteSuper holi
ReplyDeleteసాగరాకాశాలకి నిత్యం హోలీనే
ReplyDeleteఒకరికొకరు నీలి వర్ణం పూసుకుంటూ..... nice comparison
మీ కవితలతో ఎప్పుడూ మీరు హోలీనే ఆడుతుంటారు కదా!చాలా బాగుంది.
మీ రంగుల మేళవింపు కంటికింపుగా ఉంది,
ReplyDelete