( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో )
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను
పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను
నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను
చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను
ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ
చదివి మురిసాను. అభినందనలు
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు నిత్యా గారు :-)
ReplyDeleteమిత్రమా ,
ReplyDeleteకొంచెం యోచించు .
నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను
అనటం యిచ్చట తప్పు అనిపిస్తుంది .
నా ప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేశాను
నీ ప్రేమ వర్షంలో మరల మరల తడిశాను
ప్రేమలెన్నో వుంటాయి , కానీ నీఅన్నప్పుడు ప్రేమ అని మాత్రమే అంటే బాగుంటుంది .
నమస్తే శర్మ గారు ..
ReplyDeleteవలపుల వర్షం అని వాడతాము కదా
ఇక్కడ గజల్ లో ఛందస్సు కూడా ఉండడం, తరవాత పాడేందుకు వీలుగా పదాలను కూర్చడం ఉంటుంది
అందువలన ఇక్కడ అలా వాడడం జరిగింది. మీ సూచన సరియైనదే . అలాగే కొన్నిటిని దీర్ఘాక్షరాలుగా ... కొన్నిటిని హ్రస్వాక్షరాలుగా వ్రాయడం జరిగింది .కేవలం బాణీ కట్టేందుకు వీలుగా. ధన్యవాదాలు మీ విశ్లేషణకి _/\_ లతో ... @శ్రీ
chaala chaala bagundhi sir
ReplyDelete