|| చెలి నీవే - తెలుగు గజల్ ||
మనసువీణ సరిగమలను వినిపించిన చెలి నీవే
నా మదిలో మధురగీతి పలికించిన చెలి నీవే
రేకులలో సుకుమారము నీలో కనబడుతున్నది
గులాబీల రాశిలోన జనియించిన చెలి నీవే
నీ కనులకు భయపడుతూ రాత్రిలోన దాగున్నవి
చూపులతో చీకట్లను బెదిరించిన చెలి నీవే
హేమంతపు ఋతువు కూడ నులివెచ్చగ ఉంటుందీ
శ్వాసలతో శీతలాన్ని వణికించిన చెలి నీవే
ఇలలోకలలో నన్నే వదలకుండ ఉంటావు
విరహానికి వెనుదిరుగుట నేర్పించిన చెలి నీవే
నీ వన్నెల కాంతి చూసి వెన్నెల అనుకుంటాయీ
కొలనులోన కల్వపూలు పూయించిన చెలి నీవే
నవ్వులతో మదిని కొల్లగొడుతూనే "నెలరాజా"
గాలిలోన మల్లెపూలు పండించిన చెలి నీవే
ఏమి బ్లాగ్ భాగ్యం...ఎన్నాళ్ళకెన్నాళ్ళకు :-)
ReplyDeleteVery happy to see you again in blog.
హహ :) ధన్యవాదాలు పద్మగారు
Deleteవీలు చూసుకొని బ్లాగ్స్ ఒక రౌండ్ వేయాలండీ