కన్నీటి బుడగలే పగిలాయి ఎందుకో
చెక్కిలిని ఆర్తిగా తడిమాయి ఎందుకో
పూలున్న హృదయాన్ని ఆక్రమించేసాయి
ముళ్ళున్న పొదలెన్నొ మొలిచాయి ఎందుకో
నావలో అడుగేయబోయాయి మోదాలు
ఖేదాల కడలిలో మునిగాయి ఎందుకో
తొలిఋతువులో పికము పాట వినబడలేదు
రాగాలు శిశిరాన్ని వలచాయి ఎందుకో
రెప్పలను వెలివేసి వెళ్ళాయి స్వప్నాలు
కనులలో చీకట్లు మిగిలాయి ఎందుకో
హేమంత ధూపాలు దయచూపలేదులే
అంగార కుసుమాలు విరిసాయి ఎందుకో
నీతోడు లేనపుడు నామీద "నెలరాజ"
పలుమార్లు విరహాలు గెలిచాయి ఎందుకో
... #శ్రీ
చాలా చాలా బాగుంది.. 👌👌👏👏
ReplyDeleteవావ్....అద్భతమైన భావుకత..
ReplyDeleteమళ్ళీ బ్లాగ్ లో వ్రాయండి ప్లీజ్. ఆ పాత వెలుగులు కొరవడినాయి.
ReplyDeleteతప్పకుండా పద్మగారూ... ����
ReplyDeleteBeautiful.ఎలా ఉన్నారండి.
ReplyDeleteధన్యవాదాలు మీకు...
Deleteబాగున్నాను రవిశేఖర్ గారు... మీరెలా ఉన్నారు.
9425012468...whatsapp కి ఓ msg పెట్టండి.