|| మెదులుతూ ఉంటుంది - తెలుగు గజల్ ||
కలలోన నీరూపు మెదులుతూ ఉంటుంది
కనులలో తిమిరమే తొలగుతూ ఉంటుంది
యాచనలు చేయడం నా మదికి తెలియదూ
నీమనసునిమ్మంటు అడుగుతూ ఉంటుంది
నీమేని వన్నెలను చోరీలు చేస్తుంది
హరివిల్లు కొత్తగా విరుగుతూ ఉంటుంది
నిను తలుచుకుంటూనె రాస్తాను ప్రతిషేరు
గతిలోన నా గజలు ఒదుగుతూ ఉంటుంది
శుక్లపక్షములోని జాబిల్లియే సాక్షి
నీమీద నా వలపు పెరుగుతూ ఉంటుంది
హేమంత ధూమాలు వణికిస్తు ఉన్నాయి
నా తనువు నీదరికి జరుగుతూ ఉంటుంది
ఇద్దరం ఒక్కటై కనబడితె "నెలరాజ"
రాత్రిలో తన్హాయి మరుగుతూ ఉంటుంది #శ్రీ
08/09/2016
28/12/2014
06/12/2014
శ్రీ వాక్యం - అవార్డులు - ఇంటర్యూ
నా "శ్రీ వాక్యం" పుస్తకానికి wonder book of world record వచ్చిన నేపథ్యంలో
http://sumamala.blogspot.in/ అనే వైవిధ్య భరితమైన చక్కని బ్లాగ్ ను నిర్వహిస్తున్న
శ్రీమతి రమణి రాచపూడి గారు చేసిన ఇంటర్వ్యూ ని http://kuwaitnris.com వారు పబ్లిష్ చేసారు
http://sumamala.blogspot.in/ అనే వైవిధ్య భరితమైన చక్కని బ్లాగ్ ను నిర్వహిస్తున్న
శ్రీమతి రమణి రాచపూడి గారు చేసిన ఇంటర్వ్యూ ని http://kuwaitnris.com వారు పబ్లిష్ చేసారు
హృదయ పూర్వకమైన ధన్యవాదాలు http://kuwaitnris.com నిర్వాహకులకి
శీమతి రమణి రాచపూడి గారికి _/\_
శీమతి రమణి రాచపూడి గారికి _/\_
http://kuwaitnris.com/2014/12/06/%E0%B0%8F%E0%B0%95-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D/
18/09/2014
శిశు వేదన
గర్భంలో పడినప్పటినుంచీ పరీక్షలే.
తెలుస్తూనే ఉంది...
నేనెవరో తెలుసుకోవాలనే నాన్న ప్రయత్నం
కనబడుతోంది...
డాక్టరమ్మకి నాన్నమ్మ ఇస్తున్న లంచం.
చలి పుట్టిస్తోంది...
అమ్మ పొట్ట మీద పూసిన చల్లని జెల్
భయం పుట్టిస్తోంది...
నిశ్శబ్దంగా పరీక్షాయంత్రం చేసే చప్పుడు.
తల, మెదడు, కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నా,
అసలు పరీక్షలోనే విఫలమయ్యానని స్పష్టమైంది.
అన్నీ కనబడుతున్నాయి స్పష్టంగా...
రక్షించుకోవాలనే అమ్మ ప్రయత్నం
వధించాలనే నానమ్మ పన్నాగం
వాళ్ళమ్మ మాట జవదాటక
అమ్మతనాన్ని చంపే నాన్న నిశ్చయం
గుట్టుచప్పుడు కాకుండా
నన్ను మట్టుబెట్టేందుకు ఊపిరిపోసుకుంటున్న యుద్ధతంత్రం
ఓ దుర్ముహూర్తంలో
వైద్యుని నాటుమందు అయింది...అమ్మకి విందు
ఉన్న కాస్త చోటులోనే
తప్పించుకోవాలని పరుగులు తీసాను
అలిసిపోయి...మృత్యువుకి దొరికిపోయాను
పైనుంచి చూస్తూనే ఉన్నా...
మరో ప్రాణికి ప్రాణం పోయాలనే
ప్రయత్నంలో మునిగిన అమ్మానాన్నలను.
చూడాలి ఈసారైనా...
తమ్ముడు పుడతాడో?...
మరో చెల్లి ప్రాణం పోతుందో? @శ్రీ
11/09/2014
|| కనులుతెరచి చూసాను - తెలుగు గజల్ || (200 వ పోస్ట్ )
( నా 200 వ పోస్ట్ ... ఆదరిస్తున్న అందరికీ వందనాలతో )
కలకోసమె ప్రతిరేయీ కలవరించి అలిసాను
పగలురేయి నీధ్యానమె చేసుకుంటు గడిపాను
కళ్ళలోన నీరూపమె నిలుపుకుంటు మురిసాను
నాప్రాణమె నీవంటూ బాసలెన్నొ చేసాను
నీప్రేమల వర్షంలో మరలమరల తడిసాను
చెరోచోట మనముంటు కలవలేక పోతున్నా
ఊహలలో నిన్ను చూసి పూవులాగ విరిసాను
ప్రేమలన్ని గుడ్డివని అంటారుగ #నెలరాజా
ప్రేమలోన పడినాకే కనులు తెరచి చూసాను .......@శ్రీ
|| తెలుగు గజల్ ...నువ్వు నవ్వావని ||
వనమంతా విరులైతే తెలిసింది నువ్వు నవ్వావని
తనువంతా తడియైతే తెలిసింది నువ్వు తాకావని
కలతంతా సుఖమైతే తెలిసింది నువ్వు నవ్వావని
మనసంతా చెమరిస్తే తెలిసింది నువ్వు చూసావని
ఎదలోనే రవమైతే తెలిసింది నువ్వు నవ్వావని
ధరయంతా దివియైతే తెలిసింది నువ్వు ఉన్నావని
వరమేదో వశమైతే తెలిసింది నువ్వు నవ్వావని
#నెలరాజా కనిపిస్తే తెలిసింది నువ్వు నవ్వావని
మధురంగా సడియైతే తెలిసింది నువ్వు నవ్వావని ... @శ్రీ
|| నువ్వు నేను ||
నా తలపులలో నిలుస్తావు
నీ జ్ఞాపకాలతో బాధిస్తావు
నిన్ను నేను తలపుగా భావిస్తున్నా,
జ్ఞాపకంగా మిగిల్చావు నన్ను
జ్ఞాపకాల జ్వాలల్లో కాలిపోతున్నా
చందనపు చల్లదనం మదిని తాకుతోంది హాయిగా
వలపుశరాలతో నీవు చేసేవి తీయని గాయాలు
మదిని ప్రేమగా పలకరించేవి నీవైనజ్ఞాపకాలు.
మదిలోయల్లో నీకోసమే అన్వేషిస్తున్నా
నీ జ్ఞాపకాలనే సోపానాలుగా చేసుకుంటూ
నిన్ను అందుకోవాలనే ప్రయత్నంలో విఫలమైనా
సాలెపురుగునే ఆదర్శంగా తీసుకుంటూ...
మునుముందుకి సాగిపోతున్నా.
నీ అడుగులో అడుగు కలపాలనే తపనలతో
అడుగులో అడుగు కలిపితే గమ్యం సుగమమే
ఎదసంద్రంలో అలవైతే ధమనుల్లో తేనెల పరుగులే ...
ఎదసవ్వడి నువ్వనే నిశ్శబ్దమై మిగిలున్నా
నా గమ్యం నువ్వనే ఏడడుగులు వేస్తున్నా.
సవ్వడి నేనైతే నీమువ్వల రవళితో జత కలుపు
గమ్యం దూరమైనా నీ సహకారంతోనే నా ముందడుగు
Subscribe to:
Posts (Atom)





.jpg)



