నీ పేరు మేఘమాలిక మీద వ్రాస్తే
స్వాతి చినుకై కురిసి, మంచిముత్యమై మెరిసింది...
నీ పేరు గాలిలో వ్రాస్తే
నా జీవన వేణువుకి శ్వాసయై పలికింది...
నీ పేరు నీలి సాగరం మీద వ్రాస్తే
ప్రేమతరంగమై వచ్చి నన్ను చల్లగా తాకింది...
నీ పేరు చంద్రునిమీద వ్రాస్తే
నీ పేరు చంద్రునిమీద వ్రాస్తే
వెన్నెలై నా ఇంటి ముంగిట్లో కురిసింది...
నీ పేరు నీ అరచేతుల్లో వ్రాస్తే
నా వీపున ప్రేమ ముద్రలుగా మారాయి...
నీ పేరు నీ పెదవిపై వ్రాస్తే
నా పెదవిపై నీ సంతకమై వెలిగింది...
నా పెదవిపై నీ సంతకమై వెలిగింది...
నీ పేరు నీ మదిలో వ్రాస్తే
అది నా హృదయ స్పందనగానే
మారి పోయింది ....
మారి పోయింది ....
నీపేరు నీలి సాగరం మీద వ్రాస్తే
ReplyDeleteప్రేమ తరంగమై వచ్చి నన్ను చల్లగా తాకింది.
నీపేరు చంద్రునిమీద వ్రాస్తే
వెన్నెలై నాఇంటి ముంగిట్లో కురిసింది
చాలా బాగుంది హేట్సాఫ్ బేటా.[RVSS]
ధన్యవాదాలు అమ్మా :-) _/\_ @శ్రీ.
Delete