నీకోసం వేయి కన్నులతో....
వేచి చూస్తున్నాను ప్రియా!
లోకానికి చల్లదనాన్నిచ్చే నెలరాజు
మంటలు రేపుతున్నాడు నాలో....
పున్నమి వెన్నెల, తిమిరాన్ని మింగుతూ
లోకాన్ని ప్రకాశవంతం చేస్తుంటే......
విరహ తిమిరం నన్ను మింగుదామని
అనుక్షణం కోరలు చాచి నా వెంట పడుతోంది..
నీవు లేకుంటే ఈ విరహతిమిరానికి కూడా నేనంటే అలుసే...
చంద్రుని వెన్నెలంటే భయం లేదట,
వెన్నెల లాంటి నీ చూపంటే భయం అంటోంది,
వెన్నెల కురిపించే నీ మాటలంటే భయం అంటోంది,
వెన్నెల విరిసినట్లుండే నీ నవ్వంటే భయం అంటోంది,
వేయి వెన్నెలల వెన్నల బొమ్మలాంటి నువ్వంటేనే భయం అంటోంది.
నా జీవన శరత్చంద్రికవై పరుగు పరుగున రావాలి....
నీ రాకతో నన్ను ముసిరిన చీకట్లు పారిపోవాలి...
ఈ విరహ తిమిరం నన్నొదిలి పోవాలి,
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి....
నా చెంతకు మళ్ళీ రావాలంటే భయపడాలి.
@శ్రీ
No comments:
Post a Comment