25/03/2012

నా ప్రేమ



ఈ లోకంలో ఇంతమంది ఉండగా
నాతోనే ఎందుకు జత కట్టాలనుకున్నావ్?
నన్నే ఎందుకు తోడుండమన్నావ్?
నాతోనే ఎందుకు జీవితం పంచుకోవలనుకున్నావ్?
నా ప్రేమకోసం ఎందుకు ఆరాటపడుతున్నావ్?
అంటూ ఎప్పుడూ ప్రశ్నిస్తావ్   నన్ను,


పరిమళం పూలతోనే ఎందుకు జత కడుతోంది?
వెన్నెల చంద్రునికే ఎందుకు తోడుంది?
వెలుతురు దీపాన్ని ఎందుకు వీడదు?
నది సముద్రం వైపే ఎందుకు పరుగులు తీస్తుంది?
వీటన్నిటికీ సమాధానం ఉందా?


నీ ప్రేమ కోసం చూసే నా ప్రేమని అడుగు..
నీ ప్రతి ప్రశ్నకి సమాధానం  దొరుకుతుంది.
నీలో ఉన్న నన్ను ప్రశ్నించు,
నాలో ఉన్న నిన్ను ప్రశ్నించు....
నిన్ను కోరే నా మనసు  చెప్పే జవాబు తప్పక దొరుకుతుంది.....






4 comments:

  1. అద్భుతం, ప్రేమని ప్రశ్నిస్తే దొరికే సమధానాలు ప్రశ్నల్లోనే...చక్కగా రాశారు.

    ReplyDelete
  2. పరిమళం పూలతోనే .......మంచిప్రయోగం .కాని భూమికి కూడా వెన్నెల వుంటుంది.అది చంద్రుని ఫై కనబడుతుంది.మంచి కవితలు వ్రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే...భూమి వెన్నెల చంద్రుని పై 90
      రెట్లు ఎక్కువగా కనిపిస్తుందిట....
      ధన్యవాదములు.

      Delete
  3. ధన్యవాదములు
    మీ బ్లాగ్ లో చిత్రాలు చాలా బాగున్నాయి...

    ReplyDelete