26/03/2012

రాధామాధవం


నాది కృష్ణ వర్ణం...నీది శ్వేత వర్ణం..
మనిద్దరికీ జత కుదురుతుందా???
నేను రాత్రయితే...నీవు పగలు...
మనిద్దరం కలిసుండేదెలా???



కన్నయ్యా!
ఎన్ని సందేహలో నీకు....
ఒకదానికొకటి వ్యతిరేకంగా కనిపించేవన్నీ
వాస్తవంగా అలా ఉండవు...

వేరుగా కనిపించే...
రేయింబవళ్ళు ఒకదానికొకటి పూరకాలు.
చంద్రుని  వెన్నెల చిత్రాలు చూడాలన్నా,
తారాదీపాల వెలుగులు కావాలన్నా...
నీలాకాశం(నల్లని ఆకాశం)  ఉండాలి  కదా!
విద్యుల్లతల  అందం పెంచేవి
ఆ నల్లని మబ్బులే కదా!




నీవు లేక నేను,
నేను లేక నీవు లేనే లేమని
తెలిసికూడా...  అన్నీ నా చేత చెప్పించాలనే
నీ అంతర్భావాన్ని నేను,
నీ అంతర్భాగాన్నే నేను...













2 comments:

  1. అబ్బా...!!
    చాలా చక్కగా చెప్పారు సార్..!!
    రాధా-కృష్ణ తత్వాన్నంతా 7 వాక్యాలలో కూర్చిన మీకు హట్సాఫ్...!

    ReplyDelete
  2. ధన్యవాదాలు సీత గారూ!
    రాధాకృష్ణుల పుష్పాల హోలీ కూడా మీకు నచ్చుతుందేమో..
    చూడండి...

    ReplyDelete