నీకోసం వ్రాసే కవితలన్నీ
నీకు అందించమంటూ
తరచి తరచి అడుగుతుంటావు.
శ్వేత కపోతాలకై
మొదలెట్టాను వేట.
సిద్ధం చేసుకున్నాను...
కట్టేందుకు పట్టు తాళ్ళు.
లేఖలు గమ్యం చేరవేమో
అనుకుంటూ భయపడ్డాను.
ప్రతి కవితనీ
అందమైన పత్రాలపై వ్రాసాను...
శ్వేత సరోజాల రేకులను
రెక్కలుగా చేసాను...
హరివిల్లుని కొంచెం కిందికి దించి
ఆ వర్ణాల్లో ముంచి తీసాను...
వాటి అందానికి
నాలో నేనే మురిసి పోయాను...
నా మనసు వేగాన్ని
ఆ లేఖలకిచ్చేసాను...
సుధాంశుని అంశవైన
నీ ముందు వాలిపోయాయి..
ప్రణయ రాగ వాయులీన నాదాలకి
పరవశించాయి...
రెక్కలు విప్పి
సిరివెన్నెల నాట్యంలో భాగమయ్యాయి...
నాకోసమే వ్రాస్తానని
మోసం చేసానన్నావు...
అన్నీ మనిద్దరి కోసం
వ్రాసానని అలిగి కూర్చున్నావు...
నీకోసం వ్రాద్దామనే మొదలెడుతున్నాను...
ముగింపు మాత్రం 'నువ్వు-నేను' తోనే పూర్తవుతోంది...
నా ప్రతికవితకి ఊహవు నీవైతే, ఉత్తేజం నేనని,
నీతోనే నేను సంపూర్ణం అని
నీకు తెలిసీ....అలిగితే ఎలా???
(చిత్రం ఆధారంగా అల్లిన అక్షర మాలిక...@శ్రీ )
చిత్రం అర్భుతం
ReplyDeleteదానికి మీరల్లిన కవిత ఇంకా అర్భుతం :)
చాలా బాగుంది శ్రీ గారు...
మీ ప్రశంసకి నోచుకున్న చిత్రం...
Deleteకవిత ధన్యమయ్యాయి...:-)
ధన్యవాదాలు మీకు....
@శ్రీ
వావ్... శ్రీగారు కవిత చాలా బాగుంది.
ReplyDeleteకానీ ఆ బొమ్మ మీ కవిత అంత అందంగా లేదు అండీ.. (ఏమనుకోవద్దు).
నా కవిత నచ్చినందుకు ధన్యవాదాలు సాయి...
Deleteచిత్రం దొరికితే వ్రాసిన కవిత అది...
చిత్రం కంటే కవిత బాగుందంటే...
నేను నా భావాలు మీముందు బాగా ఉంచగలిగానన్నమాట...
మరోసారి ధన్యవాదాలు...
@శ్రీ
చాలా బాగుంది
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు ప్రిన్స్..
Delete@శ్రీ
adi aluka kaademo kavitaa sumaalanu haramgaa veyamannademo...:)
ReplyDeletechaalaa baavundi
కవితా సుమాల హారం ప్రతి కవితకీ వేస్తూనే ఉన్నానండీ!
Deleteఅయినా అతివకి అలకే అందం కదండీ!..:-)
మళ్ళీ ప్రసన్నం చేసేసుకుంటా!...:-))
మీకు కవిత నచ్చినందుకు ధన్యవాదాలు మంజు గారూ!
@శ్రీ
శ్రీ గారూ,
ReplyDelete"ఊహవు నీవైతే, ఉత్తేజం నేనని,
నీతోనే నేను సంపూర్ణం అని..."
స్వచ్ఛమైన ప్రేమ భావం, చాలా బాగా చెప్పారు.
కవితాం మొత్తం ఎంతో బాగా రాశారు.
బొమ్మ ఎంచుకుని బొమ్మకి కవిత్వం రాయటం అంటే మాటలు కాదు,
Congrats!
చిన్నిఆశ గారూ!
Deleteచాలా సంతోషం మీ ప్రశంసకి, మీ విశ్లేషణకి..
ప్రతి కవితకీ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు
మరోసారి ధన్యవాదాలతో...
@శ్రీ
శ్రీ గారూ, మీ కవితల్లో విరహం, ప్రేమ, వేదనా, నివేదనా, కలిగిన పూలపరాగపు పొడి అద్ది ఉంటుంది, ఒకవైపు నీకోసమే అంటూ మరోవైపు సందేహమా అనే మీమాంసలో సాగుతుంది కవితా సాగరధార. మంచి భావుకత. హృదయాన్ని ఆవిష్కరించే విదానం బాగుంది.
ReplyDeleteఫాతిమా గారూ!
Deleteనేను చూడలేని కోణాన్ని మీ స్పందన ద్వారా
నా కవితలో చూస్తున్నాను...
మనః పూర్వకమైన ధన్యవాదాలు మీకు...
@శ్రీ
నా ప్రతికవితకి ఊహవు నీవైతే, ఉత్తేజం నేనని,
ReplyDeleteనీతోనే నేను సంపూర్ణం అని
manchi kavitha prayogam sree garu
నా భావం , పద ప్రయోగం
Deleteమీరు మెచ్చినందుకు మీకు ధన్యవాదాలు
రవిశేఖర్ గారూ!
@శ్రీ
meeku manchi padalatho parichayam undandi, chkkaga raastharu,
ReplyDeletebommke intha bhgha raasthe, nijamaina sundirini thaluchukonte, inkentha bhagaa raastharo kada, keep writing.
భాస్కర్ గారూ!
Deleteమది పులకించిపోయే వ్యాఖ్య చేసారండీ!
మీరన్నది నిజమే...:-))
కానీ
" ఊహ ఎపుడూ అందంగానే ఉంటుంది
కలలో కల్పనలా.." ఏమంటారు?
మీకు ధన్యవాదాలు...
@శ్రీ
బాగుంది శ్రీ గారు నేను కూడా ఆస్వాదించాను ...
ReplyDeleteప్రత్యూష
మీలోని కవితారసస్పందనకి
Deleteధన్యవాదాలు
ప్రత్యూషా!
@శ్రీ
Wow! chaalaa baagundi sri gaaru. sari leru meekevvaaru! ante!
ReplyDeleteధన్యవాదాలు వెన్నెల గారూ!
Delete"సరి లేరు మీకెవ్వరూ..."
అన్నాక అంతకంటే ప్రశంసించడానికి ఇంకేమీ ఉండదు కదా!
ఇలా అన్నందుకు మరోసారి ధన్యవాదాలు..:-)
@శ్రీ
హహ..బోమ్మకే భావం నేర్పించారా??
ReplyDeleteచాలా బగుంది శ్రీ గారు.బొమ్మ,కవిత రెండూ బాగున్నాయి
:)) :)
మీకు నా భావం చిత్రం నచ్చినందుకు
Deleteధన్యవాదాలు 123 గారూ!..:-)
@శ్రీ
Wowww!!
ReplyDeleteచాలా రోజుల తర్వాత మళ్ళీ పరిమళ భరితం చేసారు మా బ్లాగ్ ని..
Deleteధన్యవాదాలు మీకు కవిత నచ్చినందుకు...:-)
@శ్రీ
మీ కవిత్వాన్నీ, మిమ్మల్నీ కలుసకోవటం ఆనందంగా ఉంది 'శ్రీ' గారు.మీ లోని భావుకుడు మంచి భాషతో మదిని హాయిగొల్పే రచనలు చేయిస్తున్నాడు. అభినందనలు. మీరు ముఖపుస్తకంలోనూ రాయొచ్చుగా?
ReplyDeleteస్వాగతం వాసుదేవ్ (శ్రీనివాస్) గారూ!
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు...
మీరు అలా ప్రశంసిస్తే మాటలు రావటం లేదు...
మీ సలహా ప్రకారం ఇక మీదట పంపిస్తాను..
కాలేజీ టైములో కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి..
కృతజ్ఞతలతో....
@శ్రీ