ఎన్ని జన్మల పుణ్యమో...
ఎన్ని నోముల ఫలమో....
నాకడుపు పండి
నా ఒడి నిండినది నీ రాకతో...
కరిమబ్బు ఎపుడూ అందంగా అగుపించలేదు...
నీల మేఘంలా నీవు నాకు కనిపించనంత వరకూ...
నల్లని వర్ణంలో సౌందర్యం కానలేకపోయాను....
ఇంద్రనీలమణిలా ప్రకాశించే నిన్ను చూసేంతవరకూ...
నల్లకలువలలోని ఎర్రదనం తెలియదు నాకు...
నీ కలువరేకుల నయన సందర్శనం అయ్యేదాకా...
కదంబ పూల అందం ఎప్పుడో తెలిసిందో చెప్పనా?
నీ కర్ణాలకి ఆభరణాలైనపుడే....
గుండెలపై నీపాద తాడనం నొప్పి ఎందుకు పుట్టించదా?
అని చూస్తే అపుడుకదా నా కంట పడినాయి..
సుతిమెత్తని నీ చరణారవిందాలు..
నందుని
యింట విరిసిన ఆనందాల 'హరి'విల్లువి నీవు...
యదువంశనందనంలో వికసించిన పారిజాతానివి నీవు...
నా కంటి వెలుగువి నీవు...
మా ఇంటి వేలుపు నీవు......
నీవు బాలునిలా కాదు లోకపాలకుడిలా అనిపిస్తావు నాకు..
అందుకే చేయి చాచి అర్ధిస్తున్నాను కృష్ణా!
ప్రతి జన్మకీ నీ తల్లినయ్యే ఒక్క వరమూ నాకు ప్రసాదించవూ?
శ్రీ గారు
ReplyDeleteయశోద మనసును చక్కగా ఆవిష్కరించిన మీకు అభినందనలు ...
యశొద ఇంట చేరిన 'హరి ' విల్లై మనలోని అరిషడ్వర్గాలని తెగ నరకడానికి మనల్ని చేరాడు మన కృష్ణుడు..:)
ధన్యవాదాలు సీత గారూ!
Deleteనా భావం మెచ్చినందుకు....
అరిషడ్వర్గాలపై విజయం సాధించడానికి
ఆ దేవదేవుడు మనందరికీ ఆశీస్సులివ్వాలని
ప్రార్థిస్తూ....
@శ్రీ
wonderful!!
ReplyDeletevanaja gaaroo!
Deletethank you very much for your compliment..
@sri
చిన్నికన్నయ్య చిత్రంలో భలే ముద్దొస్తున్నాడండి.
ReplyDeleteధన్యవాదాలు పద్మార్పిత గారూ!
Delete@శ్రీ
తల్లిగా యశోద మనసెంతగా మురిసిపోయి ఉంటుందో మీ కవితలో మనసుకి కట్టి చూపించారు. ఏ తల్లి మాత్రం అలాంటి కన్నయ్య కి మళ్ళీ మళ్ళీ తల్లి కావాలని కోరుకోదు?
ReplyDeleteఎంచుకున్న చిత్రాలూ చాలా అందంగా ఉన్నాయి.
అభినందనలు!
చిన్ని ఆశగారూ!
Deleteఆత్మీయంగా పలకరించే మీ స్పందనకి చాలా సంతోషం..
మీరన్నది నిజమే..
పరమాత్మకు తల్లి కావడం కంటే వేరే వరం ఏముంటుంది?
ధన్యవాదాలు కవిత, చిత్రం నచ్చినందుకు...
@శ్రీ
శ్రీ గారు.. భలే వర్ణించారు అండీ... సూపర్....
ReplyDeleteధన్యవాదాలు సాయి...
Deleteకవిత, వర్ణన నచ్చినందుకు...
@శ్రీ
chkkaga undandi, mee feeling, keep writing.
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారూ!
Deleteమీ ప్రోత్సాహానికి...
@శ్రీ
మీ రెండో కవిత 'యశోద మనసు' బాగా రాసారు 'శ్రీ 'గారు! చిత్రాలు కూడా బాగున్నాయి.
ReplyDeleteరెండవ సుమం మీకు నచ్చినందుకు
Deleteధన్యవాదాలు నాగేంద్ర గారూ!
@శ్రీ
శ్రీ గారూ, నాకు ఈ భక్తి భావాలు తెలీదు, కాని మీ కవితలో సున్నితమైన యశోద తల్లి ప్రేమ చాలా గొప్పగా ఉంది. మీ పదము పదములో అక్షర ముత్యాలతో అల్లిన భావాల మాలను కన్నయ్య మొలకు కట్టిన సిరిమువ్వ గజ్జలతో పోల్చవచ్చు. సర్, బాగా రాసారు కన్నయ్య చిత్రాలు అందరికీ నచ్చుతున్నాయి. మంచి సెలక్షన్.
ReplyDeleteఫాతిమా గారూ!
Deleteయశోదలోని ప్రేమ.... నేను కన్నయ్యకి ఏమి చేస్తున్నాను అనుకోకుండా...
కన్నయ్యకి తల్లి కావడమే తన వరం అనుకోవడంలోనే కనపడుతుంది...
మీ పోలిక అద్భుతంగా ఉందండి...
కవితాభావం, చిత్రాలు నచ్చినందుకు ధన్యవాదాలు...
@శ్రీ
Super Sri garu !
ReplyDeleteపాట అత్యద్బుతం శ్రీ గారు!
Deleteధన్యవాదాలు హర్షా!
Deleteమీకు కవిత నచ్చినందుకు...
మీరు మీ పోస్ట్ లో యాసతో కూడిన మాండలికాల్లో టపాలు పెట్టినా
మీకు భాష పట్ల బాగా అభిమానమున్నట్లు కనిపిస్తుంది మీ వ్యాఖ్యలను బట్టి...
నేను క్యాంపులో ఉండగా పోస్ట్ చేసాను...
పాట లింక్ సరిగా దొరకలేదు...
ఈరోజు పాట మార్చాను...
పాట కూడా నచ్చినందుకు...
మరోసారి ధన్యవాదాలు..
@శ్రీ
నీల మేఘ శ్యామ మేలుముల్ దులకించు
ReplyDeleteమోహనాకార సమ్మోహ శక్తి
అడుగడుగు ఘటనల నాది దేవుండని
లోకాలు బొగుడు ముల్లోక శక్తి
కన్న,పెంచిన వారి కంటికి బిడ్డడై
బ్రమల దేలించిన పరమశక్తి
అవతార పురుషుడై , ఆచార్యుడై జగతి
నుధ్ధరించిన దివ్య శుధ్ధ శక్తి
దేవకీ వసుదేవుల తేజమగుచు
నందునికి యశోద కానంద మిడిన
కృష్ణ శక్తికి ప్రణతులు – శ్రీ కవితకు
నాదు మనసార అభినందనమ్ము లిడుదు .
----- సుజన-సృజన
ధన్యవాదాలు మీ ప్రశంసకు రాజారావు గారూ!
Deleteమీరు స్తుతించిన నీల మేఘశ్యాముని
లీలా తరంగిణిలో కొట్టుకొని పోయాను...
చాలా బాగుంది...
మీవంటి వారి ఆశీర్వాదాలు కావాలి మాకు...
@శ్రీ
అసలు ఎంత బాగుందో తెలుసాండి శ్రీగారు?
ReplyDeleteకవిత, పాట, చిత్రాలు అన్నీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి నన్ను!!
Too good!
వెన్నెలగారూ!
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి...
బాగా పొంగిపోయానండోయ్...:-)
పాట ఈ రోజు మార్చాను చూడండి..(అదే...వినండి.)
@శ్రీ
యశోద మనసు ననుభవింపజేసారండీ.
ReplyDeleteఅభినందనలు.
nice song too
-123
పాట,
Deleteకవితాభావం నచ్చినందుకు...
ధన్యవాదాలు 123 గారూ!
ఏమిటో ఇలా పిలవడమే బాగుండటం లేదు...
ఇలా అంకెలతో పేర్లు ఏ దేశం వారికి ఉంటాయో ....
అని గూగుల్ లో సెర్చ్ చేసాను..
దొరకలేదు...:-))
@శ్రీ
అద్భుతమైన అమ్మ ప్రేమను మీ కవిత హారతులు పట్టింది.
ReplyDeleteధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
Deleteమీ ప్రశంసకి...
"తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు కద ఈ జగమున "
అంటారందుకే..
@శ్రీ