కన్నయ్యకి గాలి సోకిందో ఏమో!
ఇరుగు పొరుగు వారి దృష్టి పడిందో?
లేక నా దిష్టే తగిలిందో?
బంతి విసిరితే చేతితో పట్టడం మాని
వింత శబ్దాలు చేస్తూ
మూతితో కింద పడకుండ
ఆడుతుంటావు...
సంధ్యవేళ అయితే చాలు...
సింహంలా గర్జిస్తూ...
చేతులు పంజాల్లా విప్పుతుంటావు...
విప్రబాలకులు కనిపిస్తే చాలు...
మూడు వేళ్ళు చూపిస్తూ
పెద్ద పెద్ద అంగలేస్తుంటావు
రాజుల కథలు చెప్తుంటే...
ఏదీ నా పరశువు అంటూ...
వెదుకుతుంటావు ఇల్లంతా...
రామా లాలీ! అంటూ జోల పాడుతుంటే...
హా లక్ష్మణా! హా సీతా! అంటూ
విల్లెక్కడ అని అడుగుతుంటావు...
రోజూ బలరామునికి పెట్టే
నల్లని చుక్కే దిష్టి తగలకుండా
పెడుతున్నాను కదా!
రేపటినుంచి అందరూ చూసేలా
వెన్నచుక్కనే అద్దాలి నీకు....
ప్రజెంటేషన్ చాలా బాగుంది శ్రీ గారు!
ReplyDeleteధన్యవాదాలు హర్షా మీకు..
Deleteనా కవిత సమర్పించిన తీరు నచ్చినందుకు..
@శ్రీ
శ్రీ గారూ, అన్ని అవతారాలు ఒకే సారి చెప్పారు. అందంగా అమ్మ ప్రేమ కలిపి. వెన్న చుక్క కొత్త ప్రయోగం, ఈ సందర్బంగా ఓసారి చదివినది గుర్తుకొచ్చింది. రాయలవారి కొలువులో కవులకు రామలింగడు చేసే కొత్త ప్రయోగాలు (భాష మీద )మీద కినుకగా ఉండేవట. ఎన్ని విదాలుగా ప్రయత్నించినా వీరు వారు కాలేక పోయేవారట, కనుక కొత్త భాషా ప్రవీణ అనవచ్చు మిమ్మల్ని.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమా గారూ!
Deleteమీ ప్రశంసకి...
నేను వ్రాసేవాటిని ఆదరిస్తున్నందుకు..
విశ్లేషిస్తున్నందుకు...
@శ్రీ
నాకంటే ఫాతిమా గారు చాలా మేలండి,
ReplyDeleteనాకెంతసేపటికి తట్టనేలేదు, అన్ని అవతారాలు చిన్న కవితలో అంత చక్కగా కూర్చారని, అభినందనలు.
పునర్జన్మ కాన్సెప్ట్ తో వ్రాసేశాను భాస్కర్ గారూ!
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి..
@శ్రీ
విష్ణుమాయ
ReplyDeleteఅంతే కదా శర్మ గారూ!..:-)
Deleteధన్యవాదాలు మీకు..
@శ్రీ
చాలా బావుంది. ప్రయోగాత్మక శ్రీ.. గారు.. చక్కని శైలి. అభినందనలు.
ReplyDeleteమిగిలిన అవతారాలు ఎప్పుడో!?
వనజ గారూ!
Deleteబిరుదు తగిలించేసుకుంటాను..:-)
జలచరాలను వదిలేసి భూచరం నుంచి మొదలు పెట్టానండి..
మీ ప్రశంసకి ధన్యవాదాలు...
@శ్రీ
మా పిల్లల అల్లరి గుర్తొస్తుంది కన్నయ్య అల్లరి చదువుతుంటే!
ReplyDeleteమీ పిల్లల అల్లరి కన్నయ్య అల్లరి చూస్తె గుర్తొచ్చిందా!..:-)
Deleteమీ అల్లరి పిల్లలకు ఆశీస్సులు...
ధన్యవాదాలు రవి శేఖర్ గారూ!
@శ్రీ
శ్రీ గారూ,
ReplyDeleteచదువుతూ భలే ఉందే అనుకున్నామే తప్ప అందులో అవతారాలు ఇమిడి ఉన్నాయని ఫాతిమ గారి కామెంట్ చదివాకే అర్ధం అయ్యి మళ్ళీ చదివాము.
చాలా చక్కగా రాశారు, ఓ పాటలా అనిపించింది.
కన్నయ్య మీద బాగా రాస్తున్నారు కవితలు.
అభినందనలు!
చిన్ని ఆశ గారూ!
Deleteభాస్కర్ గారి కామెంట్, మీ కామెంట్ చదివాక..
ఫాతిమా గారికి మరోసారి ధన్యవాదాలు చెప్పాలన్నమాట..:-)
వాటికి చిత్రాలు పెట్టాలనుకున్నాను కానీ కవితకంటే ఎక్కువ చోటు అవే ఆక్రమిన్చేస్తున్నాయి..
మీరైతే..కృష్ణుడి చుట్టూ ఐదు దిశల్లో ఐదు అవతారాలు వేసేసేవారు..:-)
మీ మెచ్చుకోలుకి...బోలెడు ధన్యవాదాలు..
@శ్రీ
శ్రీ గారూ,మీకు తెలుసు కదా చిన్నిఆశ గారూ, భాస్కర్ గారూ, ఇద్దరూ మేదావులే, ఓ పాట గుర్తొస్తుంది ఈ సంధర్బంలో " నువ్వు దాటలేక కాదులే రామయ తండ్రీ ... నను దయచూడగా వచ్చావు .." అన్నట్లు కవిత లోతు చూడగా ఉన్నారు వారు.
DeleteWOW!!!చాలా బాగుందండి!! కొత్తగా , చక్కగా ఉంది. నాకైతే కృష్ణుడే రాయిస్తున్నాడా అనిపిస్తుంది...చాలా బాగుంది ఈ కవిత!!
ReplyDeleteభగవంతునికి నివేదన చేసే పదార్ధం రుచి అద్భుతంగా ఉంటుంది చూడండి..
Delete(గుడిలో పులిహార లాగ..:-)....)
ఆయనను తలచుకొని వ్రాసేవి అందుకే మీ అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి..
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
@శ్రీ
భలేగా వ్రాశారే...
ReplyDeleteమీకు కవితాభావం నచ్చినందుకు
Deleteధన్యవాదాలు జ్యోతి గారూ!
@శ్రీ
సరళమైన భాష, చక్కటి భావం,అందమైన శైలి, ముచ్చటైన చిత్రం,అద్భుతమైన పాట తో కవిత ఆకట్టుకుంది.'శ్రీ' గారు అభినందనలు!
ReplyDeleteమీరిచ్చిన అన్ని ప్రశంసలకి
ReplyDeleteబోలెడు ధన్యవాదాలు నాగేంద్ర గారూ!
@శ్రీ
శ్రీ గారూ
ReplyDeleteఆలస్యం గా చూసా...!!
చాలా బాగా వర్ణించారండీ :)
జై శ్రీ కృష్ణ....!!
కన్నయ్య అల్లరిని, అమ్మ ప్రేమను చక్కగా చెప్పారండీ
ReplyDeleteకవిత బాగుంది..
మీ ప్రశంసకి ధన్యవాదాలు రాజి గారు...
ReplyDelete@శ్రీ
శ్రీ గారు, మీకవిత చదవటానికొచ్చిన నేను....మీ కృష్ణ భక్తి మొత్తం ఏకబిగిన చదివేశాను.ఎంతందంగా ఆవిష్కరించారు!! రాధ ప్రశ్న, వెన్నచుక్క మరీ బావున్నాయండీ.మా (మన) కన్నయ్యను ఇంత అద్భుతంగా వర్ణచిత్రాలతో సహా అందించారు ధన్యవాదాలు.
ReplyDeleteపరిమళం గారూ!
ReplyDeleteధన్యవాదాలు నా కవితలు మెచ్చినందుకు...ఆ దేవదేవుని గురించి వ్రాయాలని సంకల్పించాను...అంతే...ఆయనే వ్రాయించాడు అన్నీ...చిత్రాలు చాలా మటుకు వెన్నెల గారు పంపించారు...@శ్రీ