నా ఎదుట నీవున్నట్లు
నా ఎదలో నీవు కదిలినట్లు
నీతో నేను నడిచినట్లు
నీ నీడలో నేను కలిసినట్లు
నీ పిలుపు మంజీరనాదమై మ్రోగినట్లు....
నీ మురళీరవం నా చెవికి సోకినట్లు
నా ఒడిని నీవు చేరినట్లు..
నా కలలో నీవు కరిగినట్లు...
నా కలలో నీవు కరిగినట్లు...
నా శ్వాస వేగమైనట్లు...
నా పరువం నాకే భారమైనట్లు....
పారిజాతాలు గడ్డిపూలైనట్లు...
గరిక పానుపు ముళ్ళ పానుపైనట్లు...
బృందావనం కంటకవనమైనట్లు...
చంద్రుడే మండినట్లు..చీకటే నవ్వినట్లు....
అష్ట భార్యలు నిన్ను చుట్టుముట్టినట్లు...
గోపికలంతా నీ చెంత ఉన్నట్లు...
నన్నసలు నీవు తలవనట్లు...
నీకోసం పరితపించె నా హృదయం...
నీకోసం వేచి చూసె నా నయనం...
నీకు తెలియదు కు'మారుడు' పంచప్రాణాలు తీస్తున్న వైనం...
ఊహలలోనే......
నీకు తెలియదు కు'మారుడు' పంచప్రాణాలు తీస్తున్న వైనం...
ఊహలలోనే......
నా కంఠముక్తావళి నీ గుండెలపై జారె...
నీ నుదుట కస్తూరి నా ఎదపై కరిగె...
నీ శిఖపింఛము నా మెడను నిమిరె...
నీవు నా సిగ్గులు దోచె.. నా విరహం తీర్చె
హత్తుకొనె...నా మనసును నీ మనసు...
లీనమయ్యె నీరాధ..తన మాధవునిలో...
నీ నుదుట కస్తూరి నా ఎదపై కరిగె...
నీ శిఖపింఛము నా మెడను నిమిరె...
నీవు నా సిగ్గులు దోచె.. నా విరహం తీర్చె
హత్తుకొనె...నా మనసును నీ మనసు...
లీనమయ్యె నీరాధ..తన మాధవునిలో...
అన్నీ ఎంత అందమైన ఊహలో:-)
ReplyDeleteమీ స్పందనకు.. ధన్యవాదాలు పద్మ గారూ!
Deleteఅంతే...ఊహలు ఎప్పుడూ వాస్తవాలకంటే అందంగానే ఉంటాయి కదూ!..:-)
@శ్రీ
ఆనందో బ్రహ్మ
ReplyDeleteఆనందో బ్రహ్మ అంటే..
Deleteఇంక వేరే చెప్పేదేముంది...:-)
ధన్యవాదాలు శర్మ గారూ!
అబ్బా.....
ReplyDelete"లీనమయ్యెనీ రాధ..
తన మాధవునిలో..."
శ్రీ గారు ఎంత కమ్మ గా వ్రాసారో ..కానీ ఎక్కడో కదిలించారండీ...
రాధామోహనం అదిరంది :)
సీత గారూ!
Deleteఆఖరి వాక్యం వ్రాయడానికి
నిజంగా కొంచెం కష్టపడ్డానండి.
లీనమయ్యెనీ రాధ.....
లీనమయ్యె నీ రాధ....
రెండు అర్థాలు రావాలని నా ప్రయత్నం...
ధన్యవాదాలు మీ ప్రశంసకి...:-)
@శ్రీ
"యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా"
ReplyDelete"రాధా మోహనం" చాలా బాగుందండీ..
రాజి గారూ!
Deleteఎంతైనా...పాటల బ్లాగ్ వారి చూపు వేరేగానే ఉంటుందండి...:-)
దళపతి లోని ఆ పాట గుర్తు రాలేదండి.
జయ భేరి లో యమునా తీరమున...
ఎందుకో డౌన్లోడ్ అవలేదు...
ఆ పాట పెట్టాలని అనుకున్నాను అసలు...
ధన్యవాదాలు మీ ప్రశంసకి...
@శ్రీ
ఊహలన్నీ అద్భుతంగా ఉన్నాయండి.కానీ అన్ని కృష్ణునికే ఖర్చు పెట్టేస్తున్నారేమో అనిపిస్తుంది.నాకు చాలా ఇష్ట మైన పాట పెట్టారు.
ReplyDeleteరవి శేఖర్ గారూ!
Deleteబోలెడు ధన్యవాదాలు మీ ప్రశంసకి...
కృష్ణునికి నివేదిస్తే...మరికొన్ని కొత్త ఊహలు ప్రసాదిస్తాదేమో!..:-)
ఈ కవితకి పెట్టిన పాట నచ్చినందుకు మరోసారి ధన్యవాలందిస్తూ....
@శ్రీ
'శ్రీ' గారు! కృష్ణుడు గురించి ఎంత చెప్పినా వినాలని ఉంటుంది. అందమైన మీ కవితలు ఎంత చదివినా ఇంకా చదవాలనిపిస్తుంది. రాధ ముగ్ధ మనోహరంగా వుంది.
ReplyDeleteనాగేంద్ర గారూ!
Deleteఆత్మీయతతో మీరిచ్చిన ప్రశంసా కుసుమాలను
భద్రంగా దాచుకుంటాను...
ధన్యవాదాలు మీకు.
@శ్రీ
ఎంత చక్కగా రాశారో రాధ మాధవుల ప్రణయం, అభినందనలు.
ReplyDeleteహిరోషిమా మీద అణుబాంబు వేసిన రోజిది.
ప్రపంచశాంతిని కోరుకుందాం – యుద్దాలను వ్యతిరేకిద్దాం
భాస్కర్ గారూ!
Deleteమీ ప్రశంసకు చాలా ధన్యవాదాలు...
వారి ప్రణయం..క్షేత్రయ్య పదాల్లో చూసినా...
జయదేవుని అష్టపదులలో చూసినా...
అద్భుతంగా కనిపిస్తుంది...
@శ్రీ
శ్రీ గారూ, ఇతిహాసాలు, పురాణాలు నేను ఎరుగను .
ReplyDeleteకానీ మీరు రాస్తున్న ఈ ప్రేమ కవితలు చాలా అందమైన ప్రయోగంలా అనిపిస్తున్నాయి.
మీరు చాలామంది మంచి కవుల జాబితాలో చేరిపోయారు.
సర్ అతిసేయోక్తి కాదు మనస్పూర్తిగా మీ అక్షరాలకు నా అక్షరసుమాంజలి సమర్పించుకుంటున్నాను.
ఫాతిమా గారూ!
Deleteమీరు ఇంత ఆత్మీయంగా ఇచ్చే ప్రశంసలు...
ఇక ముందు వ్రాసే వాటికి సోపానాలౌతాయి.
ధన్యవాదాలు మీకు.
@శ్రీ
తిట్టకండేం...రాధ అలా విలపిస్తూ మరింత ముద్దొస్తుంది:)
ReplyDeleteప్రేరణ గారూ!
Deleteచిత్రంలో రాధ మనకే అంత ముద్దొస్తే....
మరి మాధవునికో....:-)
ధన్యవాదాలు మీ స్పందనకి.
@శ్రీ
సృజన అని వ్రాయబోయి ప్రేరణ అని వ్రాసాను...
Deleteక్షమించాలి...
@శ్రీ
ఆ మురళీ రవమ్ము హృదయమ్మును తాకిన హాయి గల్గె - ఆ
ReplyDeleteస్వామి కవుంగిలింత వివశమ్మయి రాధిక గోచరించె - 'శ్రీ '
'భామిని '- యై రచించిన ప్రభావము గన్పడె - అంతరంగ మం
తా మథురాను భూతుల ముదంబులు గల్గెను మిత్రమా ! కడున్ .
----- సుజన-సృజన
నా కవితా సారాన్ని అలా నాలుగు పద్యపాదాలలో
Deleteచెప్పడం మీకే సాధ్యం...
కవిత మీకు మధురానుభూతి కలిగించిందంటే...
అది నా భాగ్యం.
మీ ప్రశంసకి
ధన్యవాదాలు రాజారావు గారూ!
@శ్రీ
శ్రీనివాస్ గారు.. అబ్బా ఎంత చక్కగా రాసారో అండీ..
ReplyDelete"హత్తుకొనె...నా మనసును నీ మనసు...లీనమయ్యె నీరాధ "
చాలా బాగుంది....
ధన్యవాదాలు సాయీ!
Deleteకవిత నచ్చినందుకు...
ఆత్మీయతతో కూడిన ప్రశంసకు...
@శ్రీ
రాధామాధవం మనోహరం
ReplyDeleteలీలా మోహనం నుంచి రాదా మోహనానికి స్వాగతం
Deleteవిజయమోహన్ గారూ!
మీకు నా కవితాహారం .. మనోహరంగా అనిపించినందుకు
ధన్యవాదాలు...
మీ సొర మయూరాలు చూస్తూ ఉంటాము మేము కూడా:-)
@శ్రీ
శ్రీనివాస్ గారు ..చాలా బావుందండీ! తెల్ల గులాబీలు చిత్రం లో పాట అదిగదిగో యమునా తీరం ..పాట కూడా బావుంటుంది అండీ ! ఈ పోస్ట్ చూడండీ!
ReplyDeletehttp://vanajavanamali.blogspot.in/2010/12/naakistamaina-paata_31.html
వనజ గారూ!
Deleteధన్యవాదాలు మీకు కవిత నచ్చినందుకు.
మీరు చెప్పిన పాట కూడా చాలా బాగుంటుంది...
మీ లింక్ చూసాను..మంచి సాహిత్యం...
@శ్రీ
anni kavitaluu.............excellent....nenu appudappudu mee blog nu darsinchukovachchaa?
ReplyDeletekaasta kavitala pichi anduke SREE....MAA TELUGU TALLIKI PAATA FANTASTIC......
premato...
sunderpriya
నా బ్లాగ్ కి స్వాగతం
Deleteమీకు నా కవితలు నచ్చినందుకు...
పాట మెచ్చినందుకు...
ధన్యవాదాలు సుందరప్రియ గారూ!
బ్లాగ్ మీరు తప్పక చూడవచ్చు...
@శ్రీ