02/08/2012

భామ! సత్యభామ!




రుక్మిణికి ఇచ్చినది 
శచీంద్రుని నందనోద్యాన పారిజాతం 
నీకేపుడో ఇచ్చేసినది 
సత్యేంద్రుని మనోవన పారిజాతం.

నను వరించి వచ్చిన 
వనితామణులు ఆ ఏడుగురు.
దివ్యమణితో లభించిన 
షోడశకలానిధివి నీవు.

నీ శౌర్యం... 
అణచింది నరకుని క్రౌర్యం 
రౌద్ర రసంలోనూ తొణికింది
నీ అపురూప సౌందర్యం....

నీతో ప్రణయం 
తుషార బిందు మాలికామయం
నీతో కలహం 
మృగ మరీచికా సమూహం... 

నీ వలపు వీక్షణలు 
మదనుడెక్కుబెట్టిన శృంగార అస్త్రాలు..
నీ కోపపు చూపులు
గరళం పూసిన కరకు శరాలు...

మీరను నీ యానతి...
దాటను నీవు గీసిన గీత...
కోపాగ్నికి ఎర్రబడిన నీకు...
వెన్నముద్దలు తిని, 
నవనీతభరితమైన 
నా అధరపు మధువే లేపనం...

నీ మెత్తని పాదంతో మొదలు పెట్టనీ...
మెల్లగా హద్దులన్నీ దాటనీ...
నీ అలుకలు తీరేదాక...
నా బిగికౌగిలిలో ఒదిగే దాక...  














29 comments:

  1. విరహంలో కాని లేరుకదా! :)

    ReplyDelete
    Replies
    1. విరహమేనేమో!....:-)
      విరహము కూడా సుఖమే కాదా!..:-))
      ధన్యవాదాలు మీ స్పందనకి శర్మ గారూ!
      ప్రతిస్పందన ఆలస్యమైనందుకు క్షంతవ్యుడిని...
      (ఈ పై వాక్యం అందరి మిత్రులకీ చెందుతుంది సుమా).:-)
      @శ్రీ

      Delete
  2. వావ్ !..సత్య భామలో ఇన్ని కోణాలు చూపారు. గ్రేట్ అండీ! మీరు ఆవిడ ఫ్యాన్ కూడా కాదు ఏ సి కూడా అని అర్ధమైందండీ!

    ReplyDelete
    Replies
    1. వనజ గారూ!
      అలాగంటారా?
      చెప్పలేనంత ప్రేమ..
      తనకే సొంతం కావాలనే పంతం...సత్యభామకే కదా సొంతం...:-)
      "భామాకలాపం" నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ...
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      @శ్రీ

      Delete
  3. నీ మెత్తని పాదంతో మొదలు పెట్టనీ...
    మెల్లగా హద్దులన్నీ దాటనీ...
    నీ అలుకలు తీరేదాక...
    నా బిగికౌగిలిలో ఒదిగే దాక.....
    ఈ దెబ్బకి సత్యభామ మెత్తని భామ కాదా...అభినందనలు సార్..లవ్లీ పోయిం..

    ReplyDelete
    Replies
    1. వెన్నెలదారి లోని చల్లని ప్రశంసకి
      చాలా ధన్యవాదాలు వర్మగారూ!
      మెత్తని భామ అవ్వాల్సిందే కదండీ!..:-))
      @శ్రీ

      Delete
  4. వావ్... ఈసారి పెట్టిన పిక్ కూడా సూపర్... :)
    మీరు గ్రేట్ శ్రీ గారు !

    ReplyDelete
    Replies
    1. హర్ష గారూ!
      ధన్యవాదాలు మీ ప్రశంసకి...
      చిత్రం బాబూరావు గారిదని రసజ్ఞ గారి వలన తెలిసింది నాకు...
      ఆయనకి కృతఙ్ఞతలు కూడా చెప్పుకోవాలి...
      @శ్రీ

      Delete
  5. "రుక్మిణికి ఇచ్చినది
    శచీంద్రుని నందనోద్యాన పారిజాతం
    నీకేపుడో ఇచ్చేసినది
    సత్యేంద్రుని మనోవన పారిజాతం".

    శ్రీకృష్ణుడి మనస్సులో సత్యభామకు ఎంత గొప్ప స్థానముందో చాలా చక్కగా చెప్పారండీ..
    కవిత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారూ!
      మీ ప్రశంసకి...
      అష్ట భార్యలలో
      భక్తిలో రుక్మిణి అగ్రస్థానంలో ఉంటే
      ప్రేమలో సత్య అగ్రస్థానంలో ఉంది కదండీ!
      @శ్రీ

      Delete
  6. శ్రీ గారు, చక్కని కవితతో అలరించినందుకు, ధన్వవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారూ!
      మీకు కవిత నచ్చినందుకు...
      మీరు ఇలాగే తెలుగు అక్షరాలలోనే
      వ్యాఖ్యలివ్వండి..:-)
      @శ్రీ

      Delete
  7. శ్రీ గారూ, కవిత బాగుంది, సత్యభామ మీద కృష్ణునికి ఉన్న ప్రేమని చక్కగా వర్ణించారు.
    ఇక కొత్తపదాలను రాయటంలో మీము మీరే సాటి.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ!
      మీకు కవితాభావం నచ్చినందుకు ధన్యవాదాలు...
      నా పదప్రయోగం మీకు నచ్చినందుకు
      మరోసారి ధన్యవాదాలు..
      @శ్రీ

      Delete
  8. ఇన్నేసి క్రొత్త పదాలు ఎక్కడ దొరుకుతాయో మీకు!! కాస్త క్లూ ఇవ్వండి ప్లీజ్:-)

    ReplyDelete
    Replies
    1. పద్మగారూ!
      మీ అందరి కవితలు చదువుతూ
      ఉంటేనే కొత్త పదాలు దొరుకుతుంటాయి:-))
      అదే రహస్యం..
      ధన్యవాదాలు మీ స్పందనకు...
      @శ్రీ

      Delete
  9. మీ కవిత బాగుందండీ! దీనికి బాబూరావ్ గారి పైంటింగ్ మరింత అందాన్నిచ్చింది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రసజ్ఞ గారూ!
      మీకు కవిత నచ్చినందుకు...
      చిత్రం గురించి మీరు తెలియజేసారు...
      వారికి కృతజ్ఞుడను...
      @శ్రీ

      Delete
  10. అద్భుతంగా వ్రాశారు...

    ReplyDelete
    Replies
    1. మీ ప్రశంసకి బోలెడు ధన్యవాదాలు జ్యోతి గారూ!
      @శ్రీ

      Delete
  11. శ్రీ గారూ...
    చాలా బాగా రాసారు..:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సీతగారూ!
      మీరు కవిత మెచ్చినందుకు...:-)
      @శ్రీ

      Delete
  12. శ్రీ గారు చాలా చక్కగా రాసారు అండీ... సూపర్...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సాయీ!
      సాయి సూపర్ అంటే బాగా నచ్చేసినట్లే...:-))
      @శ్రీ

      Delete
  13. కవిత బాగుంది, ఎన్నో క్లిష్టమైన పదాలతో అలవోకగా అల్లేశారు భామల్లో కల్లా కోపాగ్ని "సత్య భామ" పైనే ఏకంగా...
    చల్లారిందా భామాగ్ని? ;)
    ముగింపు నాలుగు లైన్లూ అద్భుతంగా ఉన్నాయి.
    అభినందనలు!
    పెయింటింగ్ లో అద్భుతంగా "అలక భామ" గుర్తొచ్చేలా గీసిన ఆర్టిస్ట్ గారికీ అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నవనీత చోరుని అధారామృతంతో
      భామాగ్ని చల్లారక మానునా?..:-))
      ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!
      మీ స్నేహపూర్వకమైన ప్రశంసకి...
      నిజంగానే చిత్రం చాలా నచ్చింది..
      బాబూరావు గారు వేసిన చిత్రమని రసజ్ఞ గారు చెప్పారు.
      అందరికీ "friendship day"శుభాకాంక్షలు...
      @శ్రీ

      Delete
  14. ఆ రమణీ లలామ పరుషాగ్నికి తన్నులు తిన్న స్వామితో
    మీరును చేరలేదు కద ! మిత్రమ ! జాగ్రత ! శ్రీనివాస!' శ్రీ '
    వారికి 'యొక్కరే' గద ! వివాదపు త్రోవలు లేవుగా !సఖా !
    వేరు దలంప బోకు- ప్రభవించెను సందియ మొక్క టెందుకో .
    -----సుజన-సృజన

    ReplyDelete
  15. చంపేశారు ...ఉన్నట్లుండి ఎంతమాట అనేసారు రాజారావు గారూ!
    వలదు సందేహము...'శ్రీ'వారికి శ్రీమతి యొకతే కదా!:-))...:-))
    లేవు వివాదపు త్రోవలు...అన్నియు రహదారులే..:-)
    పద్యంతో పలకరించినందుకు చాలా ధన్యవాదాలు మీకు
    @శ్రీ

    ReplyDelete