నా చంద్రవదన
వదనాన్ని
ప్రతిబింబిస్తోంది
నీలాకాశపు
చుక్కల నిలువుటద్దం .
చందమామ
అసూయతో కందిపోతోంది
తానుండగా
మరో చందమామ
చుట్టూ భూమి తిరుగుతోందని...
వెన్నెల విస్తుపోతోంది
నా వన్నెలు
ఈ వన్నెల
విసనకర్ర ముందు
కానరావటం లేదని...
నీ యవ్వనపు నదీ ప్రవాహంతో
కలిసేందుకు సాగరమే
కదిలి ముందుకొస్తోంది
నీ పాదాలు
అలల నురుగుతో
కడుగుతూ
స్వాగతించేందుకు...
కదిలి ముందుకొస్తోంది
నీ పాదాలు
అలల నురుగుతో
కడుగుతూ
స్వాగతించేందుకు...
అంతటి వాళ్ళే
నీ సౌందర్యానికి దాసోహమంటే....
ఇక నా మాట వేరే చెప్పాలా ప్రియా?... @శ్రీ
మరీ ఇంతగా పొగిడేస్తే ఆ వన్నెల వెన్నెల కన్నియ మది ఏమగునో!!ఏమో!!
ReplyDeleteలక్ష్మీ దేవి గారూ!
Delete"స్వయంకృషి" సినిమాలో విజయశాంతి అభినయంతో
"నన్నట్టా పొగడమాకయ్యా!" అనేస్తుంది లెండి మహా అయితే.....:-)
ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...
@శ్రీ
మీ కవిత చాలా బావుంది శ్రీ గారు.
ReplyDeleteమనసు శాస్త్రం ,అలంకార శాస్త్రం రెండు బాగా తెలిసిన మీ కవితలు మనసు ని దోచుకుంటున్నాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. ఇలాగే అలరిస్తూ ఉండాలి.
ధన్యవాదాలు వనజ గారూ!
Deleteఇంత చక్కని ప్రశంసకు బోలెడు ధన్యవాదాలు...
మీవంటి మిత్రుల ప్రోత్సాహం అభినందనీయం...
@శ్రీ
Intha adbhuthamiana kavitha aa andala raasiki chupincharaa mari :)
ReplyDeleteనేస్తం గారూ! ( నేస్తమా!)
Deleteఅలా వ్రాసినది చూపించడానికి
కన్ను విప్పే లోగా
స్వప్నం చెదిరిపోతోంది...
ధన్యవాదాలు మీ చక్కని ప్రశంసకు...
@శ్రీ
చక్కని చిత్రం,చక్కని వర్ణన.
ReplyDeleteరవిశేఖర్ గారూ!
Deleteధన్యవాదాలు
మీకు చిత్రం, కవిత నచ్చినందుకు...
@శ్రీ
శ్రీగారూ, నా ఊహ నిజమే అయితే ఈ కవిత కూడా మీరు చిత్రం చూసి రాసినట్లే ఉన్నారు.
ReplyDeleteమేమంతా కవిత రాసి చిత్రం వెతుక్కుంటాము.
నింగీ నేలా కలిసే చోట రెండు చందమామలు ఎదురెదురుగా ఉన్నట్లు ఉంది మీ చిత్రం.
చందమామకైనా మచ్చ ఉంది గానీ మీ కవితకు లేదు. చక్కని వర్ణన. బాగుంది.
అవును మెరాజ్ గారూ!
Deleteఫేస్ బుక్ లో నా స్నేహితులు పోస్ట్ చేసిన
చిత్రం చూసి పుట్టిన భావమే ఇది...
ధన్యవాదాలు...మీరిచ్చిన వెన్నెలంటి ప్రశంసకు..
@శ్రీ
andamaina chithram antha kannaa andamaina kavitha chaalaa bagundandi
ReplyDeleteవీణ గారూ!
Deleteచిత్రం,
కవితలోని భావం మీరు మెచ్చినందుకు
ధన్యవాదాలు....@శ్రీ
ప్రియురాలి అందాన్ని బహు గొప్పగా రాశారు.
ReplyDeleteమీ కవితకి చక్కగా కుదిరే బొమ్మనెలా దొరికిందీ?
లేదా బొమ్మ చూశాక కవిత భావం అలా ఒదిగిందా?
చాలా బాగుంది శ్రీ గారూ!
చిన్ని ఆశ గారూ!
Delete'చిత్రం' చూసి కలిగిన భావాలనే
మీముందు ఉంచాను...
మీకు ఆ భావమాలిక నచ్చినందుకు
చాలా ధన్యవాదాలు...
@శ్రీ
మీ కవిత బావుంది.
ReplyDeleteధన్యవాదాలు పద్మా రాణి గారూ!
Deleteమీకు కవిత నచ్చినందుకు...
@శ్రీ