ఇది ఓ 3 దశకాల క్రిందటి మాట...
మీతో పంచుకుంటున్నా ఈ పూట...
నాన్నతో ఓ ఆగంతకుని పరిచయం...
అయింది ఆయనకు అతనిలో ఏదో ప్రియం...
వెంటనే చేసారు ఆహ్వానం...
మా ఇంట్లోనే పెట్టించాము మకాం...
అమ్మ నాన్న చెప్పేవారు మంచి చెడుల మధ్య భేదం...
ఆగంతకునిదంతా వేరే మార్గం...
ఆకట్టుకోవడం అతని నైజం....
సాహసాలు..కథలు...కావ్యాలు...హాస్యాలు అతని సొంతం..
అవి చెప్పడంలోనూ అందె వేసిన హస్తం...
ఒకోసారి నవ్విస్తాడు..ఒకోసారి ఏడ్పిస్తాడు..
మాటలాపడు...నిద్రపోడు...
నా మీదే అమ్మ నాన్నల ప్రతాపం...
చూస్తూనే ఉన్నా... అతనిపై ఇవేవీ చెల్లకపోవడం...
ఇంటికి ఎవర్నీ రానిచ్చేవాడు కాడు,
వచ్చినవాళ్ళతో సరిగా మాట్లాడనిచ్చేవాడు కాడు,
మమ్మల్ని ఎక్కడికీ కదలనిచ్చేవాడు కాడు.
అయినా నాన్న అతన్ని ఏమి అనేవారు కాదు...
మద్యం అపుడపుడు తాగమని ప్రోత్సహించేవాడు...
సిగరెట్లు బాగుంటాయని చెప్పేవాడు...
అశ్లీలమైనవి కూడా బాహాటంగా చర్చించడం మొదలెట్టాడు...
మామీద నెమ్మదిగా అతని ప్రభావం పడింది...
స్నేహితులు ఇంటికి రావడం తగ్గింది...
బంధువులు రావడం కూడా తగ్గింది...
చాలా కాలం గడిచిపోయింది...
మాపై అతని మాటల ప్రభావం తగ్గిపోయింది...
అతని పలకరింపులు వినడం కూడా మానేసాం...
ఓ మూలన అతనికి స్థలం కేటాయించాం...
మేమతన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం...
అయినా పెళ్లి చేసుకున్నాడు...పిల్లల్ని కన్నాడు...
వాళ్ళని మామీద వదిలేసాడు....
తాను మాత్రం నిశ్చింతగా నిద్ర పోతున్నాడు.... :-) ... :-)
(ఈ 'టపా'కి నా మిత్రుడు ఫార్వర్డ్ చేసి పంపిన ఓ ఇంగ్లీష్ మెయిల్ ఆధారం)
:))
ReplyDelete:-)..:-)
Deleteబాగా వ్రాసారు శ్రీ గారు ముందుగ అభినందనలు. నిజంగానే మీరన్నట్లు ఆ ఆగంతకుడు మనసులను మనుషులను దూరం చేసినా అతని భార్యలు మాత్రం అప్పుడప్పుడు మనుషులను దగ్గర చేస్తున్న పుణ్యం మూట కట్టుకుంటున్నారండోయ్ ఇదిగో ఇలా........:-)
ReplyDeleteధన్యవాదాలు రమేష్ గారూ!
Deleteమీరు అన్నట్లు కాలంతో నడవాలి... తప్పదు...:-)
కానీ యంత్రాన్ని మనం బానిసలుగా చేసుకోవాలి గానీ...
యంత్రం మనలను బానిసలుగా మార్చకూడదు...
@శ్రీ
హ,హ........ తమాషాగా వుందండి.
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారూ!
Deleteమీ స్పందనకు...మీకు నచ్చినందుకు...:-)
@శ్రీ
శ్రీగారూ, అతనిది మంచి కుటుంబమే మంచి,చెడుల కలయిక ఉన్న కుటుంబం.
ReplyDeleteకొంత చెడు ఉన్నా , కొంత మందికి ఆత్మీయులను దగ్గర చేస్తుందా కుటుంబం మనం సదా రుణపడి ఉండాలి.
ఈ సారి కొత్త గా సరదాగా ఉన్న పోస్ట్ పెట్టి బ్లాగ్ కి కొత్త అందం తెచ్చారు.
మెరాజ్ గారూ!
Deleteయంత్రాలను మనం సరిగా ఉపయోగించగలిగితే
అది అందరికీ మంచిదే...
నా 'టపా'లోని భావాలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...
@శ్రీ
sir superb,chala super ga undhi
ReplyDeleteఅచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ విజిట్
http://www.logili.com/
మీకు నచ్చిన పుస్తకాల మీద మీ రివ్యూ లను పంపండి.
review@logili.com
లోగిలి కి ధన్యవాదాలు...
Deleteమీ పుస్తకాల భాండారం నుంచి నేను కొన్ని పుస్తకాలు
ఆర్డర్ చేసాను...
@శ్రీ
భలే తమషాగా ఉంది. బొమ్మ చూసి కూడా ఎవరా అంటూ ఆసక్తిగా చదవసాగాం... ;)
ReplyDeleteచిన్ని ఆశ గారూ!
Deleteధన్యవాదాలు మీకు
నేను ఆ మెయిల్ ను టపా గా మార్చినది మీకు నచ్చినందుకు...:-)
@శ్రీ
wonderful..
ReplyDeleteThe same time.. LOL.
vanaja gaaroo!
Deletethank you very much for your wonderful compliment...
replying with LOL>>>LOL>>>
@sri
నేటి ఎలక్ట్రానిక్ వస్తువులపై మీ కవితా విసుర్లు చాలా బాగున్నాయి.
ReplyDeleteమనం చేసిన యంత్రం మన మాట వినాలి గానీ...
Deleteదాని చెప్పుచేతల్లో మనం ఉండకూడదు కదండీ...:-)
మీకు నా భావ వ్యక్తీకరణ నచ్చినందుకు ధన్యవాదాలు
రవి శేఖర్ గారూ!
@శ్రీ
అభినందనలు, చాలాబాగారాసారు......ఆలస్యంగా చూసాను:-(
ReplyDeleteధన్యవాదాలు పద్మారాణి గారూ!
ReplyDeleteమీ ప్రశంసకు...అభినందనలకు...
@శ్రీ
చాలా బాగుంది శ్రీ గారు :)
ReplyDeleteమొదట నా బ్లాగ్ కి స్వాగతం...
Deleteమీకు నచ్చినందుకు
ధన్యవాదాలు కావ్య గారూ!
@శ్రీ
చాల బావుందండి శ్రీ గారు
ReplyDelete