నీ కాలి మువ్వల సవ్వడి చాలు...
నా మనసు సరిగమలు పలికేందుకు...
నీ కనుచూపుల దివ్వెలు చాలు
నా మది వాకిలిని వెలుగుతో నింపేందుకు...
నీ చిరునవ్వుల విరిజల్లులు చాలు...
చిరుకవితల మాలలు అల్లేందుకు...
నీ పసందైన పలకరింపులు చాలు...
ప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు....
నీ తేనెలూరే మాటలు చాలు...
నీ కోసం తేటగీతులు వ్రాసేందుకు...
నీ గాజుల గలగలల మ్రోత చాలు...
నీకై గానలహరి పాడేందుకు...
నీవు ప్రేమించే ప్రేమ చాలు...
ఆ ప్రేమను నేను ప్రేమించేందుకు...
'నీ ప్రేమను నేనే' అనే నీ మాట ఒక్కటి చాలు...
'నా పంచప్రాణాలకు శ్వాసవు నీవే' అనేందుకు... @శ్రీ
మీ కవిత ఒక్కటి చాలు
ReplyDeleteఅందమైన కవితా లోకంలో విహరించేందుకు
అందమైన చిత్రం మనసు రంజింప చేసే కవిత :-)
ఇలాంటి ప్రశంస ఒక్కటి చాలు...
Deleteఇంకా ఇలాంటివి వ్రాసేందుకు...:-)
ధన్యవాదాలు వీణ గారూ!
@శ్రీ
'కాలి మువ్వల సవ్వడి చాలు'- నన్న
ReplyDeleteకవితలో ప్రేమ పాళుల చవులు పెరిగె ,
ప్రేమ చక్కెర కాస్తంత పెరిగె నేని
'బ్రతుకు కాఫీ 'రుచించునా ? పరమ మిత్ర !
:-)...:-)...
Deleteఅలాగంటారా?..ప్రేమకి కొలతలు పరిమాణాలు ఉండవని
నేను అనుకుంటూ ఉంటాను రాజారావు గారూ!
ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు....
@శ్రీ
ఇంతందంగా మీరు చాలు చాలన్న ప్రేమను పంచకమానదు ఆ జవరాలు:-)
ReplyDeleteమీరన్నట్లుగానే అయితే...
Deleteఅంతకన్నా కావాల్సింది ఇంకోటి ఉంటుందంటారా?...:-)
మీ చక్కని స్పందనకు ధన్యవాదాలు పద్మగారూ!
బ్యూటిఫుల్ శ్రీ గారూ...
ReplyDeleteమదిలో మెదిలే ఆ సున్నిత భావనలు చాలు...
ప్రేమించే హృదయాన ప్రేమ చెలిని చేరేందుకు...
అవును చిన్ని ఆశ గారూ!
Deleteమీరన్నది నిజమే...
నా కవితాభావం మీరు మెచ్చినందుకు
చాలా ధన్యవాదాలు...
@శ్రీ
very nice!!
ReplyDeleteధన్యవాదాలు వనజ గారూ!
Deleteమీ చక్కని ప్రశంసకు...
@శ్రీ
శ్రీగారూ, ప్రతి పలుకూ ప్రేమగీతమై పలుకుతుంది.
ReplyDelete"నీ తేనెలూరు మాటలు చాలు తేటగీతి రాయటానికి" అన్నారు, నిజమే కవి హృదయం మాటలనే పాటలుగా పలుకుతుంది.
చక్కటి భావుకత మీ కవితల్లో పలికిస్తారు, మీరు ఇంకా అందంగా రాయగలరు..రాస్తారు కూడా.
ధన్యవాదాలు మెరాజ్ గారూ!
Deleteనా భావాలు నచ్చినందుకు...
మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు...
@శ్రీ
Bagundi Sree garu :)
ReplyDeleteనాకు మాత్రం బాగాలేదు హర్షా!
Deleteఇలా కనపడకుండా మాయమైపోతే
ఎలా చెప్పు?...:-)
ధన్యవాదాలు నా కవితని మెచ్చినందుకు...:-)
@శ్రీ
Really expressive:)
ReplyDeletethank you yohanth for your nice compliment...:)
Delete@sri
అందమైన పదాల అల్లిక ఈ కవిత.
ReplyDeleteధన్యవాదాలు సృజన గారూ!
Deleteభావాల అల్లిక మీరు మెచ్చినందుకు...
@శ్రీ
"శ్రీ" గారూ..
ReplyDelete"నా పంచప్రాణాలే నీవనీ పంచేసుకుంటా నీతో ప్రేమని"
అంటూ మీ కవిత,పాట చాలా బాగున్నాయండీ..
రాజి గారూ!
Deleteమీ ఆపాతమధురాలు చాలా రోజులయింది చూసి...:-)
ధన్యవాదాలు మీ ప్రశంసకు...కవిత, ఎంచుకున్న పాట నచ్చినందుకు...
@శ్రీ
నీ పసందైన పలకరింపులు చాలు...
ReplyDeleteప్రణయ ప్రబంధాలు వ్రాసేందుకు....
ప్రేమింపబడితే ప్రపంచాన్ని జయించినంత సంబరంతో అంబరాన్ని చుంబించమా!ఇక కవి కలం మాటల తోరణాలు ఆకాశమంతా కట్టదా!అందమైన భావుకత్వం.
ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
ReplyDeleteమీ చక్కని ప్రశంసకు...
మీరు వ్రాసిన రెండు లైన్లు కూడా కవితకి చేర్చేసుకోవచ్చు...:-)
ఆ విజయానికి సాటి అయినది ఇంకో విజయం ఉంటుందా మరి???...:-)
@శ్రీ