నీలి అంబరం
అంబరాన జాబిలి
జాబిలితో వెన్నెల
వెన్నెలలో నీవు
నీతో నేను...
నేను చూసే చూపులు
చూపులలో ఆరాధనలు
ఆరాధనలో ఆత్మీయతలు
ఆత్మీయతలో దగ్గరతనాలు
దగ్గరతనంలో పెరిగిన చనువులు
చనువుల్లో ముందడుగులు
అడుగులే సప్తపదులు
సప్తపదులలో జీవన సంగీతాలు
సంగీతంలో సరాగాలు...
సరాగాల్లో సరసాలు
సరసాలలో నీ సిగ్గులు...
సిగ్గులతో ఎరుపెక్కిన
బుగ్గలు
బుగ్గలని తాకే నా వేళ్ళు
వేళ్ళు తుంచే మొగ్గలు...
మొగ్గలతోనే మాలలు...
మాలలే మన శయ్యకి పరదాలు...
పరదాలలోనే శృంగారాలు
శృంగారంలో వణికే అధరాలు
అధరాల్లో తోణికే సుధలు...
సుధాల్ని గ్రోలే పెదవులు...
పెదవుల్లోని ఎరుపులు
ఎరుపుని దొంగిలించే కలువలు
కలువలను తాకే వెన్నెలతీగలు
వెన్నెల తీగలనల్లుకునే
నిండుచంద్రుడు
నిండు చంద్రునికి
ఆధారం.......నీలి అంబరం.... @శ్రీ
28/11/2012
పంక్తి లోని ప్రతి చివరి పదాన్ని ...తరువాతి పంక్తిలోని మొదటి పదంగా చేసి వ్రాసిన చిన్న ప్రయోగం....@శ్రీ
ReplyDeletebaagundi. very nice.
ReplyDeleteధన్యవాదాలు వీణ గారూ! మీకు నచ్చినందుకు....@శ్రీ
Deleteనీలి అంబరాన్నించి..నీలి అంబరానికి..
ReplyDeleteశ్రీ పదాల వెన్నెల వంతెన..
ఎక్కేసానోచ్..:)
వెన్నెల వంతెన...ఏమి పదం వాడారు ధాత్రి గారూ!...
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి....@శ్రీ
వావ్... మీ ప్రయోగం అదిరింది... :)
ReplyDeleteచాలా బాగుంది శ్రీ గారు! :)
ధన్యవాదాలు హర్షా!కవిత నచ్చినందుకు
Deleteప్రయోగం చేసేసాను సరదాగా...
నచ్చినందుకు మరో సారి ధన్యవాదాలు....@శ్రీ
ప్రయోగం బాగుంది. అభినందనలు ...కృష్ణ,విష్ణుప్రియ
ReplyDeleteధన్యవాదాలు కృష్ణ...అండ్ ప్రియ....మీకు నా ప్రయోగాత్మకమైన కవిత నచ్చినందుకు....@శ్రీ
Deleteచక్కటి పదప్రయోగం. చాలా బాగుందండి.
ReplyDeleteభారతి గారూ!...కవిత నచ్చి...మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు మీకు....@శ్రీ
Deleteకవిత, పాట రెండు చాలా బాగున్నాయి శ్రీ గారు. హమ్మయ్య! అపార్ధాలు తొలిగిపోతాయేమో కనుక్కొండి శ్రీ గారు. :)
ReplyDeleteవెన్నెల గారూ!ధన్యవాదాలు రెండూ మెచ్చినందుకు....అసలు అపార్ధాలు వచ్చినది ఎప్పుడండీ?...దుఖం కవిత చూసి అలా అంటున్నారా ఏమిటి?...:-)...@శ్రీ
Deleteపదాలతో చద్రునికే వెన్నెల తీగనల్లి సమర్పించారు శ్రీ గారూ, బాగుంది ప్రయోగం!
ReplyDeleteవెన్నెల తీగ...(ధాత్రి గారు వెన్నెల వంతెన)...ఏమి పదాలండీ...నా మరో కవితలో వాదేసుకుంటాను...మీ బ్లాగ్ అంట హాయిగా ఉంది మీ ప్రశంస...ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!...@ శ్రీ
Deleteశ్రీ గారూ..
ReplyDeleteనీలి అంబరాన నిండు చంద్రుడు,మీ కవిత,పాట బాగున్నాయండీ..
మళ్ళీ రాజి అయిపోయారు...:-)
Deleteధన్యవాదాలు రాజీ గారూ!
మీకు కవిత ఎంచుకున్న పాట నచ్చినందుకు...@శ్రీ
Sree gaaroo, padaalanu vennello munchi, kalam to kaagitam meeda volikinchaaru
ReplyDeleteమేరాజ్ గారూ!...వెన్నెలలో ముంచిన కలం....చక్కని మీ స్పందనకు ధన్యవాదాలు @ శ్రీ
Deleteచాలా బాగుంది శ్రీ గారు.
ReplyDeleteశ్రీ గారు
ReplyDeleteవీణ ఎవరండి
సారీ...మన్నించాలి పొరపాటున అలా టైపు అయింది...ధన్యవాదాలు వెన్నెల వీచికలకు...@శ్రీ
Deleteమన్నించదం ఎందుకులెండి. నా కపిత్వం మీకు వీణానాదం లా అనిపించిందేమో అనుకుని ఆనందపడ్డాను. కాదన్న మాట . :((
Delete(సరదాగా)
వెన్నెలలో వీణా నాదం...ఇదేదో బాగుంది ...మీ పేరు తెలియదు కాబట్టి జలతారువేన్నెల గారిని వెన్నెల గారూ!...అని సంబోధించి నట్లు...మిమ్మల్ని కూడా వెన్నెల చేసేస్తాను మరి...:-)...@శ్రీ
Deletemee prayogam adbhutam Sri garu
ReplyDeletepadaala allikalu...chivari padaanni modati padangaa chaalaabaagaa vaadaaru....greattttt job...thank you Sri garu manchi manchi kavitalu chadive avakaasam istunnanduku :)
ధన్యవాదాలు ప్రియగారూ!...
ReplyDeleteఈ ప్రక్రియని పద ముక్తం అంటారని విన్నాను తెలుగులో...
మీకు నచ్చిన్దుకు మీ అభిమానానికి మీకు నేనే చెప్పాలి ధన్యవాదాలు...:-)...@శ్రీ
బాగుంది..ప్రయోగం..!ఈ యోగం మొత్తానికి..చిత్తానికి..కలిగింది..ఆహ్లాదం..బహు మోదం.సదామోదం..!!
ReplyDeleteకవి చంద్రుడి వెన్నెల పోగు..మీ బ్లాగు..బాగు బాగు..బాగా రాకి'తేనే. రాకేందుడు..వెన్నెల తేనె..ఒలికించేది..!!
ధన్యవాదాలు రాకీ గారూ!...మీ లాంటి వారు మెచ్చితే మహదానందం కదూ!...నా బ్లాగ్ కి స్వాగతం....@శ్రీ
Delete