02/12/2012

సహ జీవనం




సహ జీవనం....
ఎంత అందమైన పేరు?
జీవితంలో 
నీకోసం నీ పెద్దలు వెదికి
లేదంటే నీకు తగిన
 సోల్ మేట్ లభించి 
వేద మంత్రాల మధ్య (ఎవరి మతానికి  వారు అన్వయించుకోవచ్చు...)
సప్తపది సాక్షిగా 
ఓ తరాన్ని సృష్టించేందుకు 
చేసేది సహజీవనం

ఒకరి మీద ఒకరికి నమ్మకం
భిన్నాభి ప్రాయాల్లో ఏకాభిప్రాయాలు...
ఒకరికొకరు కావాలనుకొని..
ఒకరిని విడచి మరొకరు 
బ్రతకలేమనుకొని...
ఆడంబర వివాహాలకి దూరంగా...
కుల మతాలకు అతీతంగా...
ఒకరిని కోసం  మరొకరు...
ఓ జీవితకాలం 
కలిసి జీవించడాన్ని కూడా 
సహజీవనం అనొచ్చేమో!....

ఆరు నెలలకి మగడిని మార్చి...
ఏడాదికి సహచరిని మార్చి...
సహజీవనం పేరుతొ చేసేది 
సహజీవనమా?
చట్టబద్ధమైన వ్యభిచారమా?

వయసు వేడిలో
యవ్వనపు జోరులో...
ఉడుకు రక్తానికి ఎదో కావాలనే తపనతో 
కొత్త రుచులకి అలవాటు పడుతూ...
పూటకో బట్ట మార్చినంత 
సులువుగా 
భాగస్వాములను మార్చేస్తూ
సహజీవనంలో కొత్తదన్నాన్ని 
వెతుక్కునే ప్రయత్నం 
చేస్తోంది నవతరం...

దానికి వత్తాసు పలుకుతోంది 
ఆధునిక పంథాను 
అనుసరిస్తున్నామనుకొనే 
ఆడ/మగ బుద్ధి జీవుల సమూహాలు...

పవిత్రమైన 
వైవాహిక వ్యవస్థకి జన్మనిచ్చిన చోటే...
ఒక పటిష్టమైన బంధం లేని 
సహ జీవనమని చెప్పే 
విషసంస్కృతి 
తన విషపు చుక్కలు 
స్వచ్చమైన సమాజంలో 
వెదజల్లుతోంది...

ఈ రోజు దాకా నీతో ఉన్న 
సహచరుడు 
రేపటి నుంచి 
నీ చెల్లితో సహజీవనం
చేస్తాననే మాట 
అశనీ పాతంలా 
నిన్ను తాకినపుడు...

నీతో మొహం మొత్తింది 
నీ తమ్ముడే నాకు సరిజోడీ 
అని నీ భాగస్వామి 
నీతో చెప్పినపుడు....

నాన్నా!
ఇదిగో నీ ఆరో కోడలు...
అంటూ నీ కొడుకు ..
అమ్మా!
ఇదిగో 
నీ  అల్లుళ్ళ సంఖ్య
తొమ్మిదికి చేరింది 
అంటూ నీ కూతురు...
అన్నపుడు 
తెలుస్తుంది 
'సహజీవనం' అనేది 
ఎంత భయంకరమైనదో?...

పిల్లలు పుడితే 
తండ్రి ఎవరో తెలియని పరిస్థితి...
అమ్మతో ఉండాలో 
అమ్మ ..'నాన్న' అని చెప్పిన 
నాన్నతో ఉండాలో తెలియని అనిశ్చితి...
ఫాదర్స్ నేమ్ అంటే...అందరివీ వ్రాయాలా ?
అంటూ అమాయకంగా 
అడిగే పిల్లల్ని ఒక్క సారి మనో చిత్రంలో 
ఊహించుకుంటేనే భయంకరంగా ఉండే 
సహజీవనం అందమైనదా?....

ఎప్పుడు తెగిపోతుందో?
ఎన్నాళ్ళుంటుందో?
తెలియని బంధం 
సహజీవనమనిపించు కుంటుందా?...

అందమైన కలగా కనిపించే 
దుస్వప్నాల జగత్తులోకి 
ప్రవేశం ఎందుకు?...
పూల బాటలా కనిపించే...
అగ్నికణాల... కత్తుల దారిలో 
అడుగు మోపే దుస్సాహసం ఎందుకు?... శ్రీ 











































20 comments:

  1. అద్భుతంగా వివరించారండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు అనురాధ గారూ!...మీ చక్కని స్పందనకు....
      ఒక్క సరి భవిష్యత్ చూపాలనే చిన్న ప్రయత్నం...@శ్రీ

      Delete
  2. jaragaboye vastavaanni kallaku kattinattu gaa chepparu nic epost andi

    ReplyDelete
    Replies
    1. అవును మంజు గారూ!...
      ఒక్కసారి భవిష్యత్ ఊహించుకుంటే...అలాగే కనిపించింది...@శ్రీ

      Delete
  3. "ఎప్పుడు తెగిపోతుందో?
    ఎన్నాళ్ళుంటుందో?
    తెలియని బంధం
    సహజీవనమనిపించుకుంటుందా?" మంచి ప్రశ్న "శ్రీ" గారూ..
    భరించలేని చేదు నిజాలను చక్కగా చెప్పారు.

    చట్టబద్దమైనంత మాత్రాన అది సమాజంలో ఆమోదయోగ్యమైపోదు కదండీ..
    మనసులేని మనుషులకే ఈ సహజీవనం అని నా అభిప్రాయం..


    ReplyDelete
    Replies
    1. అవును రాజీ గారూ!..
      ఒకరి మీద ఒకరికి నమ్మకం
      భిన్నాభి ప్రాయాల్లో ఏకాభిప్రాయాలు...
      ఒకరికొకరు కావాలనుకొని..
      ఒకరిని విడచి మరొకరు
      బ్రతకలేమనుకొని...
      ఆడంబర వివాహాలకి దూరంగా...
      కుల మతాలకు అతీతంగా...
      ఒకరిని కోసం మరొకరు...
      ఓ జీవితకాలం
      కలిసి జీవించడాన్ని కూడా
      సహజీవనం అనొచ్చేమో!.......అనొచ్చేమో అనే అన్నానందుకే...మీ అభిప్రాయం సరైనదే...ధన్యవాదాలు చక్కని స్పందనకు...@శ్రీ

      Delete



  4. శ్రీ గారు, బాగుందండి. పెళ్లి లేకుండా కూడా సహజీవనం చేసే వారు,బంధాలకు బానిసలవ్వకూడదని అనుకుంటూ, తమ ప్రేమ స్వచ్ఛమైనదిగా , తమ స్వేచ్ఛని వారు కోల్పోమని తలుస్తారు. ఆలాంటి వారిలో కొద్ది మంది హాయిగా జీవించేవారు కూడా ఉన్నారు.ఎక్కువ సాతం అవకాశవాదులే. నాకెందుకో maariage brings discipline into lifes అని కూడా అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వెన్నెల గారూ!maariage brings discipline into lifes ..అవును నిజమే ...ఒక సెక్యూరిటీని కూడా ఇస్తుంది...మితిమీరిన స్వేచ్చ కూడా విపరీత పరిణామాలకే దారి తీస్తుంది....ధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...@శ్రీ

      Delete
  5. చరిత్ర తిరిగివస్తుందంటారిదేనేమో! ఇది దిగజారడమో ఎగబాకడమో.

    ReplyDelete
    Replies
    1. అమ్మయ్య మళ్ళీ మీ వ్యాఖ్య మెరిసింది ఇన్నాళ్ళకి...నా బ్లాగ్ దోషం లెండి...అవును కొన్ని పునరావ్రుతాలైతే బాగుంటాయి ...కొన్ని ఇబ్బంది పెడతాయి...మీరు అన్నది నిజం...అక్షరాలా దిగాజారడమే....ధన్యవాదాలు...శర్మ గారూ!@శ్రీ

      Delete
  6. శ్రీ గారూ,
    ఆలోచింపజేసే కవిత. ఏ వ్యవస్థా గొప్పదని చెప్పలేము. ఓ తరాన్ని సృష్టించేందుకని పెద్దలు కలిపేది సహజీవనమైతే...ఒకరికొకరు కావాలనుకుని ఇద్దరు కలిసి సాగించేదీ అదే.

    తనువూ తనువూ కలిపితే పుట్టేది బంధం
    మన వివాహ వ్యవస్థ చట్టబద్ధంగా చేసేదిదే
    ఈ వ్యవస్థలో మనసులు కలిస్తే సహజీవనమే
    లేదంటే వ్యవస్థకి భయపడి చేసే సహగమనమే

    మనసూ మనసూ కలిస్తే అయ్యేది అనుబంధం
    ఏ బద్ధం అయినా దీని కోరికా సహజీవనమే
    ఇందులో వ్యవస్థ చెప్పినట్టు విని చేసేదేమీ లేదు
    భయపడి చేసే సతీ సహగమనాలసలే లేవు

    ఎందులోనైనా మనసూ మనసూ కలవకుంటే అది నరకమే.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా విశ్లేషించారు చిన్ని ఆశ గారూ!...
      మనసులు కలవకుంటే నరకమే...
      కానీ కేవలం తనువుల కలయిక కోసమే సహజీవనమైతే...అది బాధాకరం...
      ధన్యవాదాలు మీ స్పందనకు....@శ్రీ

      Delete
  7. మాంగల్య బంధమే మాడి మసౌతుంటే
    సహజీవన సంబరమెన్నాళ్ళో చూద్దాం:-)

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే...
      మాంగల్య బంధాలు శాశ్వతంగా నిలవాలని...
      అసహజమైన సహజీవన బంధాలు తుడిచిపెట్టుకు పోవాలనీ ఆశిద్దాం...@శ్రీ

      Delete
  8. చాలా బాగుంది శ్రీ గారు పోస్ట్......జరుగుతున్న దాన్ని, జరగబోయే దాన్ని చక్కగా వివరించారు.......మీ పోస్ట్ చదువుతుంటే...మన future generation గురించే బాధగా ఉంది

    ReplyDelete
    Replies
    1. అవును కావ్యగారూ!...భవిష్యత్ అంధకారం గానే కనిపిస్తుంది...ఇలాంటివి తలుచుకుంటే...ధన్యవాదాలు మీ ప్రశంసకి...@శ్రీ

      Delete
  9. బాధ్యతలేని బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు..
    బాగుంది శ్రీ గారు.

    ReplyDelete
    Replies
    1. ధాత్రి గారూ!...ఆ బాధ్యతల వలన బంధాలు బలహీనం కావు...
      అవి లేని బంధాలు చాలా బలహీనంగానె ఉంటాయి...నిజమేనండి @శ్రీ

      Delete
  10. FANTASTIC...ADBHUTAM...
    NIJAM CHEPPALANTE CHEDU NIJAALU BAITA PETTAARU....CHAALAA BAAVUNDI...SRI GARU

    ReplyDelete
  11. ధన్యవాదాలు ప్రియ గారూ!
    ఎప్పటిలాగే ఫెంటాస్టిక్ అంటూ ప్రశంసించారు...
    ఇలాంటి విషాన్ని సమాజం దూరంగా ఉంచాలి మరి...@శ్రీ

    ReplyDelete