నిన్ను చూస్తూ..
నీ మాటలు వింటూ...
నీ కనురెప్పల చప్పుళ్ళు కంటూ...
వెల కట్టలేని లేని నీ చిరునవ్వులని
నా ఆరాధనల్తో కొంటూ...
బుగ్గల్లోని సిగ్గులు గమనిస్తూ...
సొట్టల్లో అందాలకి మైమరుస్తూ
మొన్న చెప్పాల్సింది నిన్న చెప్పక..
నిన్న అనుకున్నది ఈ రోజు చెప్పలేక...
సాహసం చేయలేక...
మనసు ముడి విప్పలేక...
మనసుచేసే గొడవ ఆపలేక
మనసు మాట మెదడుకి చేరనివ్వక...
స్నేహం చెడుతుందేమోనని ఆలోచించక...
నీకళ్ళనుంచి కురిసేవి నిప్పులా?
వెన్నెల చినుకులా? అని భయపడక...
అసంకల్పితంగానే సంకల్పిస్తూ...
గుండెలోని ప్రేమాణువును పేల్చేస్తూ...
ఆ విస్ఫోటనంలో నేను జ్వలిస్తూ...
ఆ సెగలలో నేను తపిస్తూ...
ఆ ధూమంలో నేను ఉక్కిరిబిక్కిరౌతూ...
మనసులో అనాలనుకున్నది జపిస్తూ...
పాదరసంలా జారిపోతున్న కాలాన్ని
ఒక్క క్షణం ఆపేస్తూ...
చెప్పేసా....
మనసులోని మాట...
తేటి నెలవుల మూట...
దిక్కులు పిక్కటిల్లేలా...
దిశలు ప్రతిధ్వనించేలా..
వినే జనం ఉలిక్కిపడేలా...
నేను... నిన్ను.....
కాదు... నేను నిన్నే...
కాదు కాదు...
నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని.....@శ్రీ
అద్భుతమైన భావంతో, అలరారే పదజాలంతో, సోయగాలతో, సొంపులతో మీ కవిత ఆణిముత్యమై నిలుస్తోంది. శుభం.
ReplyDeleteధన్యవాదాలు రాజారావు గారూ!
Deleteమీ చక్కటి ప్రశంస ఎప్పుడూ మరెన్నో వ్రాసేందుకు...
ప్రోత్సాహాన్నిస్తుంది....@శ్రీ
మంచి భావోద్వేగంతో చాలా చాలా బాగుంది బేటా మీ కవిత
Deleteమీరు చాలా అందంగా చెప్పారు శ్రీగారు..ఇంతకీ ఆమెకు వినిపించిందో లేదో చెప్పలేదు మరి...:)
ReplyDelete"వెల కట్టలేని లేని నీ చిరునవ్వులని
నా ఆరాధనల్తో కొంటూ"
చిరునవ్వును దేనితో కొనొచ్చో చెప్పెసారుగా..:)
Deleteధన్యవాదాలు ధాత్రి గారూ!...మీ చక్కని స్పందనకు...
అయ్యో విని పించక పోవడమా?...
బదులుగా బోలెడు సార్లు రిప్లై కూడాఇచ్చేస్తేనూ!....:-)
అవును మరి... చిరునవ్వు వేల ఎంత...అంటూ ఓ పాట కూడా ఉంది కదూ!..@శ్రీ
nice andi sri gaaru
ReplyDeleteధన్యవాదాలు ప్రిన్స్...
Deleteఈ మధ్య ఓ గ్రూప్ మీట్ ( ఫేస్ బుక్ లో)
గురించి బిజీగా ఉంది బ్లాగ్ లో స్పందనలకి...
అందరి పోస్ట్స్ చూడటం వీలు పడలేదు...
అందరివీ రేపు చూడాలి...@శ్రీ
చదువుతూ చదువుతూ చెప్తారా లేదా అని తలస్తూ చివరకు వచ్చేసరికి "అమ్మయ్య చెప్పేశారు" అనుకున్నాను. బావుందండీ బాగా వ్రాశారు.
ReplyDeleteఎక్కడండీ...మీరు సస్పెన్స్ కథ చెప్పినట్లు నేను చెప్పలేనండోయ్...:-)
Deleteధన్యవాదాలు మీ చక్కని స్పందనకు...ప్రశంసకు...@శ్రీ
ReplyDeleteబాగుందండి శ్రీ గారు,మీ ప్రేమ ను తెలియపరిచేముందు, మీరు అలోచనల తుఫాను మీద రాసిన కవిత.
o స్నేహంలో ఉన్న యువ జంటని ఎదురుగా ఉంచుకొని...ఆ అబ్బాయి ఫీల్ వ్రాసాను...మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారూ!...@శ్రీ
DeleteFANTASTICCCCCCC...
ReplyDeleteచాలా చాలా బావుందండీ శ్రీగారు
మీ ప్రేమను అద్భుతంగా లెలియజేసారు..
మీ ప్రేమ కవితలకు లొంగని భామ ఉంటుందా???
ఎవరో ఆ జవరాలు మిమ్మల్ని,కవిత చదివే మమ్మల్ని
ఇబ్బంది పెడతావుంది...బదులు చెప్పక ;)
ప్రియ గారూ!
Deleteధన్యవాదాలు మీ స్పందనకు...
అందరూ అలా అనేస్తే ఎలా చెప్పండి...
నా రహస్యాలేవో నన్ను దాచుకోనివ్వండి...:-)
చూద్దాం మరి ఎన్నాళ్ళు దోబూచులాడుతుందో...:-)...@శ్రీ
శ్రీ నివాసుని స్తుతి కి తలవంచని సిరి ఉందా? మీ ప్రియవాక్యాల పొగడ్తల అగడ్తలో పడని పడతుంటుందా!!!సర్ అక్షరాలతో కూడా ఆటాడేసారు ఇక అతివ మనసెంత మీకు స్వాధీన లతికే...
ReplyDeleteఅద్భుతంగా ఉంది సర్ మీ ప్రేమ మంత్రం...
అవును మరి
Deleteస్తుతిని ఇష్టపడని ఏభామ ఉంటుంది చెప్పండి?
పొగడ్తల అగడ్తలు...కమ్మని మాటల కందకాలు...అంటారా?...
స్తుతి శ్రీ చేసినా...అగడ్తలో పడేది శ్రీనే...
ధన్యవాదాలు చక్కని ప్రశంసాపూర్వకమైన స్పందనకు...
నా బ్లాగ్ కి స్వాగతం పద్మ గారూ!...@శ్రీ
బావుందండీ బాగా వ్రాశారు.
ReplyDeleteధన్యవాదాలు భావనా!...
Deleteమీ ఈకు నా భావం నచ్చినందుకు...@శ్రీ
నిన్ను మాత్రమే...అన్న ఆభావం ఇంకంత గట్టిగా చెప్పాక ఆ మనసుకి చేరకపోతుందా?
ReplyDeleteనిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానని... అద్భుతమైన భావన మూడు పదాల్లో పేర్చారు. కవితలోనూ అల్లనే కూర్చారు.
అభినందనలు!
ధన్యవాదాలు చిన్ని ఆశ గారికి...
Deleteనిన్ను మాత్రమె అన్న ఆలోచన...
ఆఖరున వ్రాస్తుంటే వచ్చింది...
చాలా బాగుందనిపించింది...
అదే అందరికీ నచ్చింది కూడా...
మీ విశ్లేషణ ఎప్పుడూ బాగుంటుంది...@శ్రీ
Sree garu , kavita baagundi. eppatilaa andamian padaalato,
ReplyDeleteధన్యవాదాలు మేరాజ్ గారూ!...మీకు కవిత నచ్చినందుకు...నా భావాలు మీరు మెచ్చినందుకు...@శ్రీ
Delete"శ్రీ" గారూ మైమరిచిపోతూ, భయపడుతూ, ఆలోచిస్తూ, ఉక్కిరిబిక్కిరవుతూ
ReplyDeleteమొత్తానికి కాస్తందుకో,ధరఖాస్తందుకో అంటూ మీ ప్రేమను చక్కగా చెప్పేశారండీ..
చాలా బాగుంది..
రాజి గారూ!
ReplyDeleteధన్యవాదాలు మీ ప్రశంసకు...
ఈ పాట ఆటైములో తోచలేదు సుమండీ...
లేకుంటే ఈ కవితకి ఆ పాటే పెట్టేవాడిని...
@శ్రీ