ప్రేమగా నా కళ్ళలోకి
చూసే లోతైన చూపులు
చిరుకోపంతో చురుక్కుమంటూ
గుచ్చే చూపులు
మదన శరాలను సానపట్టి
సంధించే చూపులు
తలుపు వెనుకనుంచి
ఓరగా చూసే చూపులు
నా గుండెని తాకే
వెన్నెల తూపుల చూపులు
సిగ్గుతో నా వంక చూస్తూ
నా మనసు దోచే చూపులు
సాయం సంధ్యలో నాకోసం
వేచి చూసే చూపులు
ఆలస్యమైతే చూసే
వాడి వేడి చూపులు
నన్ను గారంగా
పూలతీగలా అల్లుకునే చూపులు
...
నేను అలిగితే
నను ప్రసన్నం చేసుకునే చూపులు
నను అలరించే చూపులు
నను కవ్వించే చూపులు
నన్నారాధించే
అర్థనిమిలీత నేత్రాల చూపులు
నా మది వాకిలిలో
రంగవల్లులేసిన చూపులు.
ప్రియ సమాగమంలో
సిగ్గుతో స్వీట్ నథింగ్స్
చెప్పే చూపులు
నిశ్శబ్ద సంగీతమాలపించే
చూపులు
మది వేణువుని పలికించే చూపులు
నా హృదయం భేదించిన
చూపులు.
మన ప్రేమకి మూలమైన
చూపులు.
మన బంధాన్ని శాశ్వతం
చేసిన చూపులు. @శ్రీ
యాతావాతా......చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అంటున్నారన్నమాట! :-)
ReplyDeleteపద్మ గారూ!...అన్ని చూపుల పాటల్లో ఇదొక్కటే గుర్తొచ్చింది మీకు...:-)...ధన్యవాదాలు...@శ్రీ
Deleteగుచ్చి గుచ్చి చూసి వెళ్ళిపోతే పరవాలేదు మళ్ళీ వెనక్కి తిరిగి అందంగా నవ్వితేనే మొదలవుతుంది అసలు కధ అంతా, చాలా బాగుంది
ReplyDeleteలక్ష్మి గారూ!...
Deleteఅలాగంటారా?...
:-)
ధన్యవాదాలు...@శ్రీ
ఇన్నిరకాల చూపులుంటాయన్నమాట..:)
ReplyDeleteToo Good.
కదా మరి....థాంక్ యు...ధాత్రి గారూ!...@శ్రీ...
Deleteనీ తొలి చూపులోనే అంటూ ఇన్ని వైవిధ్యమైన చూపులను చెప్పేశారు..
ReplyDeleteకవిత,కవితకు తగిన పాట రెండూ చాలా బాగున్నాయి. శ్రీ గారూ..
ఈ పాట ఇదే మొదటిసారి వినటం..
ధన్యవాదాలు రాజి గారూ!
Deleteమీ ప్రశంసకి....
ఈ పాట చాలా ఇష్టం....
:)
ReplyDeletenice song nice picture and very very nice poetry sri garu
ReplyDeletewow beautiful
ReplyDeleteammo naa chupulaku intaa ardham undaa
ReplyDeletechuupullo chala rakalunnayandoy.. chala baga chepparu
ReplyDeleteఓర చూపొక్కటి చాలు హృదయాన్ని బంధించటానికి.
ReplyDeleteఅయినా అన్ని చూపుల శాశ్వత బంధం మరింత బలమేమో...
చక్కగా చూపారు చూపుల కవితలో