పుట్టినపుడు
'అయ్యో ...ఆడపిల్లా!'
అనే లోకం నిట్టూర్పులు మోసావు...
వైవాహిక జీవితంలో
మెట్టినింటి
బరువు బాధ్యతలు మోసావు...
బిడ్డను ప్రసవించడానికి
గర్భంలో నవమాసాలు
నీ చిన్నారిని మోసావు...
పిల్లల వెంట వారి
పుస్తకాల సంచులు
మోసావు...
ఇల్లు గడవక
బైట (పని) బరువులు
మోస్తున్నావు...
ఆఖరికి "నీ బరువు"
మరో నలుగురు మోసేదాకా...
జీవితాంతం
జీవితాంతం
ఏదో ఒకటి మోస్తూనే ఉంటావు...
ఆడవారి జీవితాన్ని ప్రతిబింబించే ఓ మంచి కవిత
ReplyDeleteఆఖరికి "నీ బరువు"
మరో నలుగురు మోసేదాకా...
జీవితాంతం
ఏదో ఒకటి మోస్తూనే ఉంటావు...
చాలా బాగా రాసారు
ధన్యవాదాలు రమేష్ గారూ!...మీకు నచ్చినందుకు...@శ్రీ
Deleteఆడవారి బ్రతుకు బరువును చక్కగా అక్షరీకరించారు శ్రీ గారు.
ReplyDeleteధన్యవాదాలు భారతి గారూ! నా ప్రయత్నం సఫలమైంది .....@శ్రీ
Deleteమోయక తప్పక బరువుని మోస్తున్న స్త్రీ మూర్తి బరువుని కవితాక్షరాలలో బంధించి మది బరువుని పెంచారు..చాలా బావుంది శ్రీ గారు.
ReplyDeleteధన్యవాదాలు వనజ గారూ!...మీ ప్రశంసకి....
Delete@శ్రీ..
Good
ReplyDeleteధన్యవాదాలు శర్మ గారూ!...@శ్రీ...
Deleteఏంటో!!! మేం మోసే భారంపై ఇంత భావాయుక్తభావం?
ReplyDeleteధన్యవాదాలు పద్మ గారూ!...@శ్రీ
Deleteబావుందండీ శ్రీ గారూ!
ReplyDeleteధన్యవాదాలు చిన్ని ఆశ గారూ!...@శ్రీ
Deleteenta baagaa chepparu sri chaalaa baavundi ante chaaladu...
ReplyDeleteధన్యవాదాలు మంజు గారూ!..బోలెడు ధన్యవాదాలు...@శ్రీ..
Deleteబావుందండీ
ReplyDeleteధన్యవాదాలు భావన గారూ!...@శ్రీ.
DeleteTouching..
ReplyDeleteధన్యవాదాలు....ధాత్రి గారూ!...@శ్రీ
Deleteఆఖరికి "నీ బరువు"
ReplyDeleteమరో నలుగురు మోసేదాకా...
జీవితాంతం
ఏదో ఒకటి మోస్తూనే ఉంటావు...
చాలా బాగా రాసారు