నీ వలపుచినుకు నామదిలో కురిసి మారేది
'మౌక్తికం'గానే.
నా కెమ్మోవి మధురసుధాతరంగాలు చేరేవి
నీ 'పగడపు' దీవినే...
అన్యులకి మాత్రం అభేద్యమైన 'వజ్రమే'!
నీకు మాత్రం సులభసాధ్యమైన నా మనసు.
మెరిసే 'కెంపు'లే
తాంబూలపు తమ్మి తాకిన చక్కర మోవి సొంపులు.
రాళ్ళలో వెదుకుతారు 'రత్నం'కోసం
నా అన్వేషణ...వన్నెల కన్నెలలోని కొంగొత్త చిన్నెలున్న నీకోసమే
నా ప్రేమ సతతహరితమే
నీకర్పించినది నా మానస'మరకతమే'.
నా రూపాన్ని వేయి ఇంద్రచాపాలు చేసేది
నీ కనుపాపల ఇంద్ర'నీలమే'.
నీ మేనికాంతితో పోటీ పడుతూ...
ఎప్పుడూ ఓడిపోయేది _కనక'పుష్యరాగమే'
'గోమేధిక' దర్పణంలోనే కనిపించింది
భవిత నీతోనేనని.... నీవెప్పుడూ నాలోనేనని... ...@శ్రీ
'మౌక్తికం'గానే.
నా కెమ్మోవి మధురసుధాతరంగాలు చేరేవి
నీ 'పగడపు' దీవినే...
అన్యులకి మాత్రం అభేద్యమైన 'వజ్రమే'!
నీకు మాత్రం సులభసాధ్యమైన నా మనసు.
మెరిసే 'కెంపు'లే
తాంబూలపు తమ్మి తాకిన చక్కర మోవి సొంపులు.
రాళ్ళలో వెదుకుతారు 'రత్నం'కోసం
నా అన్వేషణ...వన్నెల కన్నెలలోని కొంగొత్త చిన్నెలున్న నీకోసమే
నా ప్రేమ సతతహరితమే
నీకర్పించినది నా మానస'మరకతమే'.
నా రూపాన్ని వేయి ఇంద్రచాపాలు చేసేది
నీ కనుపాపల ఇంద్ర'నీలమే'.
నీ మేనికాంతితో పోటీ పడుతూ...
ఎప్పుడూ ఓడిపోయేది _కనక'పుష్యరాగమే'
'గోమేధిక' దర్పణంలోనే కనిపించింది
భవిత నీతోనేనని.... నీవెప్పుడూ నాలోనేనని... ...@శ్రీ
Superb Tammu......
ReplyDeleteచాలా బాగుంది. నవరత్నాలను కవితల్లో యిరికించారు.
ReplyDeletewww.telugutapa.com
చాలా బాగుంది. నవరత్నాలను కవితల్లో యిరికించారు.
ReplyDeletewww.telugutapa.com
ఎన్నెన్ని భావాలు...ఎంతో పొందికగా రాసారండి.....
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteప్రియురాలిని రత్నాలతో పోల్చి రాసిన కవిత అమోఘం ...ఎప్పుడూ మీ కవితలు సూపరే నండి శ్రీ గారు
ReplyDeleteనవరత్నోప్రేరిత ప్రియహాసిని మీ చెలి....చాలాబాగుందండి.
ReplyDelete