21/07/2014

॥ నాన్న॥












మలిబడికి తొలిమెట్టు 'నాన్న' 
బైటి ప్రపంచాన్ని చూపే దివ్య దృష్టి 'నాన్న' 



కొడుకు బైక్ కోసం
తన సైకిల్ జీవితాన్ని పొడిగిస్తాడు 'నాన్న' 
కూతురు చలువటద్దాల కోసం
పగిలిన అద్దాలలోనుంచే ఫైళ్ళు చూస్తాడు 'నాన్న' 



మేఘంలా గర్జిస్తూ
కరుకుగా కనబడతాడు 'నాన్న'
తొలకరిజల్లు లాంటి ప్రేమను

మదిలో దాచుకుంటాడు 'నాన్న' 


పండుగలకి పుట్టినరోజులకి
కొత్తబట్టలున్నాయంటాడు 'నాన్న'
పిల్లల సంబరాల అంబరంతో
మాసికల చొక్కాను కప్పేసుకుంటాడు 'నాన్న' 



తాను ముళ్ళబాటలో నడిచినా
పిల్లలకి పూలబాటౌతాడు 'నాన్న'
అహర్నిశలూ కుటుంబశ్రేయస్సుకే
తన జీవితాన్ని అర్పిస్తాడు 'నాన్న' 



నాన్నంటే నిస్వార్ధానికి
మారుపేరని నమ్ముతాను
నాన్నంటే 'విశ్వరూపమని'
విశ్వానికి ఎలుగెత్తి చాటుతాను. ...@శ్రీ

1 comment:

  1. "నాన్న" అంటే నాన్నే. నాన్నకు సరితూగలేరేవ్వరూ.
    హత్తుకునేలా చెప్పారు. వందనాలు.

    ReplyDelete