రాత్రులలోనే తీయనికలలను కంటవి కన్నులు
ప్రేయసి కళలను రెప్పలలోనే దాస్తవి కన్నులు
అందాలెన్నో కనబడుతుంటే ఊరకనుండవు
చూపుల దొంగల సాయంతోనే దోస్తవి కన్నులు
కోరిన నెచ్చెలి రూపును చూస్తే కాంతుల మునుగును
వెన్నెలవెలుగుల లేఖలనెన్నో రాస్తవి కన్నులు
చెలి అందాలను పొగడాలంటే మాటలు ఎందుకు ?
సైగలతోనే వర్ణనలెన్నో చేస్తవి కన్నులు
ప్రేమే దేవిగ ఎదురుగ నిలిచిన పూజలు చేయును
ఆరాధనతో హారతులెన్నో ఇస్తవి కన్నులు
మెత్తని చూపుల తూపులనెన్నో సంధిస్తాయి
గుండెను గుచ్చే బాధలముళ్ళను తీస్తవి కన్నులు
సరసం చిందే సమయంలోనే ఓ నెలరాజ
రెప్పలనల్లిన రెప్పల ఊసులు వింటవి కన్నులు
No comments:
Post a Comment