జనాబ్ నిదా ఫాజలీ జీ రచించిన ఒక అద్భుతమైన గజల్ ని అనువదించే
ప్రయత్నం చేసాను. అనువాదంలో స్వేచ్ఛ తీసుకోకుంటే భావాలు
ఎప్పుడూ మాచ్ అవ్వవు. మూలానికి అతి దగ్గరగా నా అనువాదం
ఉండేలా చూసుకున్నాను
|| ఎప్పుడూ సరికాదు - తెలుగు గజల్ || అనువదించిన గజల్
వదిలేటి పొగలతో చంద్రుడిని కమ్మడం ఎప్పుడూ సరికాదు
పసివారి స్వప్నాల్ని నిలువునా దోచడం ఎప్పుడూ సరికాదు
ప్రాణాలు వదిలాక ప్రేమికుల సంగమం దాదాపు దుర్లభం
ఆత్మలెగిరే దార్లు ఒకటవక పోవడం ఎప్పుడూ సరికాదు
భూమిపై జీవించి ఉండేది తక్కువని ఎవరికీ తెలియదు
పదునాల్గు వర్షాల్ని బాల్యాన గడపడం ఎప్పుడూ సరికాదు
నువు నమ్మినటువంటి ధర్మాన్ని పాటించి జీవనం సాగించు
గోప్పోళ్ళ సూక్తులను వల్లిస్తు ఉండడం ఎప్పుడూ సరికాదు
ఏకాంత వేళలో నీలోని నీవుతో అపుడపుడు మాట్లాడు
సభలున్న ప్రతిచోట హాజరౌతుండడం ఎప్పుడూ సరికాదు
తన్హాయి కనబడితె ఎగిరొచ్చి వాలిపోతుంటాయి "నెలరాజ"
నిదురించు తలపుల్ని మేల్కొల్పుతుండడం ఎప్పుడూ సరికాదు #శ్రీ
***
మూలం :
जनाब निदा फाजली की गजलें सभी को पसंद है
उन गजलों में एक मोतीको आपके सामने लाया
और तेलुगु में अनुवाद भी प्रस्तुत कर रहा हूँ |
बच्चों के सपनों को चुराना अच्छी बात नहीं
जिस्मोंके बाहर भी मिलना जुलना नामुमकिन है
रस्ते में रस्ता कतराना अच्छी बात नहीं
उम्र ही कितनी मिलती है दुनिया में जीने को
इस पर चौदह साल गवाना अच्छी बात नहीं
तेरा अपना जिया हुआ ही तेरा अपना है
औरों की बाते दोहराना अच्छी बात नहीं
कभी अकेले में खुद से भी बाते करके देख
हर महफ़िल में आना - जाना अच्छी बात नहीं
तन्हाई में भूली बिसरी यादें बसती है
सोतोंको नींद से जगाना अच्छी बात नहीं
No comments:
Post a Comment