ఒక పుష్పం తావి
మరో పుష్పానికి లేదు...
ఒక వస్తువు రంగు
మరొక వస్తువుకి లేదు...
ఒక మనిషి రూపు
మరో మనిషికి లేదు ...
అయినా భిన్నవర్ణాల మేళవింపుతో ప్రపంచం
కంటికి ఇంపుగా కనిపిస్తుంది.
నింగి,నేల ఒకే వర్ణంలో ఉంటే
ఒకదానికొకటి ప్రతిబింబాలేమో
అని భ్రమిస్తామేమో!
అని భ్రమిస్తామేమో!
అందరి మనసును ఆహ్లాదపరిచే
సప్తవర్ణాల ఇంద్ర ధనసు ఏర్పడేది
శ్వేత వర్ణం, వర్షపు బిందువులో వక్రీభవిస్తేనే కదా!
సప్తవర్ణాల ఇంద్ర ధనసు ఏర్పడేది
శ్వేత వర్ణం, వర్షపు బిందువులో వక్రీభవిస్తేనే కదా!
సప్త స్వరాలు వేరైనా
అవి కలిస్తేనే కదా సుమధుర సంగీతం!
ప్రకృతిలో స్త్రీ ,పురుషులు వేరైనా,
వారి భావాలు, ఇష్టాలు వేరైనా,
వారి భావాలు, ఇష్టాలు వేరైనా,
వారిద్దరి మధురమైన కలయికలోనే కదా
మరో జీవి ప్రాణం పోసుకోనేది!
మరో జీవి ప్రాణం పోసుకోనేది!
పగలు...
కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగుతో ప్రకాశిస్తే,
కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగుతో ప్రకాశిస్తే,
రాత్రి...
అంధకార బంధురంలో మునిగిపోతుంది.
అంధకార బంధురంలో మునిగిపోతుంది.
అవి రెండూ కలిస్తేనే కదా ఒక దినం ఏర్పడేది!
జన్మ వెలుగైతే...
మృత్యువు చీకటి...
ఈ రెంటి మధ్యే కదా జీవితం!
ఈ రెంటి మధ్యే కదా జీవితం!
తెలుపు నుండి నలుపు వరకూ ఉండే జీవితంలో
అసంఖ్యాకమైన వర్ణాల్లో మునిగి తేలుతుంటాం.
పరస్పరం విరుద్ధమైన భావాలతో కనిపించినా,
వాస్తవానికి ఒకదానికింకోటి పూరకమే!
భిన్నత్వంలో ఏకత్వం.
ఏకత్వంలో భిన్నత్వం.
ఇదే జీవన తత్వం
ఇదే గ్రహించాల్సిన సత్యం. @శ్రీ
పరస్పరం విరుద్ధమైన భావాలతో కనిపించినా,
వాస్తవానికి ఒకదానికింకోటి పూరకమే!
భిన్నత్వంలో ఏకత్వం.
ఏకత్వంలో భిన్నత్వం.
ఇదే జీవన తత్వం
ఇదే గ్రహించాల్సిన సత్యం. @శ్రీ
jivita varnana baavundi
ReplyDeleteమీకు జీవిత సత్యం నచ్చినందుకు
Deleteధన్యవాదాలు మంజు గారూ!
@శ్రీ
చాలా బాగుంది శ్రీ గారు...
ReplyDeleteజగమే మాయా బ్రతుకే మాయా ఈ కవితలో సారం ఇంతేనయ్యా ..
ధన్యవాదాలు ప్రిన్స్...
Deleteమొత్తమ్మీద సముద్రాల గారి పాటను గుర్తుకి తెచ్చానంటారు...:-)
@శ్రీ
manchi doubt vachindandi meeku, samadhanam kooda meere chepparu kabatti
ReplyDeletesaripoindi, leka pothe aalochanallo munagalsi vachedi.
good one, keep writing.
నాకు సందేహం అంతే జనం సందేహం అన్నమాట..:-)))...
Deleteతీర్చాలనిపించి ...పరిశోధించేసి...
నా బాణీలో వ్రాసేసి మీకందరికీ నచ్చేలా పంచేసాను..:-)
మీ స్పందనకి ధన్యవాదాలు భాస్కర్ గారూ!..
@శ్రీ
నానా విథములు పువ్వులు -
ReplyDeleteతేనొకటే - అందులోని తీపియు నొకటే -
ఙ్ఞానాగ్ని యందు కాల్చిన
వానంతటె తొలగి వోవు వైరుధ్యంబుల్ .
----- సుజన-సృజన
విరులు వేరయినా విరితేనియ ఒకటే...
Deleteవిరుధ్యాలని కాల్చే జ్ఞానాగ్ని కోసం వెదుకుతుంటాం
(జ్ఞానం మనలోనే ఉందని గ్రహించక...)
అక్షర సత్యాన్ని పద్యంలో చెప్పిన మీకు అభినందనలు...
కవితా సారాన్ని పద్యంలో చూపినందుకు ధన్యవాదాలు
రాజారావు గారూ!
హ హా...శ్రీ గారూ,
ReplyDeleteఏదో ప్రేమతత్వం చెప్తున్నారనుకుంటూ చివరిదాకా చదివితే చివరికి విశ్వతత్వం ,జీవన తత్వమే చెప్పేశారు ఏకంగా...
చాలా బాగా భావాన్ని చక్కని పదాల కూర్పుల్లో చెప్పగలిగారు.
అభినందనలు!
మీరు పెట్టిన కొత్త పాట విన్న వెంటనే ఆకట్టుకుంది, మీ కవితల్లానే ;)
మీ హృదయపూర్వకమైన ప్రశంసకి,
Deleteపాట నచ్చినందుకు...
బోలెడు ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!
మీ విశ్లేషణ ఎపుడూ బాగుంటుంది..
మీ చిత్రంలానే ...:-)
@శ్రీ
జన్మ వెలుగైతే...
ReplyDeleteమృత్యువు చీకటి...
ఈ రెంటి మధ్యే కదా జీవితం!
ఈ కవితకి ఈ లైన్స్ హైలైట్...
పాట బాగుందండి...
జీవితం తెలుపు నుంచి నలుపుకే పయనం....
Deleteకానీ మన దృక్పథం మాత్రం
నలుపు నుంచి తెలుపు కి ఉండాలన్నదే నా అభిమతం...
అంటే ధనాత్మకంగానే ఉండాలని...
మీకు కవితా భావం, పాట
నచ్చినందుకు ధన్యవాదాలు పద్మ గారూ!
@శ్రీ
శ్రీ గారూ జనన మరణాల మధ్య జీవితం గురించి అందమైనా కవితలో చెప్పారు. చాలా బావుంది.
ReplyDeleteకవితా సారం గ్రహించిన మీకు ధన్యవాదాలు జ్యోతి గారూ!
Delete@శ్రీ
భిన్నత్వంలో ఏకత్వం...
ReplyDeleteఏకత్వంలో భిన్నత్వం...
ఇదే జీవన తత్వం
ఇదే గ్రహించాల్సిన సత్యం.......
well said.
baavundandee!
వనజ గారూ!
Deleteఅంతే కదండీ మన జీవితం...
మీరు కవితలోని సారాంశాన్ని
గ్రహించారు...
ధన్యవాదాలు మీకు...
@శ్రీ
శ్రీ గారూ, కవిత కొంత వేదాంతపు ధోరణిలో సాగినా జీవిత సత్యాన్ని చీప్పారు బాగుంది మంచి భావజాలంతో
ReplyDeleteఫాతిమా గారూ!
Deleteమీరు కవిత మెచ్చినందుకు...
భావాల సమావేశాన్ని గుర్తించినందుకు
ధన్యవాదాలు మీకు...
@శ్రీ
వాట్ ఏ కలర్ఫుల్ పొఎం...క్రిష్
ReplyDeletethank you krish...
Deletefor your colourful compliment...:-)
@sri
వావ్.......భలే చెప్పారు శ్రీ గారు.......
ReplyDelete.చాలా బాగుంది....
అందరిలో కొన్ని సార్లు ఒంటరితనం అనుభవిస్తాం
ఒంటరిగా ఉన్నా అందరితో ఉన్నట్టు అనుభవించగలం ..!! (జ్ఞాపకాలతో)
చాలా బాగా ఉంది అండీ....:) :)
వావ్.......భలే చెప్పారు శ్రీ గారు.......
Delete.చాలా బాగుంది....
అందరిలో కొన్ని సార్లు ఒంటరితనం అనుభవిస్తాం
ఒంటరిగా ఉన్నా అందరితో ఉన్నట్టు అనుభవించగలం ..!! (జ్ఞాపకాలతో)
చాలా బాగా ఉంది అండీ....:) :)
కవిత మీకు నచ్చినందుకు,
Deleteమీ ప్రశంసకి...(స్పెషల్ గా 'వావ్'కి)..:-))
ధన్యవాదాలు సీత గారూ! :-)
అంతే...
మనం ఎప్పుడూ ఒక్కరం ఉండము...
మనతో మన ఒంటరితనం ఎపుడూ తోడుంటుంది...
@శ్రీ
శ్రీనివాస్ గారు చాలా బాగారాసారు.... సూపర్..
ReplyDeleteసాయి సూపర్ అంతే మరి సూపరేనన్నమాట...:-)
Deleteకవితపై స్పందనకి ధన్యవాదాలు...
@శ్రీ
ప్రేమ కవితలనుండి జీవిత సత్యాలను ఆవిష్కరించిన మీకు ముందుగా అభినందనలు.మీ కవిత విభిన్న అంశాలను కలుపుతూ ఒక ప్రవాహం లా సాగింది.చక్కని జీవిత సారం.
ReplyDeleteమీరు విశ్లేషించిన తీరు నచ్చేసింది రవి శేఖర్ గారూ!
Deleteమీ అభినందనలకి చాలా సంతోషమనిపించింది..
మీకు మనః పూర్వకమైన ధన్యవాదాలు...
@శ్రీ
జీవిత సత్యాన్ని కవిత రూపంలో చెప్పారు. చాలా బాగుంది శ్రీ గారు!
ReplyDeleteకవితని మీరు మెచ్చి ప్రశంసించినందుకు
Deleteధన్యవాదాలు నాగేంద్ర గారూ!
@శ్రీ
"సప్త స్వరాలు వేరైనా
ReplyDeleteఅవి కలిస్తేనే కదా సుమధుర సంగీతం!..."
"భిన్నత్వంలో ఏకత్వం..." గురించి మీ కవిత బాగుంది...
కవితలు,కవితలకి తగిన పాటలు అన్నీ చాలా బాగున్నాయండీ..
చాలా రోజుల తర్వాత ఈ రోజే మీ కవితలన్నీ చదివేశాను :)
ఈ మౌనం ఈ బిడియం...
ReplyDeleteతర్వాత కనిపించలేదేమిటా అనుకుంటున్నానండీ!..:-)
(అదేనండీ...మీ ఆపాత మధురాలలో పాట):-)
ముందువన్నీ చదివేసినందుకు,
నా కవితను మెచ్చేసినందుకు,
తత్సంబంధిత గీతాలు మీకు నచ్చేసినందుకు
బోలెడు ధన్యవాదాలు రాజి గారూ!...:-)
మళ్ళీ మధుర గీతాలు కనిపిస్తాయనమాట మీ బ్లాగ్ లో...:-)
@శ్రీ
ఆలశ్యంగా కామెంట్ పెడుతున్నాను.
ReplyDeleteనాకైతే కవిత లో మీరు బోదించిన సత్యం పూర్తిగా అర్ధమయ్యింది.
చిత్రం, ఇంకా కవిత రెండు ఆకట్టుకున్నాయి.
చిత్రం, కవిత రెండూ నచ్చాయన్నారు...
Deleteమీ ప్రశంసకి ధన్యవాదాలు వెన్నెల గారూ!
@శ్రీ