కోమలితో కోలాటాలు...
సరసిజతో సల్లాపాలు...
మందాకినితో మదన క్రీడలు...
జలజాక్షితో జలక్రీడలు...
పద్మాక్షితో పూబంతులాట...
పావనితో పాచికలాట...
వయ్యారితో ఒప్పులకుప్పలు...
చంద్రముఖితో చెమ్మచెక్కలు...
హాసినితో పరిహాసాలు..
దామినితో దాగుడుమూతలు...
ఊర్వశితో ఉయ్యాలాటలు
గీతికతో గానలహరులు...
నందినితో నౌకా విహారాలు...
వనజతో వన విహారాలు...
ఓ లలన బుగ్గల సిగ్గులు చిదుముతూ ఒక చోట...
ఓ చంచల చెంగు లాగుతూ వేరొక చోట...
ముద్దులు దొంగిలిస్తూ ఒకచోట...
ఆలింగన సుఖమిస్తూ మరొక చోట...
అలుక తీరుస్తూ ఒక చోట...
కొప్పున పూలచెండు పెడుతూ వేరొకచోట..
మాలినితో మణిమండపంలో...
సారణితో సైకత వేదికలపై...
కౌముదితో క్రీడాపర్వతాలపై...
లహరితో లతా మండపాలపై...
ఇటు చూస్తే...కృష్ణుడు...
అటుచూస్తే కృష్ణుడు....
సర్వం కృష్ణ మయం..
బృందావనం... సరస సల్లాపాల కేళీవనం..
మురళీరవాల మోహన సంగీత మయం....
అందరికీ ఒక్కరు...ఒక్కరికీ అందరుగా కనిపించే దృశ్యం...
మాయలమారి మాయా వినోదం...
పదహారు వేలమంది కృష్ణుల సందర్శనం...
అపురూపం...అద్భుతం...అనిర్వచనీయం....
చాలా బాగుంది శ్రీ గారు!
ReplyDelete(పాట మార్చలేదు ఇంకా.. :)))
మీకు కవిత నచ్చినందుకు
Deleteధన్యవాదాలు హర్షా!
మార్చిన పాట వినేసే ఉంటారు...:-))
@శ్రీ
మీ కవిత నిండా మన బ్లాగుల పేర్లే కనిపిస్తున్నట్లున్నాయ్, చక్కగా రాశారు, అభినందనలు.
ReplyDeleteకన్నయ్య చేసే చర్యలకి , ప్రాసతో పేర్లు వ్రాసేశాను అంతే.
Deleteమీరేమో బ్లాగుల పేర్లంటారు..
వాళ్ళ పేర్లు లేవని కొంత మంది యుద్ధం ప్రకటిస్తున్నారు..:-))
ఎలా చెప్పండి...
మీ అభినందనలకి, ప్రశంసకి ధన్యవాదాలు భాస్కర్ గారూ!
@శ్రీ
కృష్ణా కృష్ణా......!!!!
Deleteమీ కవిత చాలా చాలా బాగుందండీ! చదువుతుంటే దృశ్యం కళ్ళముందు కనిపిస్తోంది.
ReplyDeleteమీ పద్ధతే నాకేం నచ్చలేదు :( శ్రీకృష్ణునికి ఆటలు వారితోనేనా? మాతో లేవా?
మధురవాణి గారూ ఒకసారి రండి. మనిద్దరం దీనిని తీవ్రంగా ఖండిద్దాం.
రసజ్ఞ గారూ!
Deleteమీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు...
ముఖ్యమైన వాళ్ళ పేర్లు అష్ట భార్యల కవితలో బ్రాకెట్లో వ్రాద్దామని చిన్న ఆలోచన.
అన్నట్లు రాధ మాధవుల కవిత కూడా ఉందండోయ్...:-)
ఇద్దరి అప్లికేషన్స్ వచ్చాయి మరో ఆరు కావాలి...:-))...
అందుకే ఈ కవితలో ఆ పేర్లు వ్రాయలేదు అంతే...:-))
@శ్రీ
సర్వం కృష్ణ మయం.
ReplyDeleteఅయినవాడే అందరికి
ఎవరికీ చెందని వాడు..
అందరికి ఆనందం ఇచ్చేవాడు. ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం ని నింపేవాడు.
కృష్ణ లీలల పరమార్ధం తెలుసుకుంటే ఆంతా ఆనందమయం.
చాలా బాగుంది. సంతోషం . శ్రీ గారు. ధన్యవాదములు.
నంద నంద గోపాలా..
Deleteఆనంద నంద గోపాలా...
ఆనంద నంద యదునంద గోపాలా...
అంతే వనజ గారూ!
మీరన్నది నిజం...
మీ ప్రశంసకి ధన్య వాదాలు మీకు..
@శ్రీ
రసజ్ఞగారు,
ReplyDeleteనేనూ ఖండించేశా.
(అయినా మన బ్లాగులో వచ్చి మనతో ఆడతాడుగా, వదిలేద్దాం.)
నా లక్ష్మితో నేను బృందావన విహారం చేయాలి గాని,
Deleteఆ క్రిష్ణయ్య ఎవరు??
వ్రాసిందెవరు??
అంటూ నాపైకి మీవారు యుద్ధానికి వస్తే నేనేమి చెయ్యాలి చెప్పండి???:-))
(just kidding..:-)))...)
మీ వ్యాఖ్యకి ధన్య వాదాలు లక్ష్మీదేవి గారూ!
@శ్రీ
గోపికలతో జలకాలాటలు కడు రమణీయం ...కమనీయం...
ReplyDeleteమీ నాలుగో కవిత ఎంతో మధురంగా...మనోహరంగా వుంది.
తొలకరి జల్లులా ఉంది మీ వ్యాఖ్య నాగేంద్ర గారూ!
Deleteధన్యవాదాలు కవిత, చిత్రం మీకు నచ్చినందుకు...
@శ్రీ
నల్లనయ్య లా మనం అందరికి అన్నీ అయి బతకాలి.
ReplyDeleteఅంతే శర్మ గారూ!
Deleteఅందరికీ అన్నీ అయి బ్రతికితేనే ఆ బ్రతుకుకి సార్థకత...
ధన్యవాదాలు మీకు...
@శ్రీ
అన్ని పనులు చేస్తూ అందరినీ అలా అలరించడం మన కృష్ణయ్య వల్లనే సాధ్యం...!!
ReplyDeleteఇలా కృష్ణకవితలు రాసి మదిని ఆనందింపచేయడం మీ వల్లనే
సాధ్యం .!!
సూపర్ అండీ :)
జై శ్రీ కృష్ణ
సీత గారు కవిత ఇంకా చూడలేదేమిటా అనుకుంటున్నాను...:-)
Deleteధన్యవాదాలు చక్కని మీ ప్రశంసకి...:-)
నా సంకల్పానికి అక్షర రూపం యివ్వడం కన్నయ్య దీవెనలతోనే సాధ్యమౌతోంది..
@శ్రీ
చాలా బాగుంది... శ్రీ గారు...
ReplyDeleteధ్యాంక్యూ pics సూపర్ గా ఉన్నాయి..
కవిత, చిత్రాలు నచ్చినందుకు
Deleteధన్యవాదాలు సాయీ!
@శ్రీ
శ్రీ గారూ, కవిత రాయటం అందరు కవులూ చేస్తారు . కానీ దాన్ని ఓ యజ్ఞంగా తీసుకొని, భక్తిగా, రాయటం కొందరికే సాద్యం, భాహుసా ఆ కొందరిలో మీరు ఒకరు కావచ్చు.కవితల్లో భక్తి ని మన మిత్రులంతా పొగిడారు. చిత్రాలు చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా రాయండి. మీ పదాల అల్లిక బాగుంది
ReplyDeleteమీ విశ్లేషణకి, ప్రోత్సాహానికి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
Deleteమీ ప్రోత్సాహం నాకు కొత్తవి వ్రాసేందుకు బాటలు వేస్తోంది..
@శ్రీ
శ్రీ గారూ,
ReplyDeleteవరుసగా 'కృష్ణ' 'శ్రీ' కవితలు భలే రాస్తున్నారు, మంచి గానంలా ఆలపించటానికి తగ్గట్టుగా ఉన్నాయనిపిస్తుంది. రాగం కట్టటం వచ్చి ఉంటే వెంటనే ఆపనిలో ఉండేవాళ్ళం అనిపించింది. చాలా బాగుంది. బొమ్మల్లో కృష్ణున్ని భామాకలాపాలు చక్కగా చిత్రించారు చిత్రకారులు.
సరసిజ అంటే ఏంటా అని ఎంత ఆలోచించినా అర్ధం బోధపడలేదు.
శ్రీ కృష్ణుని సందర్శనమేమో కానీ మీ కవితా దర్శనం తో అందరికి అలా జలకాలాడాలని కోరికలు కలుగుతున్నాయి.ఎంత మధురమైన అనుభవం.చాలా బాగా వ్రాసారు.
ReplyDeleteరవి శేఖర్ గారూ!
Deleteధన్యవాదాలు మీ ప్రశంసకి...
కన్నయ్య ఆశీస్సులతో నీ ఆయన లీలలలు మీ అందరితో పంచుకోవాలనే
నా చిన్న ప్రయత్నాన్ని బ్లాగ్ మిత్రులంతా ప్రోత్సహిస్తున్నారు..
క్రిష్ణయ్యలా జలకాలాటలు ఆడండి...కాని ఒక్కరితోనే సుమా!...:-))
@శ్రీ
ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!
ReplyDeleteమీకు కవితలు నచ్చినందుకు...
హృదయపూర్వకమైన మీ ప్రశంసకి...
చిత్రాలలో కొన్ని నేను సేకరించినవి.
మరికొన్ని వెన్నెల గారు krishna mukunda muraari ppt లోవి
నేను చూసి రిక్వెస్ట్ చేస్తే నాకు పంపించారు..
'సరసిజ' ఆంటే సరస్సు నుండి పుట్టినది..(కమల..నీరజ..పద్మ...వగైరా)
శృంగార భావం కావాలనుకుంటే సరసం నుంచి పుట్టినదని కూడా అనుకోవచ్చు...:-)
@శ్రీ
శ్రీ గారు, కృష్ణయ్య మీద కవితలన్ని చాలా బాగున్నాయండి.
ReplyDeleteఈ కవిత చాలా బాగుంది. భాస్కర్ గారు చెప్పింది నిజం. మరి నా బ్లాగ్ పేరు, భాస్కర్ గారి బ్లాగ్ పేర్లు ఏవి , చెప్పండి? :))
పాట చక్కగా ఉంది.. కవిత అంతకంటే బాగుంది. మీకు అభినందనలు.
ధన్యవాదాలు వెన్నెల ప్రసరించినందుకు...:-)
ReplyDeleteమీరు చూడకుండా అభాండాలు వేస్తున్నారు.
'జలతారు వెన్నెల' లోనే కదండీ జలక్రీడలు...:-)
'చెట్టు' నీడలో, చెట్ల చాటునే కదా రాసలీలలు..(THE TREE)...:-)
పాట ఎంపిక, కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు వెన్నెల గారూ!
@శ్రీ
"అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ"
ReplyDeleteఅంటూ కన్నయ్య బృందావనంలో ఆటలాడేస్తున్నాడన్నమాట..
బాగున్నాయండీ కృష్ణలీలలు!!కవిత చాలా బాగుంది.
కన్నయ్య బృందావన లీలలు మీకు నచ్చినందుకు,
ReplyDeleteకవితని మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు రాజి గారు...
@శ్రీ