
లోకమంతా చంద్రుని చల్లని వెన్నెలలో తడుస్తోంది..
ఎర్రకలువ రేకుల మెత్తదనంతో పోటీ పడే నీ పాదాలు
వెన్నెల కాంతిలో మెరుస్తుంటే చూడాలని ఉంది.
'నీలో మచ్చ ఉంది'.
'నాలో మచ్చ లేదు' అని చంద్రుని ఎగతాళి చేసే
నీ ముఖ చంద్రబింబాన్ని చూడాలని ఉంది.
ఎగిరే నీ ముంగురులలో వెన్నెల ప్రతిఫలింప జేసి...
వింతశోభను నీ ముంగురులకు అందించిన
ఆ చంద్రబింబాన్ని చూడటం కంటే,
నీ మోములోని చంద్రుని చూడటమే నాకు ఇష్టం ప్రియా!....
కరుణించవా?
నా చీకటి జీవితంలో వెన్నెల కురిపించవా?