
నవమాసాలు మోసి ఉత్కృష్టమైన
మానవ జన్మనిచ్చిన నీవు...
వెండి గిన్నెలోని పప్పుబువ్వను ప్రేమగా
గోరుముద్దలు చేసి తినిపించిన నీవు...
పిడుగుపాటుకి ఉలిక్కిపడితే
వేసవి వేడిలో నీవు మేల్కొని

పరీక్షలకి చదువుతున్నపుడు
అక్కున చేర్చుకొని అర్జునా! ఫల్గునా! అనే నీవు...
అలారం కొట్టక ముందే
కాఫీ కప్పుతో నన్ను నిద్రలేపే నీవు...

వేసవి వేడిలో నీవు మేల్కొని
నన్ను నిద్రబుచ్చుతూ విసనకర్ర వేసే నీవు...
చలి కాలపు రాత్రులలో మాటిమాటికీ
కంబళి సరిగా కప్పే నీవు...

పరీక్షలకి చదువుతున్నపుడు
పెరుగన్నపు ముద్దతో నీవు...
క్లాసులో ఫస్టు వచ్చినపుడు
పాయసపు పాత్రతో గుమ్మం లోనే ఎదురయ్యే నీవు...
నాన్న కొట్టిన దెబ్బలకి
వెన్న పూస్తూ ఓదార్చే నీవు.....
నీ ప్రేమ, మమత ,క్షమ
అన్నీ నాకు రక్షగా ఉన్నాయి...
అన్నీ నాకు రక్షగా ఉన్నాయి...
అద్భుతమయిన వ్యక్తీకరణ! మధురమయిన జ్ఞాపకాలను గుర్తుచేస్తూ చివరలో కంట తడి పెట్టించింది.
ReplyDeleteమీకు నా మనోభావాలు నచ్చినందుకు
Deleteచాలా ధన్యవాదాలు...రసజ్ఞ గారూ!
అన్నట్లు మీకు కందుకూరి శ్రీరామ చంద్ర మూర్తి గారు (కాకినాడ) తెలుసా?
ఆయన గురించి మీ ద్వారా ఒక ఆర్టికల్ పోస్ట్ చేయించాలని ఉందండీ!
..@శ్రీ
అమ్మ జ్ఞాపకాలు వెన్న మీగడలు, వెన్నెల తరకలు. అమ్మను గుర్తు చేసుకునే సంస్కారవంతమైన కొడుకులున్న అమ్మలు ధన్యులు , అమ్మకు , అమ్మమ్మకు , ఆత్మా శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను శ్రీ గారూ
ReplyDeleteమీ ప్రశంసకి ధన్యవాదాలు ఫాతిమా గారూ!
Deleteమీరు కోరినట్లే ,నేను కూడా వారి ఆత్మశాంతికై
మరోసారి ఆ దేవుని వేడుకుంటున్నాను...
@శ్రీ
అమ్మమ్మ కూ, అమ్మ కూ ఆత్మ శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ
ReplyDeleteవాళ్ళ ప్రేమని గుర్తుచేసుకుంటూ ఆ భావనలు ఈ కవితలో మాతృప్రేమ అంత తియ్యగా చెప్పారు.
మీ స్పందనకు...
Deleteచాలా ధన్యవాదాలు చిన్నిఆశ గారూ!
@శ్రీ
యెంత ఎదిగినా ,ఎన్ని ఉన్నా "అమ్మ" ఉంటే బిడ్డకి ఎప్పుడు అని ఉన్నట్టే ! మీ అక్షరాలలో..మా తృ ప్రేమ పెల్లుబికింది. ఆ ప్రేమ మిమ్మల్ని మును ముందుకు నడిపిస్తుంది.
ReplyDeleteకీప్ ఇట్ అప్ !!
బాగా వ్రాసుకున్నారు. "అమ్మ" గుర్తుకొచ్చే లా"
మీరన్నది నిజమే...
Deleteఎంత ఎదిగినా తల్లికి వాళ్లింకా పసిపిల్లల లాగే కనిపిస్తారు..
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు వనజగారూ!
@శ్రీ
శ్రీ గారు. మీకు చాలా చాలా థాంక్స్.అమ్మ మీద కవిత ఎప్పుడు రాస్తారా అని ఎదురుచూసా! As usual చాలా బాగుంది! You express yourself so well. ధన్యవాదాలండి మీకు.
ReplyDeleteవెన్నెలగారూ!
ReplyDeleteమీ బ్లాగ్ లో చిత్రాలకి స్పందించినపుడు,
మీ ప్రతి స్పందన చూసినప్పటినుంచీ వ్రాయాలనుకున్నా
వ్రాయలేకపోయాను...
23 వ తేదీ రాత్రి 01 :30 కి నిద్ర రాక అమ్మ గుర్తొచ్చి కేవలం 10 నిముషాల్లో వ్రాసుకున్న కవిత ఇది.
(సరిగా అదే రోజుకి ఆవిడ కాలం చేసి సంవత్సరం అయింది)...
అడగగానే చిత్రాలు అందించినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు..
కవితని మీరు మెచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు..
@శ్రీ
శ్రీ గారు
ReplyDeleteమాతృప్రేమ మాధుర్యాన్ని మరింతగా ముందుంచారు ..!!
చాలా బాగా రాసారు అండీ..!!
అమ్మమ్మ కూ, అమ్మ కూ ఆత్మ శాంతి ప్రసాదించాలని కోరుకుంటూ...
సీత..
మీకు కవిత నచ్చినందుకు బోలెడు ధన్యవాదాలు సీత గారూ!
ReplyDeleteమీరు అన్నట్లుగా వారి ఆత్మకి శాంతి కలగాలనే
మరోసారి కోరుకుంటున్నాను నేను కూడా...
@శ్రీ
This photo is taken from the calendar "MAA"
ReplyDeleteTo view more images like this visit
http://multygraphics.com/calendar/maa-hindi
thank you very much for putting good pictures in ur blog...
ReplyDeleteif i need i'll take the pictures...
once again thanks for ur kind concern..
@sri
God Bless you - dont have words
ReplyDeletehttp://www.facebook.com/groups/mother.prema
ReplyDeleteప్రతిమనిషి జీవితంలో అమ్మ ప్రాముఖ్యత
ReplyDeleteమీరు రాసిన కవితలో ఉంది
అలాగే నేడు అమ్మలకు ఇంతటి ప్రాధాన్యత
బిడ్డలు ఇవ్వడంలేదు వందకి ఓ పదిమంది తప్ప
హృదయాన్ని తట్టిలేపే మదురమైన జ్ఞాపకాలను
గుర్తుచేశారు...!చివరన కళ్ళలో నీటిపొరనూతెప్పించారు
❤💙🙏🙏🙏🙏🙏