04/10/2012

నా పంచప్రాణాలకు శ్వాసవు నీవేనీ  కాలి మువ్వల సవ్వడి  చాలు...
            నా మనసు సరిగమలు పలికేందుకు...

నీ కనుచూపుల దివ్వెలు చాలు
            నా మది వాకిలిని వెలుగుతో నింపేందుకు...

నీ చిరునవ్వుల విరిజల్లులు చాలు...
           చిరుకవితల మాలలు  అల్లేందుకు...

నీ పసందైన పలకరింపులు చాలు...
         ప్రణయ  ప్రబంధాలు వ్రాసేందుకు....

నీ తేనెలూరే మాటలు చాలు...
           నీ కోసం తేటగీతులు వ్రాసేందుకు...

నీ గాజుల గలగలల మ్రోత చాలు...
           నీకై గానలహరి పాడేందుకు...

నీవు ప్రేమించే ప్రేమ చాలు...
          ఆ ప్రేమను నేను ప్రేమించేందుకు...

'నీ ప్రేమను  నేనే' అనే నీ మాట  ఒక్కటి  చాలు...
          'నా పంచప్రాణాలకు  శ్వాసవు నీవే' అనేందుకు...  @శ్రీ