14/10/2012

అమితానందంవిరిసినమల్లెలు నీ నీలికురులకు అందం...
విడిన కొప్పు నా ముఖాన్ని కప్పితే ఆనందం...

నల్లని కాటుక నీ వాలు కన్నులకు అందం...
 చూపుల గాలానికి నా మనసు చిక్కుకుంటే ఆనందం...

ఎర్ర గులాబి రంగు నీ పెదవులకు
  అందం...
ఆ పెదవులు పదే పదే నా నామమే స్మరిస్తే  ఆనందం...

నల్లని అంచు నీ తెల్లని చీరెకు అందం....
ఆ కొంగున ముడిపడి నీతో ఉంటే ఆనందం...

నున్నని
 బుగ్గల ఎర్రని సిగ్గుల కెంపులు  నీకు అందం...
ఆ సిగ్గుల మొగ్గలు నా చెక్కిలిపై విచ్చుకుంటే ఆనందం...

తెల్లని పట్టీలు నీ అందాల పాదాలకు అందం...
వాటి మువ్వల సవ్వడులు  నా చెవులకు ఆనందం...

నందన వనమున సైతం...అందని 'అందం' నీ 'అందం'...
ఆ అందము పొందిన డెందము పొందెను
అమితానందం....@శ్రీ 


28 comments:

 1. నందన వనమున సైతం...అందని 'అందం' నీ 'అందం'...

  అబ్బా.. చాలా బాగున్నాయి ఆ లైన్లు....

  --సాయి

  ReplyDelete
  Replies
  1. నీ ప్రశంసకు బోలెడు ధన్యవాదాలు సాయి...
   చాలా రోజులకి దర్శనం....:-)
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 2. nice pic and very very beautiful poetry

  ReplyDelete
  Replies
  1. మీ ప్రశంసకు ధన్యవాదాలు రమేష్ గారూ!
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 3. నల్లని అంచు నీ తెల్లని చీరెకు అందం....
  ఆ కొంగున ముడిపడి నీతో ఉంటే ఆనందం...
  ide kadaa prathi stree korukonedi tana naadudu konguna kattubadi undaalani. mee prathi kavitalo manichi bhaavukatha untundi.

  ReplyDelete
  Replies
  1. కొంగున ముడి పడి ఉండటం వరకే నండోయ్...
   కొంగున కట్టుకుని చుట్తో తిప్పుకుంటే కష్టమండోయ్...:-)
   ధన్యవాదాలు మెరాజ్ గారూ! మీ ప్రశంసకు, ప్రోత్సాహానికి.
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 4. sree garu, kavithalo edo maarpu kanipistundi aksharaalu andamgaa unnaayi bhaava prabhaavamaa?

  ReplyDelete
  Replies
  1. bapu fonts (సుగుణ) లో పోస్ట్ చేసాను....
   భావాల వలన అక్షరాలు అందంగా కనిపిస్తే చాలా సంతోషం @శ్రీ

   Delete
 5. తెలుగు భాషలోని తీయటి పదాలతో అల్లిన కవిత అమితానందంగా వుంది.
  ఈ కవితలో పదాలు అలరించాయి... భావాలు పరిమళించాయి.

  ReplyDelete
  Replies

  1. పరిమళ భరితమైన మీ ప్రశంస నా కవితను సుగంధ భరితం చేసింది
   నాగేంద్ర గారూ!...ధన్యవాదాలు మీకు...@శ్రీ

   Delete
 6. అందమే అమితానందమంటూ...
  కవిత పాట రెండూ బాగున్నాయండీ..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు రాజి గారూ!...
   కవితాభావం, ఎంచుకున్న పాత మీకు నచ్చినందుకు...
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 7. శ్రీ గారు వర్ణన..భావం రెండు బాగున్నాయి.
  మీ కవితలు అన్నీ ఒకదానిని మించి ఒకటి ఉంటున్నాయండి.

  ReplyDelete
  Replies
  1. ప్రతి టపాకీ ప్రోత్సాహాన్నిస్తూ
   చేసే స్నేహపూర్వకమైన ప్రశంసకు
   ధన్యవాదాలు వనజ గారూ!...
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 8. అందం ఆనందం అంటూ మా డెందమును ఊగించారండి.చక్కని కవిత్వం.అద్భుత మైన చిత్రం.బాపు గారిదనుకుంటా!

  ReplyDelete
  Replies
  1. మీ మదిని ఆనందపరచిన నా కవితను
   ప్రశంసించిన మీకు ధన్యవాదాలు రవిశేఖర్ గారూ!
   చిత్రం వడ్డది పాపయ్య గారిది...
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 9. హ హా...బాగుందండీ కవిత.
  అందము పొందిన డెందము....అన్నారు... ఇది చదివి డెందము పొందెను అమితానందం ;)

  ReplyDelete
  Replies
  1. మీ ఉల్లమునకు ఉల్లాసాన్నిచ్చిన కవితను
   మీరు ప్రశంసించినందుకు ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ! :-)
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 10. ఎంతవారుగానీ.....వేదాంతులైనగానీ
  వాలుచూపు సోకగానే తేలిపోదురు:-)
  ఇంతందమైతే....అమితానందమే కదా!

  ReplyDelete
  Replies
  1. అలా అన్నా, ఎంతవారలైన కాంత దాసులే అన్నా..:-)
   నిజంగా దాసులయ్యేది భౌతికమైన అందం
   వెనుక దాగిన మనసు అందానికే కదా పద్మ గారూ!:-)
   మీ స్పందనకు ధన్యవాదాలు...
   మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు...@శ్రీ

   Delete
 11. enta baagaa varninchaaru baavundi paata kudaa:)

  ReplyDelete
 12. కవితాభావం నచ్చినందుకు ,
  ఎంచుకున్న పాట మెచ్చినందుకు
  ధన్యవాదాలు మంజు గారూ!...@శ్రీ

  ReplyDelete
 13. బొమ్మలోని అందాన్ని కవితలో ఆస్వాదించేలా బాగారాసారు.

  ReplyDelete
  Replies
  1. నా భావాలు సమర్పించిన తీరు మీరు మెచ్చినందుకు
   ధన్యవాదాలు సృజన గారూ!...@శ్రీ

   Delete
 14. Sree garu sernnavaraatrulu meeku mee kuntunbaaniki subam tevaali

  ReplyDelete
 15. ధన్యవాదాలు మెరాజ్ గారూ!...
  మీకందరికీ ఆ అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుతూ...@శ్రీ

  ReplyDelete
 16. Replies
  1. ఎంచుకున్న చిత్రం ,
   కవిత నచ్చినందుకు
   ధన్యవాదాలు అనికేత్ గారూ !...@శ్రీ

   Delete