17/09/2016

|| పడిపోయా - తెలుగు గజల్ ||

తొలిసారిగ నిన్నుచూసి ప్రేమలోన పడిపోయా 
నవ్వగానె  మల్లెపూల  లోయలోన పడిపోయా  

నీ చూపుల తూపులతో మదినిండా వెన్నెలలే 
చీకట్లను ముంచుతున్న వాకలోన పడిపోయా.

పూవిల్తుని బాణాలకు ఎదురు నిలువలేను కదా
శృంగారపు  హద్దులున్న  కోనలోన  పడిపోయా

సమ్మోహన అస్త్రాలకు నా తనువే లక్ష్యమైంది
కోరుకున్న పరవశాల సీమలోన పడిపోయా 

చీకటిలో చిచ్చురేపు పున్నమిలా నీవుంటే 
నెలరాజా కాంతులున్న సోనలోన పడిపోయా #శ్రీ