20/04/2012

వెన్నెల వర్షంవెన్నెల వర్షంలోని  ప్రతి చినుకు
నను తాకి...ఆవిరౌతుంటే.....

సుగంధభరిత శీతల పవనాలు  
నను తాకి వేసవి వడగాడ్పులౌతుంటే...

గంధపు పూత సైతం 
నా తనువుని  తాకి  పొడిపొడిగా రాలి పోతుంటే....

నీ ప్రేమామృత వర్షమే నను చల్లబరచాలి...
నీ ప్రణయ పవనమే  నా తాపాన్ని తగ్గించాలి...
నీ మేని పరిమళమే  నాకు హరిచందనమవ్వాలి ....                    @శ్రీ