22/05/2012

ప్రేమ తపస్సుఅరచేతి వెన్నముద్దలా 'నీ ప్రేమ'ని  చూసుకుంటున్నానని మురిసి పోయాను...
కంటిలోని కాంతిలా కాపాడుకుంటూ వస్తున్నానని సంబరపడిపోయాను..

సమయం గడుస్తుంటే.... స్థితి మారిపోయింది....

అరచేతి వేడిమికి వెన్న ఎపుడు కరిగిపోయిందో తెలియలేదు...
కంటిలోని కాంతి ఎపుడు అదృశ్యమైపోయిందో అర్థం కాలేదు.. 

ఆ కరుగుదల మొదలైన తొలిక్షణం ఎపుడో నీవైనా చెప్పవూ?
మాయమైన ఆ కాంతిపుంజం ఎక్కడుందో కాస్తంత వెదికిపెట్టవూ?

గడచిన సమయం మరల  రాదని తెలుసు...

నీకు వింత అనిపించినా సరే...
కాలచక్రాన్ని  వెనక్కి తిప్పే అసాధ్యమైన పనిని మొదలెట్టేసా!
నీ ప్రేమని మళ్ళీ పొందాలనే తపస్సు నేటినుంచే ఆరంభించేసా!