09/09/2016

|| ఉంటుంది - తెలుగు గజల్ ||

నింగిలో జాబిల్లి కదులుతూ ఉంటుంది 
కడలిలో నావలా సాగుతూ ఉంటుంది

ఆకుపచ్చని'కొమ్మ' నచ్చింది కాబోలు 
చినుకొకటి చిగురుపై వాలుతూ ఉంటుంది

కన్నయ్య పోలికలు మధుపానికున్నాయి 
పూవులన్నిటిపైన ఎగురుతూ ఉంటుంది

నా కనుల అద్దాలు చెలిని  చూపిస్తాయి
తనమీద దర్పణం అలుగుతూ ఉంటుంది

నదిలోని అందాన్ని కడలి చూస్తుంటుంది 
అలలతో వంపులను తడుపుతూ ఉంటుంది

'నెలరాజు'నడిగితే వెన్నెలను ఈయడు
మబ్బంటి చీకటే ముసురుతూ ఉంటుంది

ఏ గాలి వీచినా ప్రేమెపుడు ఆరదూ 
గుడిలోన దీపమై వెలుగుతూ ఉంటుంది